California: దక్షిణ కాలిఫోర్నియాలో ప్రకంపనలు భయాందోళనలు కలిగించాయి. శాన్ డియాగోలో 5.2 తీవ్రతతో భూకంపం నమోదయింది. లాస్ ఏంజిల్స్‌తో సహా దక్షిణ కాలిఫోర్నియాలో ప్రకంపనలు కలకలం రేపాయి. ఒక్కసారిగా సంభవించిన భూకంపంతో..జనం భయాందోళనకు గురయ్యారు. ఆఫీసుల్లో ఉండేవారు భయంతో బయటకు పరుగులు తీశారు. శాన్ డియాగోకు సమీపంలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే నివేదించింది.
దక్షిణ కాలిఫోర్నియాలో ప్రకంపనలు జరుగుతూనే ఉంటాయని ప్రజల ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఈ ప్రాంతం రెండు టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల తరచూ భూకంపాలు వస్తాయని వెల్లడిస్తున్నారు.
లాస్ ఏంజిల్స్‌తో సహా దక్షిణ కాలిఫోర్నియాలోని అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. USGS ప్రకారం, జూలియన్‌కు దక్షిణంగా 2.5 మైళ్లు దూరంలో ఉన్న శాన్ డియాగో కౌంటీలో నిస్సార భూకంపం సంభవించింది.
Also Read: ఐపిఎల్ చూస్తూ ప్రమాదవశాత్తు తుపాకీ పేల్చిన బాలుడు.. పొరుగింటి వ్యక్తి మృతి
1994 నార్త్‌రిడ్జ్ భూకంపం:
1994 జనవరి 17న, 6.7 తీవ్రతతో భూకంపం దక్షిణ కాలిఫోర్నియాను తాకింది, ఇది చాలా విధ్వంసకరమైనది. ఇది వేల మంది మరణం మరియు గాయాలకు దారితీసింది. దక్షిణ కాలిఫోర్నియా జనాభా గల ప్రాంతం. ఇక్కడ భూకంపం రావడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది.
ప్రజలకు హెచ్చరిక:
రాబోయే కొన్ని గంటల్లో భూ ప్రకంపనలు సంభవించవచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. 48 గంటల హెచ్చరిక జారీ చేశారు. అవసరమైతనే తప్ప..ప్రజలెవరూ బయటకు రావొద్దని ఇంట్లోనే ఉండాలని చెప్తున్నారు. విలైనంత వరకు చిన్న పిల్లలను, వృద్దులను బయటకు పంపించకూడదు, అలాగే మీరు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. 48 గంటల వరకు ఎవరు బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.