E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్.. ఆస్తుల కోసం శ్రీయ గొడవ.. రాజేంద్ర కిడ్నాప్..

Intinti Ramayanam Today Episode: తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్.. ఆస్తుల కోసం శ్రీయ గొడవ.. రాజేంద్ర కిడ్నాప్..
Advertisement

Intinti Ramayanam Today Episode December 22nd: నిన్నటి ఎపిసోడ్ లో..రాజేంద్రప్రసాద్ ఇంట్లో ఆస్తి కోసం గొడవలు జరుగుతున్నాయని ఒక నిర్ణయం తీసుకుంటాడు. బయట పరిస్థితి ఎలా ఉంది ఎలాంటి పరిస్థితుల్లో అతని పెరిగాడు అన్న విషయాలని కుటుంబ సభ్యులకు తెలియజేయాలని అనుకుంటాడు. ఇక అందరూ కలిసి గోదావరి జిల్లాకు వెళ్తారు. ఆ ఊరి అందాలను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు.. చాలా అందంగా ఉంది ఈ ఊరు అని అవని అంటుంది.. ఇప్పుడు సిటీలో ఉండి ఉండి ఇలాంటి పచ్చని వాతావరణం లోకి రావడంతో మనసు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఇదేంటమ్మా ఇంకా ముందు చాలా బాగుంటుంది అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఈ ఊరిలో మనుషులు అలాగే పచ్చని చెట్లు కల్మషం లేకుండా ఉంటాయి అని రాజేంద్రప్రసాదంటాడు. తాతయ్య మీ ఊరు చాలా బాగుంది తాతయ్య అని ఆరాధ్య కూడా అంటుంది. అక్షయ్ ను అవని మీ ఊరు చాలా బాగుంది మీరు ఏమనుకుంటున్నారు అని అడుగుతుంది. ఈ ఊర్లోకి అడుగుపెట్టదని నేను నా తల్లి ఒడికి చేరుకుంటున్నానని అనిపిస్తుంది అని అక్షయ్ అంటాడు. ఈ ఊరిలో మా అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి వాటిని భద్రంగా దాచుకుంటాను అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ అవని ఇద్దరు కూడా ఆ సమాధిని క్లీన్ చేసి పూలమాల వేస్తారు. నేను పుట్టకపోతే నువ్వు బ్రతికి దానివి కాదమ్మా నన్ను ఎందుకు అమ్మ వదిలేసి పోయావు అని అక్షయ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తన తల్లి సమాధిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎవరెంతగా ఓదార్చినా కూడా అక్షయ్ మాత్రం నా తల్లి నా ముందర లేదు అని బాధపడుతూ ఉంటాడు.. జ్ఞాపకాలని నేను గుర్తుంచుకునే అవకాశం కూడా లేకపోయింది. పొత్తులలో ఉన్నప్పుడే నువ్వు చనిపోయావు అని అక్షయ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తల్లి ఎంతగా బిడ్డని ముద్దుపెట్టుకొని లాలిస్తుందో కదా అనేసి చాలా ఫీల్ అవుతారు.. నువ్వు నాకు మళ్ళీ కనిపిస్తే బాగుంటుందమ్మా అని బాధపడతాడు. ఈ ఊర్లో కూడా మనకి చాలా ఆస్తులు కూడా ఉన్నాయి ఇవన్నీ మీ అమ్మ ఆస్తులు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఇన్ని ఆస్తులున్నప్పుడు మరి అక్కడికి ఎందుకు వచ్చారు అని అడగ్గా.. ఇక్కడ నా భార్య ప్రేమని పొందితే ఇప్పుడున్న నా భార్య ప్రేమని పొందలేకపోతున్నానేమోనని అనుకుంటారు. అందుకే ఇక్కడికి రాలేదు అని రాజేంద్ర అంటాడు..

Advertisement

ఇకపోతే శ్రియ పల్లవి ఇద్దరు కూడా మళ్లీ ఆస్తి కోసం పెద్ద రచ్చ చేస్తారు.. నీకు ఇన్ని ఆస్తులున్నప్పుడు ఇక్కడికి రాకుండా అక్కడే ఎందుకు ఉన్నారు అని ప్రియా అంటుంది. అక్కడ ఆస్తులు పోయాయి కదా మరి ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉండొచ్చు కదా అని అడుగుతుంది. ఆస్తులు గురించి మీకు తెలియజేసేంతవరకు ఇక్కడికి రాకూడదని అనుకున్నాను అందుకే రాలేదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఇక ఇకనుంచి వెళ్దాం పదండి ఇంటికి వెళ్దామని రాజేంద్రప్రసాద్ అక్కడి నుంచి వచ్చేస్తారు. అయితే కొద్ది దూరం వచ్చిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ పై రాళ్లు పెట్టడం చూసి ఏంటి ఇక్కడ రోడ్డు బాగానే ఉంది కదా మరి రాళ్ళు ఎందుకు పెట్టారు అని ఆలోచిస్తూ ఉంటారు..

రాళ్ళని వెళ్లి తీసేద్దాం పదండి అన్నయ్య అనేసి అందరు కలిసి వాటిని తీసేస్తారు.. ఆ తర్వాత రాళ్ళను తీసేస్తూ ఉండగా రాజేంద్రప్రసాద్ నీ కొందరు దుండగులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించేస్తారు. అది గమనించిన అవని అక్షయ్ వాళ్ళని పిలిచి మావయ్య గారిని ఎత్తుకెళ్తున్నారు అని చెప్తుంది.. ఆ తర్వాత ముగ్గురు అన్నదమ్ములు ఆ రౌడీలని చితగ్గొట్టి రాజేంద్రప్రసాద్ ని కాపాడుతారు. ఎవరు వాళ్ళు అని అడిగితే ఏమో రాజేంద్రప్రసాద్ నువ్వే కదా అని అడిగారు అవును అని అనగానే నన్ను తీసుకొని వెళ్ళిపోయారు అని రాజేంద్ర అంటారు.. ఈ సీరియల్లో మరో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. పూరి సర్పంచ్ గా ఒకతను పంచాయతీ చేస్తారు.. సర్పంచు కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థమవుతుంది.

Advertisement

Also Read :జ్యోతిష్యుడు మాట విన్న మనోజ్.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. లక్ష కోసం ప్రభావతి ఆశ..

అందరూ కలిసి రాజేంద్రప్రసాద్ సొంత ఇంటికి వెళ్లి పోతారు. ఇంటిని చూసి అందరూ చాలా బాగుంది అని అనుకుంటారు. పల్లవి శ్రీయాలు మాత్రం ఈ గొప్ప పెంకుటిల్లు కోసం మనం ఇంత దూరం వచ్చామని అంటారు.. అక్కడున్న పని వాళ్ళ అందరితోనూ రాజేంద్ర ప్రసాద్ చాలా ప్రేమగా మాట్లాడుతాడు. ఇంట్లోకి వెళ్ళగానే పనిమనిషి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లేటప్పుడు పల్లవి కి చెయ్యి తగులుతుంది. కొంచెం కూడా బుద్ధి లేదా అని పల్లవి ఆమెపై సీరియస్ అవుతుంది.. రాజేంద్రప్రసాద్ అక్కడున్న పని వాళ్ళందరినీ మీరు ఇళ్లకు వెళ్లిపోండి మేము వెళ్లేంతవరకు మీరు ఇక్కడికి రావద్దు అని అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఆస్తికోసం శ్రియ పల్లవిలు ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×