E-Paper
Advertisement

Bus Accident: కాంక్రీట్ నిర్మాణాన్ని ఢీకొన్న బస్సు.. స్పాట్‌లో 15 మంది మృతి, అర్ధరాత్రి తర్వాత ఘటన

Bus Accident: కాంక్రీట్ నిర్మాణాన్ని ఢీకొన్న బస్సు.. స్పాట్‌లో 15 మంది మృతి, అర్ధరాత్రి తర్వాత ఘటన
Advertisement

Bus Accident: ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు మీదనున్న కాంక్రీట్ దిమ్మను ఢీ కొట్టింది. ఆ తర్వాత బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

ఇండోనేషియాలోని జావా ప్రాంతంలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కాంక్రీట్ నిర్మాణాన్ని ఓ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 15 మంది మృత్యువాత పడ్డారు. ఘటన సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వేగంగా రావడంతో టర్నింగ్ వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలో కాంక్రీట్‌ని ఢీ కొట్టింది.

ఆ తర్వాత బోల్తా పడినట్టు ఇండోనేషియాకు చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ బుడియోనో తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు.. రాజధాని జకార్తా నుండి పురాతన రాజ నగరం యోగ్యకర్తకు ప్రయాణిస్తోంది. సెంట్రల్ జావాలోని సెమరాంగ్ నగరంలోని క్రాప్యాక్ టోల్ వే వద్ద మలుపు తిరిగిన ఎగ్జిట్ రాంప్‌లోకి ప్రవేశిస్తుండగా ఈ ఘటన జరిగింది.

Advertisement

కాంక్రీట్ నిర్మాణాన్ని ఢీకొన్న బస్సు..  15 మంది మృతి

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని బస్సులో నుంచి ప్రయాణికులను బయటకు తీశాయి. బస్సు నుంచి ఆరుగురు ప్రయాణికుల మృతదేహాలను వెలికి తీశాయి. మరో 10 మంది ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు అధికారులు చెప్పారు.

మెరుగైన చికిత్స కోసం అనేక మంది బాధితులను సెమరాంగ్ నగరానికి తరలించారు. ఆగ్నేయాసియాలోని విశాలమైన ద్వీప సమూహమైన ఇండోనేషియాలో రవాణా ప్రమాదాలు సర్వసాధారణం. అక్కడ రవాణాకు పాత వాహనాలను ఉపయోగిస్తుంటారు. వాటికి సరైన నిర్వహణ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతాయని అక్కడి అధికారుల మాట.

ALSO READ:  పల్నాడు జిల్లాలో దారుణం..  ఇద్దరు టీడీపీ కార్యకర్తలను వేటకొడవళ్లతో నరికి

గతేడాది ఈద్ అల్-ఫితర్ జరుపుకోవడానికి ప్రజలు ప్రయాణిస్తున్న బస్సును రెండు కార్లు ఢీ కొట్టాయి. ఈ ఘటనలో 12 మంది మరణించారు. 2019 లో పశ్చిమ సుమత్రా ద్వీపంలో ఓ బస్సు లోయలోకి పడిపోవడంతో 35 మంది మరణించిన విషయం తెల్సిందే. తరచు ప్రమాదాలు జరుగుతున్నా, అక్కడి అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదని అంటున్నారు.

 

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×