Intinti Ramayanam Today Episode January 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ కు గుండెపోటు రావడంతో అందరూ హాస్పిటల్ కి తీసుకెళ్లి పోతారు. పార్వతి టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. అవని పార్వతిని ఓదారుస్తుంది.. ఇక కమల్ కన్నీళ్లు పెట్టుకుంటుంటే అక్షయ్ ఓదారుస్తాడు.. డాక్టర్లు ఇంకా ఏం చెప్పలేదు ఏంట్రా అని పార్వతి అక్షయ్ అని అడుగుతుంది. రిపోర్టులు చూడాలి కదా అమ్మ రిపోర్ట్లు రావడానికి టైం పడుతుంది అందుకే లేట్ అవుతుందేమో అని అంటాడు. ఇక అవని బాధపడకండి అత్తయ్య మావయ్య గారికి ఏమీ కాదు అని అంటుంది. దేవుని ప్రార్థిస్తుంది. నాకు పసుపు కుంకాలు నిలిచేలా చూడు స్వామి అని బాధపడుతుంది. అవని కూడా మా ఇంట్లో ఇటువంటి సమస్యలు జరుగుతున్నయో నీకు తెలుసు స్వామి ఇప్పుడు పెద్దదిక్కైనా మావయ్యను దూరం చేస్తే ఇల్లు అల్లకల్లోళ్ళం అయిపోతుంది.. మావయ్య ఆరోగ్యం సరిగా అయ్యేటట్టు చూడు స్వామి అని కోరుకుంటుంది. డాక్టర్ వచ్చి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. ఇకమీదట ఇంకొక స్ట్రోక్ వస్తే అతని ప్రాణాలు కాపాడడం మావల్ల కాదు అని డాక్టర్ చేతులెత్తేస్తాడు. నీకు ఇంట్లో వాళ్ళందరూ ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటారు. పల్లవి లేనిపోని డ్రామాలు వేసి అడ్డంగా ఇరుక్కు ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం అవని రాజేంద్రప్రసాద్ దగ్గరకొచ్చి మీరు ఏమి ఆలోచించకండి మావయ్య టెన్షన్ పడకండి అని చెప్తుంది. అప్పుడే ఇంట్లోకి శ్రీకర్ వస్తాడు. నేను ముంబైలో ఉన్నాను అమ్మ ఫోన్ చేసినప్పుడు రాలేకపోయాను నాన్నను ఒకసారి చూస్తానని శ్రీకర్ లోపలికి వెళ్తాడు. అక్షయ్ అడ్డుకొని నాన్నకు టెన్షన్ పడగొద్దని చెప్పారు నిన్ను చూస్తే మళ్ళీ టెన్షన్ పడతాడు నువ్వు వెళ్ళరా అని బయటకు పంపిస్తాడు. శ్రీకర్ ని బయటికి పంపించడం పార్వతి చూస్తుంది. పల్లవి పార్వతికి అక్షయ గురించి లేనిపోనివి ఎక్కించి చెప్తుంది. పార్వతి మనసులో అక్షయ్ మీద కోపం కలిగేలా చేస్తుంది.. ఇక రాజేంద్రప్రసాద్ దగ్గరికి అందరూ వస్తారు. పార్వతి ఏదో చెప్పాలనుకుని వస్తుంది కానీ రాజేంద్రప్రసాద్ను చూసి ఆగిపోతుంది. ఇక శ్రీకర్ ని ఇంట్లో నుంచి గెంటైయడం చూసి బాధపడుతుంది. రాజేంద్ర ప్రసాద్ ని చూడటానికి పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ అక్కడికి వస్తాడు. మీరు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత లేనిపోని టెన్షన్స్ ఎందుకు బావగారు మీరు కాస్త రిలాక్స్ అవ్వండి మీ పిల్లలు చూసుకుంటారు కదా మీరు టెన్షన్ తీసుకుంటే ఇలాంటి హాట్ స్ట్రోక్లే వస్తాయని సలహా ఇస్తాడు.
పల్లవి మీ గురించి చెప్పి చాలా బాధపడింది మీ ఆరోగ్యం మీకే కాదు అందరికీ ముఖ్యమే మీరు జాగ్రత్తగా ఉండండి బావగారు అని అంటాడు. ఇక పల్లవి వాళ్ళ నాన్నతో పార్వతీ వినేలా నాటకం మొదలు పెడుతుంది. మామయ్య గారి ఆరోగ్యం బాగోలేదు అత్తయ్య గారికి కొడుకు గురించి ఆలోచన ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది డాడీ అని అంటుంది. దానికి చక్రధర్ కూడా తానా అంటే తందానా అంటాడు. అక్షయ్ పేరు మీద ఆస్తి మొత్తం రాయడంతోనే అక్షయ్ ఇలా మారిపోయాడు ఏమో అని నాకు అనుమానంగా ఉంది పల్లవి అని అంటాడు అది విన్నపార్వతి వీళ్ళు చెప్పేది కూడా నిజమే కదా అక్షయ్ వల్లే ఇదంతా జరుగుతుందేమో అని పార్వతి మనసులో అనుమానం మొదలవుతుంది.. ఇక అవని అక్షయ్ తో మాట్లాడాలని మాట్లాడుతుంది. ఇంట్లో పరిస్థితులు చూస్తే నాకు భయమేస్తుందండి మీరు శ్రీకర్ని అలా అడ్డుకోవాల్సింది కాదు మీరు చాలా తప్పు చేశారు అని అంటుంది. ముందు ఆస్తిని అందరి పేరు మీద సమానంగా రాయండి ఇది మీ చేతిలో పనే కదా అని అంటుంది. విషయాలు నాన్నగారు చూసుకుంటారు నాకెందుకు మధ్యలో అని అక్షయ్ అంటాడు. కానీ అవని మాత్రం ఒప్పుకోదు. మొన్న శ్రీకర్ వాళ్ళ మామగారు ఎంత గొడవ చేసారో చూశారు కదా ఇక అల్లుడు పేరు మీద ఏమీ ఆస్తి లేదని తెలిస్తే అసలు విలువిస్తాడా ఆ ఇంట్లో ఉండనిస్తాడా మీరే ఆలోచించండి. మావయ్య అయితే శ్రీకర్ పేరుమీద అసలు ఆస్తి రాయుడని అని నాకు అనిపిస్తుంది. మీరు చొరవ తీసుకొని ఆస్తి సమానంగా అందరికీ పంచేలా చూడండి అని అంటుంది. ఆయన్ని కనుక్కుంటే అతను మీ ఫ్యామిలీ లాయర్ ని కనుక్కోవాలని చెప్తాడు.
ఇక లాయర్ ని నేను కలిసి అసలు విషయం ఏంటో తెలుసుకుంటానని అవనితో అక్షయ్ అంటాడు. లైన్ కలవడానికి బయటకు వెళ్తాడు. పల్లవి చిన్న పని ఉంది అత్తయ్య హాస్పిటల్ కి వెళ్దామని తీసుకెళ్తుంది. కమల్ అమ్మ ఎందుకు నేను వస్తా పద అంటాడు. లేడీస్ ప్రాబ్లమ్స్ లేడీస్కే తెలుస్తాయి బావ నేను అత్తయ్య ని తీసుకెళ్లి పోతాను అని అంటుంది. పల్లవి అనుకున్న ప్లాన్ ప్రకారం దయాకర్ ను అక్షయ్ కి ఎదురుగా రమ్మని చెప్తుంది. దయాకర్ అక్షయ్ మాట్లాడుకోవడం పార్వతి చూసి వీరిద్దరూ ఇంత చనువుగా మాట్లాడుకుంటున్నారు ఏంటి? వీరిద్దరికీ నిజం తెలుసా అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అక్షయ్ కు నిజం తెలిసి పోతుందేమో చూడాలి..