Vaikunta Dwara Darshan: తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే చేసిన పాపాలు కొంతైనా తొలగుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే సుదూర ప్రాంతాల నుంచి దర్శించుకునేందుకు భక్తులు ఏడు కొండలకు వస్తుంటారు. ఈ క్రమంలో అనుకోని ఘటనలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి తిరుపతి టికెట్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాధితులు స్పెషల్‌గా వైకుంఠ ద్వారం ద్వారా దేవ దేవుడ్ని దర్శించుకున్నారు.
తిరుపతిలో వైకుంఠ దర్శన టికెట్ల కేంద్రాల వద్ద జరగిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందారు. స్వయంగా సీఎం చంద్రబాబు బాధితులతో మాట్లాడారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
శుక్రవారం వైకుంఠం ద్వారా స్వామిని దర్శించుకుంటామని చెప్పడంతో అందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఉదయం ఏడు గంటలకే క్షతగాత్రులకు వైకుంఠ ద్వారం దర్శనం చేయించింది టీటీడీ. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దర్శనం తర్వాత బాధితులు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
తాము ఎనిమిది సార్లు ఇక్కడకు వచ్చామని, అనుకోకుండా ఇలాంటి ఘటన జరిగింద న్నారు బాధితులు. ఎప్పుడూ ఈ విధంగా జరగలేదన్నారు. దీనికి ఎవరు బాధ్యులు కారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు ప్రత్యేకంగా వైకుంఠం ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కల్పించారన్నారు. ముఖ్యమంత్రి మొదలు అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాము బతికామంటే స్వామి దయవల్లేనని చెప్పుకొచ్చారు బాధితులు.
ALSO READ: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం.. టీటీడీ కీలక ప్రకటన ఇదే!
తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు వైకుంఠద్వార దర్శనం చేయించిన టీటీడీ
సీఎం, టీటీడీ చైర్మన్ అదేశాల ప్రకారం మొత్తం 52 మందికి ప్రత్యేక దర్శనం కల్పించిన అధికారులు
మంచి వైద్యం అందించి,
వైకుంఠద్వార దర్శనం కల్పించిన సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ కి ధన్యవాదాలు తెలిపిన భక్తులు… pic.twitter.com/UPC4tOMREC— B R Naidu (@BollineniRNaidu) January 10, 2025