Intinti Ramayanam Today Episode January 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. కమల్ ఆరాధ్య ఇద్దరు కలిసి ఇంట్లో వాళ్ళందరూ మూడీగా ఉన్నారని వాళ్ళ కోసం ఒక స్వీట్ చేసి పెట్టాలని అనుకుంటారు. ఇద్దరు కలిసి పాయసాన్ని రెడీ చేస్తారు. స్వీట్ చేస్తున్న వాసనకి భానుమతి వంటగదిలోకి వెళ్తుంది. స్వీట్అయ్యాక పిలుస్తానని కమల్ అంటాడు. భానుమతికి కావాలని పాయసంలో మోషన్ టాబ్లెట్ ని వేస్తాడు. ఇక నువ్వు తింటే అందరికీ దొరికిపోతావ్ అక్కడే ఒక మూల కూర్చొని తినుపో అనేసి పంపిస్తాడు ఆ పాయసం తినగానే భానుమతి బాత్రూం కి గ్యాప్ లేకుండా వెళ్తుంది ఏమైందిరా పాయసం తినగానే ఏదో జరిగిందని అంటుంది నీ పాయసం గిన్నెలో నేను మోషన్ టాబ్లెట్ వేసానని చెబుతాడు. లేకుంటే మా వదినని పొద్దున లేచినప్పటి నుంచి ఏదో ఒకటి అంటూనే ఉంటావా అనేసి అంటాడు. ఎందుకురా నువ్వు ఇలా చేశావు నన్ను చంపేలా ఉన్నావు కదరా అనేసి భానుమతి అంటుంది. ఇక అక్షయ్ డాక్యుమెంట్స్ చదవాలని అనుకున్న కూడా అవని చదవకూడదు రేపు సర్ప్రైజ్ ఉంటుంది అనేసి అంటుంది. ఉదయం లేవగానే అవని పూజ చేసి డాక్యుమెంట్స్ ని అందరి దగ్గరికి తీసుకొస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇక అందరూ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టడానికి ఒప్పుకోరు కానీ అవని బలవంతంగా సంతకం పెట్టుకోడానికి ఒప్పిస్తుంది. అందరూ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ లో ఏం రాసానో అని మీరందరూ చదవండి మీకే తెలుస్తుంది అని అవని అంటుంది. దానికి పల్లవి నేను చదువుతాను బావగారు అని ముందుకు వస్తుంది ఆ డాక్యుమెంట్స్ ని చదవడానికి చేతికి తీసుకుంటుంది.. అది చూసి ఏంటక్క ఇదంతా ఆస్తి మొత్తం బావగారి పేరు మీద రాయడానికి వీలునామ వ్రాయించావా అని షాక్ అయినట్టు యాక్ట్ చేసింది.. అత్తయ్య మీరు ఒకసారి చదవండి ఇందులో ఏం రాసిందో మీకు తెలుస్తుంది అక్క ఇలా చేస్తుందని మేము అస్సలు ఊహించలేదని పల్లవి అంటుంది.. పార్వతి ఆ డాక్యుమెంట్స్ ని చదువుతుంది. అక్షయ్ కి తన ఆస్తి మొత్తం రాయించాలని తన తమ్ముళ్ళందరూ దానికి ఒప్పుకున్నట్లు సంతకాలు కూడా చేసినట్లు అందులో ఉందని చదువుతుంది.
ఆ మాట విన్న అందరూ షాక్ అవుతారు అవని కూడా షాక్ అవుతుంది. ఇంట్లో వాళ్ళందరూ అవనిని నిలదీస్తారు. అవని మాత్రం నేనే తప్పు చేయలేదు నేను అలా రాయించలేదని వాదిస్తుంది కానీ ఎవ్వరూ నమ్మరు. పని ఇదే తప్పని అందరూ అంటారు ఇక భానుమతి అదే పనిలో ఉండి రెచ్చిపోతుంది. ఎవరు నా మాట వినలేదు అని అంటుంది ఇక పార్వతి అత్తయ్య ఎన్నిసార్లు అన్నా నేను తప్పు అనేసి వాదించే దాన్ని.. పెద్దవాళ్ళు చెప్పింది తప్పు కాదు అని నమ్మించడానికి నేను అవని పై ఒక గంట కనిపెడుతూనే ఉన్నాను అవన్నీ నిజస్వరూపం తెలిసి పార్వతీ షాక్ అయ్యాయాని అంటుంది.
ఇక ఇంట్లో వాళ్ళందరూ అవనిదే తప్పని అవని డబ్బు మనిషిని నానా మాటలు అంటారు పార్వతి కూడా నువ్వు ఒక అనాధవి అయినా నీకు డబ్బు పిచ్చి ఏంటి మంచి కుటుంబం దొరికిందని ఆలోచించాలిగాని ఇలా ఆలోచిస్తావని అవనిని దారుణంగా తిడుతుంది. అది విన్న పల్లవి సంతోషంతో మురిసిపోతుంది. ఇక లాయర్ ది తప్పని లాయర్ ని తీసుకురమ్మని అవన్నీ చెప్తుంది. రాజేంద్రప్రసాద్ లాయర్ ని పిలిపిస్తాడు. లాయరు ఇంటికొచ్చి అవని చెప్పినట్టే రాసానని అవనికి షాక్ ఇస్తాడు. నేను మీకు 40 ఏళ్ల మీ ఫ్యామిలీ లాయర్ గా పనిచేస్తున్నాను కానీ మీ ఫ్యామిలీ గొడవల్లోకి నన్ను లాగకండి మీ కోడలు చెప్పినట్టే నేను రాస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఇక లాయర్ చెప్పిన తర్వాత కూడా నీ మాటలే నమ్మమంటావా? నువ్వు చేసింది తప్పు అని పార్వతి అంటుంది. ఇక పల్లవి ఇంట్లో జరిగిన రచ్చ గురించి వాళ్ళ నాన్నతో చెప్తుంది. ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..