CM Revanth Reddy: దావోస్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైజింగ్ తెలంగాణ బృందం శంషాబాద్ ఎయిర్పోర్టు వద్దకు రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూల వర్షం కురిపిస్తూ.. జయ జయహే తెలంగాణ అంటూ కార్యకర్తలు నినదించారు. ఊహించని రీతిలో తెలంగాణకు పెట్టుబడులు సాధించడమే కాక, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి సఫలీకృతులయ్యారు. మొత్తం ఎనిమిది రోజుల పాటు సాగిన సీఎం పర్యటన, రాష్ట్రానికి ఎన్నడూ ఊహించని రీతిలో పెట్టుబడులు సాధించింది.
దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సత్తా చాటారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత భారీగా పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. రైజింగ్ తెలంగాణ బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పర్యటనలో 20 సంస్థలతో ఒప్పందాలు చేసుకోగా, గత ఏడాదితో పోలిస్తే మూడింతలు మించిన పెట్టుబడులు రావడం ఆనందంగా ఉందని కాంగ్రెస్ నాయకులు తెలుపుతున్నారు. అది కూడ ఇప్పటివరకు రూ. రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు వెల్లువలా రాగా, కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్నారు. అయితే ఇక్కడ పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ.1,78,950 కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది.
గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి మూడింతలకు మించిన పెట్టుబడులు రావటం విశేషం. దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారధ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి.
దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు https://t.co/HxatLfs2cJ pic.twitter.com/PBAMgfuyAQ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2025