E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి బయటకు వెళ్లిన రాజేంద్రప్రసాద్.. అవనికి అక్షయ్ బిగ్ షాక్..

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి బయటకు వెళ్లిన రాజేంద్రప్రసాద్.. అవనికి అక్షయ్ బిగ్ షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode May 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని దగ్గరికి ఆరాధ్యను తీసుకెళ్లడంతో రాజేంద్రప్రసాద్ ఇంట్లో అందరికీ శత్రువుగా మారిపోతాడు. తన బిడ్డని దూరం చేసినందుకు తండ్రిపై కోపంగా ఉంటాడు.. నువ్వు అసలు నా కన్నతండ్రివేనా? నా బాధను అర్థం చేసుకోవా? అంటూ నిలదీస్తాడు. నీకన్నా అమ్మే నయం ఆమె కడుపున పుట్టకపోయినా నన్ను కన్న కొడుకు లాగా చూసుకుంటుంది అని రాజేంద్ర ప్రసాదని అంటాడు. నీకు నేను కన్న కొడుకుని అన్న విషయం కూడా నువ్వు మర్చిపోతున్నట్టు ఉన్నావ్ నీ కొడుకుని అయితే నువ్వు ఇలా చేసే వాడివి కాదు అని రాజేంద్రప్రసాద్ ని దారుణంగా తిడతాడు అక్షయ్. రాత్రి రాజేంద్ర ప్రసాద్ ను భోజనం చేద్దాం రండి నాన్న అని కమల్ బ్రతిమలాడి రాజేంద్రప్రసాద్ ని కిందికి తీసుకొస్తాడు.. పార్వతి భోజనం చేస్తూ కనిపించడంతో రాజేంద్రప్రసాద్ షాక్ అవుతాడు. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ కిందకు వస్తాడు.. అక్కడ పార్వతి తినడం చూసి షాక్ అవుతాడు. నేను రాకపోతే మీ అమ్మ అన్నం తినదు అన్నావు కదా.. ఇప్పుడు ఇదేంటి నాకన్నా ముందు మీ అమ్మ అన్నం తింటుంది. అంటే నేను మీ అమ్మకు అక్కర్లేదు కదా ఇది నువ్వు ఆలోచించరా నాకు భోజనం చేయాలని లేదు అని వెళ్ళిపోతాడు. అన్ని పట్టించుకోకుండా రండి నాన్న అని కమల్ తీసుకెళ్లి కూర్చోబెడతాడు.. శ్రీయని వడ్డించమని చెప్తాడు.. కానీ తను వడ్డించదు.. కమల్ రాజేంద్రప్రసాద్ ప్లేట్లో భోజనం వడ్డిస్తాడు.

Advertisement

అక్షయ్ కోపంతో వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తు చేసుకొని చేయి కడిగేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. తర్వాత పార్వతి కూడా చెయ్యి కడుక్కొని వెళ్ళిపోతుంది. అలా ఒక్కొక్కరు భోజనం దగ్గర నుంచి వెళ్ళిపోతారు. రాజేంద్రప్రసాద్ కూడా అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ చేసిన పరిస్థితిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి శ్రీకర్ కమల్ భోజనం తీసుకొని వస్తారు. మా నాన్నకి భోజనం పెట్టే అవకాశం మాకు వచ్చింది అని ఎమోషనల్ గా అన్నని గుండెల్లో పిండేసేలా డైలాగులు చెబుతూ తండ్రికి భోజనాన్ని తినిపిస్తారు. మీరు చేసింది మంచి పని నాన్న మీకోసం మేము ఏమైనా చేస్తాం మీకు ఎప్పటికీ సపోర్ట్ గా ఉంటామని ఇద్దరు అంటారు.

ఇక తర్వాత రోజు ఉదయం రాజేంద్రప్రసాద్ బ్యాగ్ తో సహా తీసుకొని ఇంట్లోంచి వెళ్లడానికి కిందకు వస్తాడు. భానుమతి రాజేంద్రప్రసాద్ ఎక్కడికి వెళ్తున్నావ్ ఏదైనా టూర్ కి వెళ్తున్నావా? బిజినెస్ పని మీద బయటకు వెళ్తున్నావా? అని అడుగుతుంది. రాజన్న ప్రసాద్ మాత్రం ఇంట్లో వాళ్ళందరి ఒకసారి పిలవమ్మా అని అంటాడు. భానుమతి అందరిని తెలుస్తుంది. ఏమైంది చెప్పు అని అడిగితే వీడు ఎక్కడికో బాయ్ తో సహా వెళ్లిపోతున్నాడు ఒకసారి ఎక్కడికి వెళ్తున్నాడు కనుక్కోమ్మా అనేసి అంటుంది. వెళ్ళిపోతున్నాను. మీకు ఎవరికీ నేను అక్కర్లేదు కదా అని అంటాడు..

Advertisement

భోజనం దగ్గర కూడా మీరందరూ నా మొహం చూసి వెళ్ళిపోయారు. ఎవరైనా బిక్షగాడు వస్తేనే ఇంటికి భోజనం పెడతారు అలాంటిది నేను రాగానే నన్ను భోజనానికి కూడా పట్టించుకోకుండా మీ పార్టీకి మీరు తింటున్నారు అట్లే వెళ్లిపోయారు కూడా.. నేను మీకు ఎవరికి అక్కర్లేదని నాకు అర్థం అయిపోయిందని అంటాడు. నాకు మాది తప్పయింది మీ మమ్మల్ని క్షమించండి అని పార్వతి రాజేంద్ర ప్రసాద్ ని అడుగుతుంది. అక్షయ్ ఇంట్లో లేడు అక్షయ్ ద్వారా కూడా క్షమాపణ చెప్పిస్తాను మీరు దయచేసి వెనక్కి రండి మీ నిర్ణయాన్ని మార్చుకోండి అని అడుగుతుంది.

కానీ రాజేంద్రప్రసాద్ ఇదే మాటని నేను అవని విషయంలో అంటే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతాడు. అవని నేను క్షమించి ఇంటికి తీసుకురండి అంటే మీరు క్షమించి ఇంటికి తీసుకొస్తారా..? అవని విషయంలో మీరు చేసేది తప్పు అంటే మీరు నమ్ముతారా ఇప్పటికైనా మీరు అవనిని ఇంటికి తీసుకొస్తారా అప్పుడైతే తప్ప నేను ఇంట్లో ఉండను అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. కానీ పార్వతి నా ప్రాణానైనా మీకు ఇస్తాను గాని అవనిని ఇంటికి తీసుకురాను అని చెప్పేస్తుంది దాంతో రాజేంద్రప్రసాద్ నేను కూడా ఇక్కడ మీ అందరితో ఉండలేనని వెళ్లిపోతాడు.

తర్వాత దయాకర్ వాళ్ళింటికి రాజేంద్రప్రసాద్ వెళ్లిపోతాడు. ఎంతో ప్రేమగా అందరూ పలకరిస్తారు. స్వరాజ్యం మీరు కూర్చొని నుండి అన్నయ్య నేను ఒక అరగంటలో భోజనం చేసుకుని తీసుకొస్తానని అంటుంది. ఒక్కరోజు భోజనం చేసి వెళ్లిపోవడానికి రాలేదమ్మా మీ సంతోషంలో నేను భాగం పంచుకోడానికి వచ్చాను నన్ను ఇక్కడ ఉండనిస్తారని అడుగుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ తల్లి కాబోతోందా?

బుల్లితెరపై ప్రత్యక్షమైన ప్రదీప్.. సినిమాలకు గుడ్ బై చెప్పేశాడా?

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Big Stories

Advertisement
×