Five Penalty Runs: క్రికెట్ లో అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగితే మరికొన్ని విషాదకరమైన సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే క్రికెట్ లో… చాలా రూల్స్ ఉంటాయి. ఏ రూల్ బ్రేక్ చేసినా కూడా పెనాల్టీ పరుగులు… ప్రత్యర్థి జట్టుకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నో బాల్, వైడ్ వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు క్రికెటర్లు. అలాగే ఫీల్డింగ్ చేసేటప్పుడు కూడా…. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. లేకపోతే అప్పుడు కూడా రూల్స్ ప్రకారం పెనాల్టీ పరుగులు.. ప్రత్యర్థి జట్టుకు వెళ్తాయి. ముఖ్యంగా వికెట్ కీపర్.. జాగ్రత్తగా ఉండాలి.
బంగ్లాదేశ్ జట్టుకు 5 పరుగులు పెనాల్టీ
క్రికెట్ రూల్స్ ఎవరు బ్రేక్ చేసిన కఠిన చర్యలే ఉంటాయి. చిన్న మ్యాచ్, పెద్ద మ్యాచ్ అన్న తేడాలు అస్సలు ఉండవు. ఎంత తోపు క్రికెటర్ అయినా… పెనాల్టీ భరించాల్సిందే. అయితే తాజాగా బంగ్లాదేశ్ వికెట్ కీపర్ చేసిన పనికి… ఆ జట్టు ఏకంగా ఐదు పరుగుల పెనాల్టీ భరించాల్సి వచ్చింది. అనవసరంగా వికెట్ల వెనుక హెల్మెట్ పెట్టి… న్యూజిలాండ్ జట్టుకు మేలు చేశాడు బంగ్లాదేశ్ వికెట్ కీపర్. అయితే ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ లో జరగలేదు కానీ.. అనధికార మ్యాచ్ లో జరిగింది.
బంగ్లాదేశ్ A, న్యూజిలాండ్ A జట్ల మధ్య శనివారం రోజున ఓ అనధికారిక వన్డే మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ హసన్ (Nurul Hasan)… సరిగ్గా వికెట్ల వెనుక ఉండకుండా… స్లిప్ లో ఉన్నాడు. అలాగే తన వికెట్ కీపింగ్ స్థానంలో హెల్మెట్ పెట్టేసాడు. ఇక అప్పుడే బంగ్లాదేశ్ బౌలర్ ఎబాదోత్ హుస్సేన్ ( Ebadot Hossain )
ఐదవ ఓవర్ వేశాడు. అటు న్యూజిలాండ్ ఆటగాడు రైస్ మైరు ( Rhys Mairu ) బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంకేముంది బంగ్లాదేశ్ బౌలర్ వేసిన బంతిని… న్యూజిలాండ్ ఆటగాడు.. బ్యాట్ తో టచ్ చేయకుండా.. ఐదు పరుగులు రాబట్టాడు.
బంగ్లా వికెట్ కీపర్ తప్పిదం
అదేలాగంటే… బంగ్లా బౌలర్ వేసిన బంతిని న్యూజిలాండ్ ఆటగాడు టచ్ చేయలేదు. వదిలేశాడు. అయితే ఆ సమయంలో వికెట్ కీపర్ చేతిలోకి నేరుగా బంతి వెళ్లాల్సి ఉంటుంది. కానీ బంగ్లా వికెట్ కీపర్ నూరుల్ హసన్ మాత్రం.. స్లిప్ లో ఉండడంతో ఆ బంతి నేరుగా వెళ్లి హెల్మెట్ కు తాకింది. అలా జరగడంతో… అందరూ షాక్ అయ్యారు. వెంటనే అంపైర్ 5 పరుగులు డిక్లేర్ చేశాడు. క్రికెట్ రూల్ 28.3.2 ప్రకారం… అలా హెల్మెట్ కు బంతి తాగితే 5 పరుగులు పెనాల్టీగా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో బ్యాటింగ్ టీంకు అడ్వాంటేజ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ జట్టుకు అడ్వాంటేజ్ అయింది. అయితే బౌలర్ బంతి వేసినప్పుడు వికెట్ కీపర్ స్లిప్ లో ఎందుకు ఉన్నాడు అనే దానిపైన చర్చ జరుగుతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు.
Cricket fixing in broad daylight. Video from Bangladesh 😲
~ What's your take on this 🤔 pic.twitter.com/LjV51fdaKl
— Richard Kettleborough (@RichKettle07) May 11, 2025