E-Paper
Advertisement

ముస్లింలకు శుభవార్త.. ఒక్క ఉమ్రా వీసాతో ఎన్నిసార్లైనా మక్కా ఎంట్రీ.. కానీ చిన్న కండీషన్

ముస్లింలకు శుభవార్త.. ఒక్క ఉమ్రా వీసాతో ఎన్నిసార్లైనా మక్కా ఎంట్రీ.. కానీ చిన్న కండీషన్
Advertisement

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం భక్తులకు సౌదీ అరేబియా ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉమ్రా యాత్రను మరింత సులభతరం చేయడానికి ఒక సంవత్సరం కాలపరిమితితో మల్టిపుల్ ఎంట్రీ ఉమ్రా వీసాను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా అర్హత కలిగిన యాత్రికులు ఏడాది కాలంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఉమ్రా యాత్ర చేయవచ్చు. ఈ నిర్ణయం సౌదీ అరేబియా విజన్ 2030 లక్ష్యాల్లో భాగంగా తీసుకుంది. దీని ద్వారా మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు విదేశీ సందర్శకుల సంఖ్యను కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఉమ్రా యాత్ర అంటే ఏంటి?

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు సౌదీ అరేబియా దేశంలో ఉన్న రెండు తీర్థ స్థలాలు మక్కా, మదీనాలో ఉన్న మసీదులకు దర్శనాలకు వెళతారు. ఈ దర్శనాలతో పాటు కొన్ని ప్రత్యేక స్థలాలను సందర్శిస్తారు. ఈ సాధారణ దర్శనాలకు వెళ్లడమే ఉమ్రా యాత్ర. అయితే హజ్ సమయంలో మాత్రం ఈ సాధారణ దర్శనాలు ఉండవు. అంటే ఉమ్రా యాత్ర.. హజ్ సమయంలో వర్తించదు.

వీసాతో లభించే ప్రయోజనాలు

Advertisement

కొత్త ఉమ్రా వీసా పొందిన యాత్రికులు ఏడాది కాలంలో అనేకసార్లు సౌదీ అరేబియాలోకి ప్రవేశించవచ్చు. మొత్తం మీద 90 రోజుల వరకు అక్కడ ఉండేందుకు అనుమతి ఉంటుంది. ప్రతి యాత్ర కోసం కొత్త వీసా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ సౌకర్యం భారతదేశం, పాకిస్థాన్, మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల యాత్రికులకు అందుబాటులో ఉంటుంది.

నుసుక్ ప్లాట్‌ఫామ్ ద్వారా బుకింగ్ తప్పనిసరి

ఉమ్రా యాత్రకు వెళ్లే ప్రతి భక్తుడు సౌదీ అరేబియా అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన నుసుక్ (Nusuk) ద్వారా సర్వీస్ ప్యాకేజీని బుక్ చేసుకోవాలి. ఈ ప్యాకేజీ వీసాలో మిగిలి ఉన్న రోజుల సంఖ్యకు అనుగుణంగా ఉండాలి. నుసుక్ ప్లాట్‌ఫామ్ ద్వారా యాత్రకు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట సులభంగా పొందే అవకాశం ఉంటుంది.

ప్రతీసారి ఉమ్రా పర్మిట్ తప్పనిసరి

Advertisement

వీసా ఉన్నప్పటికీ ప్రతిసారీ ఉమ్రా యాత్రకు బయలుదేరే ముందు నుసుక్ మొబైల్ యాప్ ద్వారా ఉమ్రా పర్మిట్ తీసుకోవాలి. ఈ అనుమతి లేకుండా ఉమ్రా చేసేందుకు అవకాశం ఉండదు. ప్రయాణానికి ముందు అన్ని నిబంధనలు పూర్తి చేస్తే యాత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది. దీనివల్ల యాత్రికుల సంఖ్యను కూడా అధికారులు సమర్థంగా నిర్వహించగలుగుతారు.

Also Read: ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

వీసా ఎలా పనిచేస్తుంది?

ఈ వీసా ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటుంది. అయితే ప్రతి ఉమ్రా యాత్ర పూర్తయ్యాక యాత్రికుడు సౌదీ అరేబియా విడిచిపెడితే వీసా తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. తరువాతి యాత్రకు అవసరమైన నిబంధనలు పాటించిన తర్వాత అదే వీసా మళ్లీ యాక్టివ్ అవుతుంది. దీంతో ప్రతి ప్రయాణానికి కొత్త వీసా కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు.

హజ్ సమయంలో ఈ వీసా వర్తించదు

మల్టిపుల్ ఎంట్రీ ఉమ్రా వీసా.. హజ్ సీజన్‌లో వర్తించదు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. ధు అల్ ఖైదా ఒకటవ తేదీ నుంచి ధు అల్ హిజ్జా 13వ తేదీ వరకు ఈ వీసాపై పరిమితులు అమల్లో ఉంటాయి. అంటే 2027లో ఈ కాలం ఏప్రిల్ 8 నుంచి మే 19 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ తేదీల్లో హజ్ సీజన్ ఉంటుంది కాబట్టి ఉమ్రా యత్రికులకు ప్రవేశం ఉండదు. హజ్ యాత్ర చేయాలనుకునే వారు ప్రత్యేక హజ్ వీసా కోసం దరఖాస్తు చేయాలి.

Related News

120 కిమీ స్పీడ్ ట్రయల్ సక్సెస్.. ఇక 110 కిమీ వేగంతో పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ ట్రైన్!

జస్ట్.. రూ.30 వేలకే రౌండ్ ట్రిప్.. ఈ 3 దేశాలు భలే చీప్!

నదిని క్లీన్ గా మార్చేశాడు, తన తలరాత మార్చే జాబ్ ఆఫర్ కొట్టేశాడు!

ప్రకృతి అందాల నడుమ రైలు ప్రయాణం.. జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన జర్నీస్ ఇవే!

హైదరాబాద్ దగ్గరల్లోనే బెస్ట్ వీకెండ్ స్పాట్స్.. ఫ్రెండ్స్ తో వెళ్తే సూపరో సూపరు!

తీరొక్క గణనాథులకు కేరాఫ్.. ధూల్ పేట్ లో అడుగు పెడితే ధూమ్ ధామే!

వినాయకుడి నిమజ్జనమే కాదు.. ఆగమనమూ రచ్చే! తెలంగాణలో వైరల్ అవుతున్న కొత్త ట్రెండ్!

11 రాష్ట్రాలు.. 4,000 కిలో మీటర్లు.. దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే!

Big Stories

Advertisement
×