Tirumala News: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం తిరుమలపై స్పష్టంగా కనిపించింది. గడిచిన కొద్దిరోజులుగా భక్తుల రద్దీ అమాంతంగా తగ్గిపోయింది. తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. ఈ మధ్యకాలం తిరుమలలో ఈ విధంగా దర్శనాలు కావడం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.
తిరుమలపై యుద్ధం ప్రభావం
సీజన్ ఏది అయినా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే నిత్యం వేలాది మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటారు. ఇక వేసవి సీజన్ నుంచి చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీలో తిరుమలకు పయనమవుతారు. కేవలం దర్శనానికి దాదాపు 15 నుంచి 20 గంటలు సమయం పట్టేది.
వేసవి సీజన్‌లో పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి తిరుమల రావడం సహజం. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతోపాటు క్యూలైన్లు కిలోమీటర్ల మేర ఉంటాయి. ప్రస్తుతం తిరుమలలో భక్తు రద్దీ అమాంతంగా తగ్గిపోయింది. నాలుగైదు గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు భక్తులు.
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్దం నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వేసవిలో క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. గతేడాది ఎన్నికల నేపథ్యంలో మే ఒకటి నుంచి 10వ వరకు 7 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు భక్తులు. ఈ ఏడాది అదే సంఖ్యలో భక్తులు వచ్చారు. ఉన్నట్లుండి వేసవిలో ఒక్కసారిగా రద్దీ తగ్గింది.
ALSO READ: రేషన్ కార్డుల్లో కీలక మార్పులు.. ఇకపై స్మార్ట్‌కార్డుల వంతు
పహల్గాం ఉగ్ర దాడి, ఆపై దాయాది దేశంతో యుద్ధం వల్ల భక్తుల సంఖ్య అమాంతంగా తగ్గిందన్నది టీటీడీ ఓ అంచనా. ఉద్రిక్తత పరిస్థితులు చక్కబడిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్లచ్చనే అభిప్రాయంతో పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్టు చెబుతున్నారు.
మే నెల తొలివారం 1, 2 రోజులు తప్పితే.. పెద్దగా కంపార్టుమెంట్లు పూర్తిస్థాయిలో నిండలేదని అంటున్నారు. దీంతో తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఆదివారం వీకెండ్ కావడంతో అక్కడ రద్దీ కూడా బాగా తగ్గింది. వచ్చేవారం నాటికి వాతావరణ నార్మల్ స్థాయికి చేరుకుంటుందని, అప్పుడు భక్తులు యథావిధిగా వస్తారని భావిస్తోంది టీటీడీ.
సోమవారం దర్శనానికి టోకెన్లు జాబితా
శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. సోమవారం ఉదయం ఆరు గంటలకు శ్రీవారి మెట్టు భక్తులకు అందజేశారు. దాదాపు ఏడు గంటల వరకు టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. సోమవారం రోజు విడతల వారీగా సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేస్తోంది టీటీడీ. మధ్యాహ్నం నుంచి దాదాపు నాలుగు వేల టోకెన్లను రెడీ చేసింది. మధ్యాహ్నం ఒంటి నుంచి రెండు, మూడు, సాయంత్రం ఐదు, రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల వరకు టోకెన్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఇక తిరుమల కొండపై రూముల గురించి చెప్పనక్కర్లేదు. రూ. 50 లకు సంబంధించి 350 రూములు ఉన్నాయి. అదే రూ. 100 లకు సంబంధించి 13 వందలకు పైగా అందుబాటులో ఉన్నాయి. ఇక రూ. వెయ్యి రూపాయలకు సంబంధించి రూములు బుక్కయ్యాయి. కాకపోతే రూ 1518 విభాగానికి సంబంధించి 10 రూములు అందుబాటులో ఉన్నట్లు టీటీడీ తెలిపింది. యుద్ధం భయం వల్ల సమ్మర్ సీజన్‌లో చివరకు తిరుమల కొండపై రూములు సైతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి.