E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: మీనాక్షి పై పగ పెంచుకున్న పల్లవి.. చక్రధర్ కు కొత్త టెన్షన్.. అడ్డంగా దొరికేసిందిగా..

Intinti Ramayanam Today Episode: మీనాక్షి పై పగ పెంచుకున్న పల్లవి.. చక్రధర్ కు కొత్త టెన్షన్.. అడ్డంగా దొరికేసిందిగా..
Advertisement

Intinti Ramayanam Today Episode November 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాక్షిని చూసిన చక్రధర్ ఆమెకి డబ్బులు ఆఫర్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోవాలని అంటాడు.. నువ్వు నా మీద పగతోనే వచ్చావు నువ్వు ఈ డబ్బులు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపో నీకు ఇంకా 5 లక్షలు కాదు.. నీ కోసం ఐదు కోట్లు ఇస్తానని అంటాడు. చక్రధర్ ని చూసిన అవని ఇంకొక వంద రూపాయలు ఎక్కువ వేసి ఇస్తాను అని అంటుంది.. నువ్వు నియంతటి నువ్వు మా అమ్మని నా భార్య అని ఒప్పుకోవాలి అప్పుడే నీకు విముక్తి కలుగుతుంది అని అవని వార్నింగ్ ఇస్తుంది. వీళ్లందరిని చూసిన పల్లవి డబ్బులు ఎందుకు ఆ మీనాక్షికిస్తున్నాడు మా నాన్నకి అ మీనాక్షి కొన్ని సంబంధం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఎలాగైనా సరే ఈ విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది పల్లవి.. పల్లవి తన పుట్టింటికి వెళ్లి చక్రధర్ ని నువ్వు అవని అమ్మకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనుకుంటున్నావు ఇంతకీ నీకు ఆమెకి ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతుంది. ఆవిడకి నాకు ఏ సంబంధం ఉంది.. నువ్వెందుకు ఆవిడకి డబ్బులు ఇచ్చావు. చక్రధర్ చెప్పిన నిజం విని పల్లవి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని దగ్గరకు వచ్చిన అక్షయ్ మీ అమ్మగారు భోజనం చేశారా అని అడుగుతాడు. నేను రేపు వచ్చేటప్పుడు బీపీ మిషన్ తీసుకొని వస్తాను. రోజు నువ్వు ఇంట్లోనే మీ అమ్మకు బీపీ చెక్ చెయ్యొచ్చు అని అక్షయ్ అంటాడు. నిన్నటి వరకు మీరు నా గురించి అసలు పట్టించుకోనే లేదు. కానీ ఇవాళ నా గురించి మాత్రమే కాదు మా అమ్మ గురించి కూడా మీరు పట్టించుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అండి అని అక్షయ్ అంటుంది. మీ చేత బిజినెస్ చేయించాలనే కోరికతోనే నేను ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చాను. అంతేకానీ ఇలా అందరిని ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు అని అవని అంటుంది..

Advertisement

నేను ఎవరిని మోసం చేయాలని ఇంటి పత్రాలను తాకట్టు పెట్టలేదు. మీకోసమే మీరు బిజినెస్ చేసి మళ్లీ మన ఆస్తులని తిరిగి తీసుకొస్తారని అలా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాను. చివరికి ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. ఇందులో నీ తప్పేమీ లేదు అని నేను నమ్ముతున్నాను అవని. ఇంతకుముందు నీ తప్పు ఏమీ లేదు అని నువ్వు నిరూపించుకోవడానికి ఒక్క దానివే పోరాడావు. ఇప్పుడు నీ తప్పేమీ లేదు అని నేను నమ్ముతున్నాను కాబట్టి నీకు సపోర్టుగా నేను ఉంటున్నాను మనల్ని మోసం చేసిన వ్యక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను అని అక్షయ్ అంటాడు.

నీ తప్పేమీ లేదు అని నిరూపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను మనల్ని మోసం చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లాను. కానీ అతను ఎక్కడికో వెళ్ళాడు రెండు రోజుల తర్వాత వస్తాడు అని తెలుసుకున్నాను. వాడు రాగానే వాడి చేత నిజం కక్కించే పని చేస్తాను అని అక్షయ్ అంటాడు.. దాంతో అవని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మీ గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు మీరు మీరే అని అక్షయ్ కౌగిలిలో వాలిపోతుంది.

Advertisement

పల్లవి మాత్రం ఆ మీనాక్షి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. నన్నే కొడుతుందా దానికి ఎంత ధైర్యం ఎలాగైనా సరే దాన్ని ఇంట్లో నుంచి గెంటించే పని చేస్తాను అని అనుకుంటుంది.. ఈ విషయం మీ ఎలాగైనా సరే తన డాడీతో పంచుకోవాలని అనుకుంటుంది. డాడీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఆ మీనాక్షిని ఎలాగైనా సరే రేపు ఇంట్లో నుంచి బయటికి ఇస్తాను అని అంటుంది.. ఏం చేయబోతున్నావు పల్లవి అని చక్రధర్ అడుగుతున్న సరే ఫోన్ పెట్టేస్తుంది పల్లవి..

తర్వాత రోజు ఉదయం పార్వతి రాజేంద్రప్రసాద్ భానుమతి అందరూ హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు.. ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చి నేను మీనాక్షి తో మాట్లాడాలి అని అంటాడు. రాజేంద్రప్రసాద్ అమ్మ అవని మీ అమ్మ కోసం ఎవరో వచ్చారు అని అంటాడు.. అవని రాగానే ఎవరిని మీరు అని అడుగుతుంది. ఈనెవరో నీకు తెలుసా అమ్మ అని అవని అడుగుతుంది.. నేను మీనాక్షి భర్తని మాకు గొడవలు అయ్యాయి ఆమెను వదిలేసి పోయాను కాబట్టి నన్ను చూసి అలా అంటుంది అని అతను అంటాడు.

మీనాక్షి మాత్రం నా భర్త కాదు అని అంటుంది.. అవని లోపలికి వెళ్లి కాసేపటి తర్వాత మళ్లీ బయటకు వస్తుంది.. మా అమ్మ నువ్వు ఎవరో తెలియదు అంటుంది ఎందుకు నువ్వు అబద్దం చెప్తున్నావు ఎవడ్రా నువ్వు అని చెంపలు పగలగొడుతుంది. మధ్యలో పల్లవి కలగజేసుకొని ఆయన తన భర్త అని చెప్తున్నాడు కదా.. కన్న తండ్రి నీ కొడతావా అని పల్లవి కావాలని అంటుంది.. ఆ ఇచ్చిన వ్యక్తి మీనాక్షితో కలిసి ఉన్నట్లు ఫోటోని క్రియేట్ చేసి అందరికీ చూపిస్తాడు.. తన భర్తని ఫోటో చూపిస్తున్నాడు కదా ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి అని పల్లవి అంటుంది.

పల్లవి మీ అమ్మకి భర్త అని చెప్తున్నాడు కదా ఎందుకు నమ్మట్లేదు. నువ్వు ఎవరో చెప్పలేదు కదా మరి ఇది నిజమే కదా అని అంటుంది.. నీ కన్న తండ్రి ఎవరో నీకు తెలుసా అని ఎంతగా అడుగుతున్నా సరే అవని మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది.. అప్పుడే ఇంట్లోకి చక్రధర్ ఎంట్రీ ఇస్తాడు. ఏంటి డాడీ మీరు ఇలా వచ్చారు అని పల్లవి అడుగుతుంది. ఒక చిన్న పని మీద ఈ ఏరియా కి వచ్చాను ఒకసారి నేను చూసి పోదామని వచ్చాను అని అంటాడు. కరెక్ట్ సమయానికి వచ్చారు. పల్లవి అవని వాళ్ళ నాన్న వచ్చారు. కానీ అవని వాళ్ళ అమ్మ తన భర్త కాదు అని అంటుంది మీరైనా చెప్పి అతనితో ఈవిడను పంపించండి అని పల్లవి అంటుంది.

Also Read :సుశీలకు బిగ్ సర్ప్రైజ్.. గోపాలం ఎంట్రీతో సిగ్గు.. బాలు గిఫ్ట్ కు షీలా ఫిదా..

అవని అన్న మాటల్ని గుర్తు చేసుకున్నా చక్రధర్ ఇతను ఎవరో నాకు బాగా తెలుసు ఇతను ఒక ఫ్రాడ్.. అసలు నిన్ను ఎవరు పంపించారు ఇక్కడికి అని అతన్ని దారుణంగా కొడతారు. దాంతో అతను ఏం సార్ మీ తండ్రి కూతుర్లు ఇద్దరు నాతో ఆడుకుంటున్నారు. మీరేమో ఎవరు చెప్పండి అంటారు. మీ కూతురేమో డబ్బులు ఇచ్చి మీనాక్షికి భర్తగా నటించమని చెప్పింది నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని అతను వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత ఆవిడ నువ్వు అన్న మాటకే కొట్టింది.. దానికి మీ అమ్మ వచ్చి క్షమాపణ చెప్పింది అని పార్వతి అంటుంది. కమల్ అక్షయ్ కూడా ఇద్దరూ పల్లవికి సిగ్గులేదు ఇలాంటి పనిచేయడానికి అని అంటారు. చక్రధర్ ఆడపిల్లవై బతికి పోయావు ఇంకొకసారి ఇలాంటివి చేస్తే నీ చంప నేను పగలగొడతాను అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×