Vizag Crime: ఆ జంటకు పెళ్లయి ఎనిమిది నెలలు అయ్యింది.. ప్రస్తుతం ఆ మహిళ ఏడునెలల గర్భవతి.. ఆదివారం ఓ శుభకార్యానికి ఈ జంట హాజరు కావాల్సివుంది. ఆ ఫంక్షన్‌కు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆ జంట ఆత్మహత్యకు పాల్పడింది. సంచలనం రేపిన ఈ ఘటన విశాఖ సిటీలో వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగేశారు.
విశాఖలో దారుణం, జంట ఆత్మహత్య
విశాఖ సిటీలోని అక్కయ్యపాలెం ప్రాంతంలో ఉంటున్నారు వాసు ఫ్యామిలీ ఉంటోంది. అతడు కొంతకాలం డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. అయితే ఎనిమిది నెలల కిందట వాసు-అనితలకు వివాహం జరిగింది. ప్రస్తుతం అనిత ఏడు నెలల గర్భవతి. వివాహం తర్వాత ఈ దంపతులు అన్యోన్యంగా ఉండేవారు.
వీరిని చూసి ఇరుగుపొరుగువారు ముచ్చట్లు పెట్టుకునేవారు. తమకు అలాంటి కొడుకు-కోడలు ఉంటే బాగుండేదని అనుకునేవారు. చిరునవ్వుతో ఇంటికి వచ్చేవారిని ఆనందంతో పంపేవారు. ఆదివారం మధ్యాహ్నం ఈ జంట ఓ శుభ కార్యక్రమానికి వెళ్లాల్సి వుంది. కాకపోతే ఇలాంటి సమయంలో బయటకు వెళ్లడం సరికాని ఇంట్లోనే ఉండిపోయారు.
పెళ్లయి ఎనిమిది నెలలు.. భార్య గర్భవతి
వాసు తల్లి శుభకార్యానికి వెళ్లింది.. సాయంత్రం ఇంటికి వచ్చింది. తలుపులు మూసి ఉన్నాయి. ఎంత సేపటికీ తలుపు ఓపెన్ చేయకపోవడంతో వాసు తల్లి కిటికీ వద్దకు వెళ్లి చూసింది. కొడుకు వాసు ఉరేసుకొని ఉన్నాడు. అనిత కిందపడి ఉండడం చూసి షాకైంది. ఆ సన్నివేశాన్ని చూసి షాకైన వాసు తల్లి కింద పడిపోయింది.
వెంటనే ఇరుగుపొరుగువారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకొని పోలీసులు పరిశీలించారు. అప్పటికే ఆ జంట విగతజీవులుగా పడి ఉన్నారు. కోడలు అనిత గర్భవతి అని, కనీసం శిశువును కాపాడాలని బంధువులు పెద్దామె మొరపెట్టుకున్నారు. వెంటనే కేజీహెచ్‌కు అనితను తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది.
ALSO READ: ఎమ్మెల్యే కొడుకు సంగీత్ ఫంక్షన్.. ఆపై ప్రమాదానికి గురైన కారు
గర్భంలో ఉన్న ఆడ శిశువు మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. వాసు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం కోసం జంట డెడ్ బాడీలను కేజీహెచ్‌కు తరలించారు. భార్యని చంపి, ఆ తర్వాత వాసు ఆత్మహత్య చేసుకున్నాడా? భార్యకు విషం ఇచ్చి ఆ తర్వాత ఉరేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ జంట గురించి ఇరుగుపొరుగు వారిని పోలీసులు ప్రశ్నించారు. వారిద్దరు చాలా ఆనందంగా ఉండేవారని, బాధలు ఉన్నట్లు ఏనాడూ చెప్పలేదని చెప్పారు. మరి పోలీసుల విచారణ ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.