kantara Chapter 1 OTT:కాంతార.. ప్రాంతీయ మూవీగా కన్నడలో విడుదలైన ఈ సినిమా అనూహ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రానికి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ గా ‘కాంతార చాప్టర్ 1’ అంటూ మన ముందుకు రాబోతున్నారు. ప్రముఖ హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ నటనా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఇప్పుడు భారీ ఓటీటీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ అమెజాన్ ప్రైమ్ వీడియో’ దాదాపు రూ.125 కోట్లకు ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాంతార సినిమా తీసుకువచ్చిన క్రేజ్ తోనే ఇప్పుడు ఈ చిత్రం భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ రేంజ్ లో ఓటీటీ హక్కులు కొనుగోలు అవ్వడం అంటే నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి.
తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో బిజినెస్..
ఇదిలా ఉండగా కాంతార సినిమా తీసుకొచ్చిన ఎఫెక్ట్ కాంతారా చాప్టర్ 1కి బాగా కలిసొచ్చేలా కనిపిస్తోంది. అందులో భాగంగానే అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు హక్కులను డిస్ట్రిబ్యూషన్ సంస్థలు సంయుక్తంగా ఏకంగా రూ.100 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఎవరెవరు సొంతం చేసుకున్నారని విషయానికొస్తే..
నైజాం – మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్
ఉత్తరాంధ్ర – విగ్నేశ్వర డిస్ట్రిబ్యూటర్స్
తూర్పు , పశ్చిమగోదావరి – (అల్లు అరవింద్) గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్
గుంటూరు – వారాహి చలనచిత్రం
సీడెడ్ – శిల్పకళా ఎంటర్టైన్మెంట్స్
నెల్లూరు – ఎస్ వి శ్రీ వెంగమాంబ సినిమాస్..
పాన్ ఇండియా కాదు గ్లోబల్ మార్కెట్ టార్గెట్..
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో వార్త తెరపై సంచలనం సృష్టిస్తోందని చెప్పవచ్చు. ఇప్పటివరకు చాలా చిత్రాలు పాన్ ఇండియా టార్గెట్ గా విడుదలవుతుంటే.. రాజమౌళి పుణ్యమా అని ఎన్నో సినిమాలు గ్లోబల్ టార్గెట్ గా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 కూడా గ్లోబల్ మార్కెట్లో పేరు సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో కాంతార మొదటి భాగం ఇంగ్లీష్ తో పాటు ఇటాలియన్, స్పానిష్ భాషల్లో కూడా ఓటీటీ ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ స్ట్రాటజీకి మంచి రెస్పాన్స్ కూడా లభించింది. ఇప్పుడు మేకర్స్ మరింత ధైర్యంగా అడుగు వేసి.. ఈ కాంతార చాప్టర్ వన్ ను ఇంగ్లీష్ భాషలో థియేట్రికల్ రిలీజ్ తో పాటు స్పానిష్ వెర్షన్ లో కూడా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.