BigTV English

GudiGantalu Today episode: మీనాను పొగిడేసిన ప్రభావతి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సుశీల..రోహిణికి ప్రభావతి షాక్..

GudiGantalu Today episode: మీనాను పొగిడేసిన ప్రభావతి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సుశీల..రోహిణికి ప్రభావతి షాక్..

Gundeninda GudiGantalu Today episode September 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు మీనా అలా పెళ్లి రోజు కోసం అంత ఏర్పాట్లు చేస్తారు. అందంగా ఇంటిని అందంగా రెడీ చేస్తారు. అందరూ మీనా బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కామాక్షి మీ నాకు గొప్ప అవార్డు ఇవ్వాలి అన్నయ్య అని అంటుంది. ఏంటమ్మా ఎందుకు అని సత్యం అడుగుతాడు. ఏడాది పాటు నీ సాధింపుల్ని భరించింది కదా అని ప్రభావతం అంటుంది కామాక్షి. అది నిజమే నన్ను వెనకాల సాధించి ఉంటే నేనెప్పుడూ రవిని తీసుకుని వెళ్ళిపోయే దానిని శృతి అంటుంది. రోహిణి కూడా అది నిజమే నేను కూడా ఎప్పుడో మనోజ్ తీసుకొని వెళ్ళిపోయేదాన్ని అని అంటుంది. ఇది నా ప్రభావతి నా గురించి మీరు మనసులో ఇంత అనుకుంటున్నారా అని అంటుంది. అందరూ కూడా మీనా బాలులా అన్యోన్యతను చూసి మురిసిపోతారు. బాలు మీనా రాగానే కామాక్షి మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని అంటుంది. కామాక్షి మాటలకి అందరూ సెటైర్లు వేస్తారు. కామాక్షి మాత్రం మీరు ఇలాంటి ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లోని వాళ్లు అందరు కూడా మీనా, బాలు పెళ్లి రోజు వేడుకను ఘనంగా జరుపుతారు. ఈ వేడుక అనంతరం అందరూ మీనా బాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. ఒక్కొక్కరు మీనా బాలుల దాంపత్యం గురించి వివరిస్తారు. అయితే అందరూ వీళ్ళ గురించి పాజిటివ్గా చెప్పిన సరే మౌనిక చెప్పిన విషయంపై అనుమానం వస్తుంది. అన్నయ్య వదినలు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి వీళ్ళ జీవితం మాలాగే ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని అనగానే అందరికీ అనుమానం వస్తుంది.

అన్నయ్య వదినలు ఎంతో సంతోషంగా ఉంటున్నారు కదా వాళ్ళలాగే మేము కూడా ఎప్పుడూ గొడవలు పడకుండా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నామని మౌనిక అంటుంది. సత్యం కూడా బాలు మీనాల గురించి గొప్పగా మాట్లాడుతాడు.. వీళ్ళకి పెళ్లి చేసినప్పుడు ఎలా కాపురం చేస్తారో అని అనుకున్నాను కానీ ఇప్పుడు వీళ్లకు వీళ్లే అందరికీ ఆదర్శంగా నిలబడుతూ ముందుకు సాగుతున్నారు ఇలానే ఇంకో వందేళ్లు కూడా వీళ్లు పెళ్లిరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని సత్యం అంటాడు.


ప్రభావతిని మాట్లాడమని సుశీల అంటుంది. అసలు ఈ అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. మొదటినుంచి విడి నేనెప్పుడూ కొడుకుగా చూడలేదు. విని చిన్నప్పటి నుంచి భరించడం నావల్ల కాలేదు. కానీ ఏడాదిగా విని భరిస్తూ మీతో కాపురం చేస్తుందంటే ఇది చాలా గ్రేట్.. వీళ్లు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ప్రభావతి అనగానే అందరూ సంతోషంతో చప్పట్లు కొడతారు. ఇక రోహిణి తన వర్షన్ లో బాలుని తిడుతూ మీనాన్ని పొగుడుతూ గొప్పగా చెప్తుంది..

శృతి మాత్రం వీళ్ళ దాంపత్యం గురించి గొప్పగా చెప్తుంది.. మీనా బాలులు ఎప్పటికీ ఇలానే ఉండాలి కొట్టుకున్న తిట్టుకున్న వీళ్ళలాగా భార్యాభర్తలు ఎవరూ ఉండరు. వీళ్లను చూసి మేం కూడా వీళ్ళ లాగా ఉండాలని అనుకుంటున్నామని అంటుంది. సుశీల చాలా చక్కగా చెప్పావమ్మా సరే నువ్వు బాగా అర్థం చేసుకున్నావు అని అంటుంది. ఇక ఫంక్షన్ అయిన తర్వాత అందరూ పడుకోడానికి సిద్ధమవుతారు. బాలు పరుపు తీసుకుని వెళ్లి పైన పడుకుందామని అంటాడు. ఇవాళ మీకు పెళ్లి రోజు కదా మీరిద్దరూ గదిలోని పడుకోవాలి కదా మరి ఎందుకు పైన పడుకుంటాను అంటున్నారు మిగిలిన వాళ్ళు కింద పడుకుంటామంటారు మిమ్మల్ని వేరుగా చూస్తున్నారా అని సుశీల అడుగుతుంది.

ప్రభావతి వాళ్ళకి గది ఇవ్వడానికి అసలు ఒప్పుకోదు. బాలు మాకు గదేం అవసరం లేదు మేమే మా గదిని వాళ్ళకి ఇచ్చేసాము మేము పైకెళ్ళి పడుకుంటామని అంటారు. ఇక సుశీల సత్యం ప్రభావతి దగ్గరికి వస్తుంది. కొత్తగా పెళ్లైన వాళ్లకి గది లేకుండా ఉంటే ఎలా ఉంటుంది ఇంకొక గది పైన వేపించమని చెప్పాము కదా మరి నువ్వు ఎందుకురా ఇంకా వేపించలేదు అని సుశీల అడుగుతుంది. ఆ మాట వినగానే సత్యం నేను కూడా చూస్తున్నాను అమ్మ.. కొత్తగా గది వేపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అంటాడు.

వాళ్లు వీళ్లు డబ్బులు ఇస్తే వేపించడం కాదురా మనమే వేపించుకోవాలి వేరే వాళ్ళ దగ్గర చులకన అయిపోతాము అని సుశీల అంటుంది. ఆ మాట వినగానే ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుశీల మాత్రం ఎవరేమనుకున్నా సరే రా మనం మాత్రం గదిని వేపించాలి అని అంటుంది. రోహిణి రోహిణి పక్కకొచ్చి మాట్లాడుతూ ఉంటుంది.. అక్కడికొచ్చిన ప్రభావతి రోహిణిని ఇంట్లో ఫంక్షన్ బాగా జరిగింది కదా అమ్మ అని అడుగుతుంది.

Also Read : సీరియల్స్ లో నటించి పెళ్లి చేసుకున్న రియల్ జంటలు వీళ్లే..!

శృతి వాళ్ళ అమ్మ వచ్చింది, మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వీళ్ళిద్దరూ వెళ్లి వచ్చారు ఎప్పుడు ఏం జరిగినా అందరూ సంతోషంగా ఉన్నారు కానీ నువ్వు మాత్రం మీ ఇంట్లో వాళ్ళని ఎవరిని తీసుకురాలేదు అని ఎత్తి పొడుస్తుంది ప్రభావతి.. అలాగే మీ నాన్న నీ సారి కచ్చితంగా తీసుకురావాలి అని కండిషన్ పెడుతుంది. ఆ తర్వాత రోహిణి వాళ్ళ అమ్మ సుశీలకు ఫోన్ చేసి ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి చెప్తుంది. నేను వచ్చే వారం వస్తానమ్మా అని రోహిణి అంటుంది. కూతురి ఇంటికి వస్తానంటే నేను ఎందుకు వద్దంటానమ్మా అని ఆమె అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రేమను గెలికిన వల్లి.. విశ్వం ప్లాన్ వర్కౌట్..?

Intinti Ramayanam Today Episode: భర్తకు దగ్గరైన రాజేంద్ర ప్రసాద్.. అవని పై అక్షయ్ సీరియస్.. పల్లవి ప్లానేంటి..?

Nindu Noorella Saavasam Serial Today September 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి నిజం చెప్పిన సరస్వతి వార్డెన్‌

Brahmamudi Serial Today September 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేవతిని చూసిన రుద్రాణి – నిజం చెప్పొద్దన్న రాహుల్‌

Telugu Serials : సీరియల్స్ లో నటించి పెళ్లి చేసుకున్న రియల్ జంటలు వీళ్లే..!

Big Stories

×