Intinti Ramayanam Today Episode September 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని అక్షయ్ ల మధ్య దూరం ఇంకా అలానే ఉంది. రేపు వాళ్ళ పెళ్లి రోజు కదండీ మనము ఆరోజున గ్రాండ్ గా చేయాలి అని పార్వతి అంటుంది. అది నిజమే వాళ్ళ పెళ్లిరోజుని మనము గ్రాండ్ గా చేయాలి కానీ అక్షయ్ ఒప్పుకుంటాడా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. వాన్ని ఎలాగైనా ఒప్పించి తీరాల్సిందే ఎందుకంటే అవని మనకోసం ఎంతో చేస్తుంది మనం ఎంత చీ కొట్టినా మనందరం బాగుండాలని కోరుకుంది. నిన్న కూడా మన షష్టిపూర్తి బాగా జరగాలని కోరుకుందే తప్ప ఏమి చేయలేదు కదా అని అంటుంది.. ఇక వాళ్ళిద్దర్నీ ఒప్పించి మనం మ్యారేజ్ డే కి కావలసినది ఏర్పాట్లు చేద్దామండి అని పార్వతి అంటుంది. అవని భరత్ ని తన వైపు తిప్పేసుకున్న పల్లవి అని అనుమాన పడుతుంది. శ్రియాను మార్చేసినట్టే తమ్ముని కూడా పల్లవి మార్చేసిందని అవని ఆలోచిస్తూ ఉంటుంది.. అక్షయ్ పెళ్లి రోజు వేడుకను మొదట చేసుకోను అన్నా కూడా ఆ తర్వాత బాస్ కోసం చేసుకుంటాను అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవని అక్షయ్ ఇద్దరు కలిసి మ్యారేజ్ డే సెలెబ్రేషన్ చేసుకోవడం కోసం మేడం ని పిలవడానికి వెళ్తారు.. మనము మేడమ్ ని పిలిస్తే మన మధ్య దూరం లేదని అనుకుంటుంది అని అవని అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్తారు. ఆ గీత కనిపించి బాగున్నారా అని అడుగుతుంది. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమి ఎరగనట్లు ఎంత అమాయకంగా అడుగుతున్నావే ఆయన నిన్ను అనడం కాదు నువ్వు జస్ట్ నటివి మాత్రమే అక్కడ నిన్ను డైరెక్ట్ చేస్తుంది వేరే వాళ్ళు వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని మనసులో అనుకుంటుంది.
బాగానే ఉన్నాం ఇకమీదట కూడా బాగుంటాము అని అవని కావాలని గీతతో అంటుంది. గీత ఏదో జరిగింది అని అనుకుంటుంది… అవని, అక్షయ్ ఇద్దరు కూడా బాస్ దగ్గరికి వెళ్లి మా పెళ్లి రోజు రేపు మేము ఫంక్షన్ చేసుకుంటున్నాము మీరు కచ్చితంగా రావాలి మేడం అని అడుగుతారు. చాముండేశ్వరి ఏదో ఇష్టం లేనట్లుగా మాట్లాడుతుంది. పెళ్లి రోజు అనగానే వాళ్లతో మాట్లాడుతుంది. వీరిద్దరూ గొడవలు పడ్డారు కదా మరి పెళ్లి రోజు జరుపుకుంటారా అని అడుగుతుంది.
భార్యాభర్తల అన్నాక గొడవలు కామన్ కదా మేడం మేము రేపు పెళ్లిరోజు జరుపుకుంటున్నాము. అందుకే మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలవాలని వచ్చాము అని అవని అంటుంది.. సరే రేపు నేను తప్పకుండా వస్తాను అని మేడం మాట ఇస్తుంది. వీళ్ళని పిలిచాను కదండీ మీ బాస్ కి అనుమానం రాకుండా ఉండాలంటే మనము మనవాళ్లందరిని కూడా పిలవాలి అని అంటుంది. సరే వెళ్లి వాళ్లను కూడా పిలుద్దామని అవని అక్షయలు పల్లవి వాళ్ళ దగ్గరికి వెళ్తారు..
మా పెళ్లి రోజు వేడుకని గ్రాండ్ గా జరుపుకోవాలని అనుకుంటున్నాము మీరు కచ్చితంగా రావాలి అని పల్లవి నీ శ్రీయని అవని అడుగుతుంది.. నేను పెళ్లిరోజు అక్కడ ఇక్కడ జరిగితే ఏమవుతుంది.. మన ఇంట్లోనే జరిగితే బాగుంటుంది కదా అని అంటారు కానీ అవని అక్షరాలు మాత్రం ఒప్పుకోరు. ఇక పార్వతి రాజేంద్రప్రసాద్ లు కూడా మీరు తప్పకుండా వాళ్ళ వేడుకలు భాగం పంచుకొని గ్రాండ్ గా చేయాలి అని అంటుంది. కమల్ అన్న వదినలకు పెళ్లిరోజు అంటే ధూమ్ ధామ్ గా ఉండాలి కచ్చితంగా మేము అలానే చేస్తామని అంటాడు.
తర్వాత రోజు ఉదయం అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా పల్లవి శ్రీకర్ కమల్ శ్రియ అందరూ వచ్చేస్తారు. రేపు పెళ్లి రోజు వేడుకంటే ఇప్పుడే వచ్చేసారేంటి ఏంట్రా అనేసి అడుగుతారు. పూజలు వ్రతాలు అన్ని మన ఇంట్లో చేసుకుంటున్నాం. మన ఇంటి వేడుకను మన ఇంట్లోనే చేసుకోవాలి కదా.. ఇక్కడ ఎందుకు చేసుకోవాలి వేరే వాళ్ళ ఇళ్లల్లో అని పల్లవి అంటుంది.. మొదట వద్దని అన్న పార్వతి తర్వాత వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా రా మన ఇంట్లోనే ఈ వేడుకను చేసుకుందామని అక్షయతో అంటుంది.
Also Read : వర్కర్స్ ను అవమానించిన మనోజ్.. రూమ్ కోసం బాలు రచ్చ.. మీనాకు చివాట్లు..
రాజేంద్రప్రసాద్ కూడా ఒకపక్క పల్లవి వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతాడు. కానీ అవని అక్షయ్ లు మాత్రం అందుకు ఒప్పుకోరు.. పల్లవి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. మనింట్లోనే ఈ వేడుక జరగాలి లేదంటే మేం కూడా ఇక్కడే ఉంటాం లగేజ్ తెచ్చుకుంటామని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..