Sai Kiran:ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరుసగా శుభవార్తలు చెబుతూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి సిద్ధమవుతుండగా.. మరోవైపు నారా రోహిత్ తాను ప్రేమించిన హీరోయిన్ సిరి లేళ్ల తో ఏడడుగులు వేశారు. ఇక లావణ్య – వరుణ్ తేజ్ ఈ ఏడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి శుభవార్త తెలుపగా.. అటు సుహాస్ కూడా మరో కొడుకుకు జన్మనిచ్చి అభిమానులతో ఆ శుభవార్తను పంచుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా మరో శుభవార్త తెలిపారు. అంతేకాదు కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నామని చెప్పి అందరిని సంతోషపరిచారు.
ఇప్పుడు మరొక హీరో 47 సంవత్సరాల వయసులో వరుసగా శుభవార్తలు చెబుతూ అభిమానులను అలరిస్తున్నారు. ఆయన ఎవరో కాదు హీరో సాయికిరణ్ (Sai Kiran). ఈయన ఎవరో కాదు అలనాటి సింగర్ రామకృష్ణ కుమారుడు.. హీరో అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చిన ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మాతగా తెరకెక్కించిన ‘నువ్వే కావాలి’ సినిమాలో సెకండ్ హీరో పాత్రలో నటించి అందులో “అనగనగా ఆకాశం ఉంది” అనే పాటతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయారు. ఆ తర్వాత ప్రేమించు, రావే నా చెలియా, డార్లింగ్ డార్లింగ్, ఎంత బాగుండో , బింబిసారా, రౌడీ ఇన్స్పెక్టర్ ఇలా చాలా చిత్రాలలో నటించిన ఈయన హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయారు.
ALSO READ:Bigg Boss 9: హౌస్ మేట్స్ నిజ స్వరూపం బయటపెట్టిన మాధురి.. అతడే ఫేక్ అంటూ!
సినీ ఇండస్ట్రీలో పెద్దగా కలిసి రాకపోవడంతో 2000 సంవత్సరంలోనే సీరియల్స్ లోకి అడుగుపెట్టిన సాయికిరణ్.. ప్రస్తుతం పడమటి సంధ్యారాగం, భానుమతి వంటి సీరియల్స్ లో నటిస్తున్నారు. ఇక్కడ కూడా పదుల సంఖ్యలో సీరియల్స్ చేసి ఇటు బుల్లితెర ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలు, సీరియల్స్ లో నటించి మంచి పేరు దక్కించుకున్నారు. ఇకపోతే కెరియర్ తొలినాళ్లల్లో వైష్ణవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. కానీ వీరి కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ దంపతులకు కుమార్తె కూడా ఉంది. ఇక ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్న సాయికిరణ్ కోయిలమ్మ సీరియల్ లో సహనటి స్రవంతి (Sravanthi)తో ప్రేమలో పడి గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఇటీవలే ఈమె గర్భం దాల్చగా డెలివరీ కోసం ఇద్దరు ఎదురుచూస్తున్నారు. ఈలోపే తాజాగా సాయికిరణ్ కు స్రవంతి సర్ప్రైజ్ ఇచ్చింది.
తాజాగా తన భర్త కోసం రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటీయర్ 650 బైకును బహుమతిగా అందించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ వచ్చింది. నా భర్తకు కంగ్రాట్స్ అంటూ స్రవంతి రాసుకొచ్చింది. భార్య ఇచ్చిన సర్ప్రైజ్ తో షాక్ అయిన సాయికిరణ్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. త్వరలోనే స్రవంతి పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే.