BigTV English
Advertisement

Illu Illalu Pillalu Today Episode: అమూల్యకు ప్రపోజ్ చేసిన విశ్వం.. శ్రీవల్లికి కొత్త టెన్షన్.. భద్రకు బిగ్ షాక్..

Illu Illalu Pillalu Today Episode: అమూల్యకు ప్రపోజ్ చేసిన విశ్వం.. శ్రీవల్లికి కొత్త టెన్షన్.. భద్రకు బిగ్ షాక్..

Illu Illalu Pillalu Today Episode November 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనం ఇప్పటినుంచి ఫ్రెండ్స్ అని ప్రేమ ధీరజ్ లు అనుకుంటారు. చిన్నప్పుడు విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. చిన్నప్పటినుంచి మనం ఒకరంటే ఒకరు ద్వేషంతో పెరిగాము.. ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాము అంటే ఏదోలా ఉంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికైతే ధీరజ్ నేను మళ్ళీ ఉడికించేలా చేస్తుంది ప్రేమ. నేను నీ మీద ప్రేమతో ఏమీ చేయలేదు నీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నా కూడా ఇదే పని చేస్తాను అని ప్రేమ అనడంతో ధీరజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత సాగర్ నర్మదను పొగడ్తల వర్షం కురిపిస్తాడు. సాగర్ నర్మద దగ్గరకొచ్చి చేసిన పనికి నాకు చాలా ముద్దు వచ్చేస్తున్నావు అని అంటాడు.. ఎప్పుడు ఇదే పనా నీకు ఇంకా వేరే పనే లేదా అని నర్మదా అడుగుతుంది. నీ కోసం చందు కూడా వచ్చి మాట్లాడగానే శ్రీవల్లి అన్న మాటలకు చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ధీరజ్ ప్రేమ ఇద్దరూ పోటీ పెట్టుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఉదయం ఐదు గంటల అవ్వగానే ప్రేమ, ధీరజ్ని లేపుతుంది. ఏంటి ఇంత పొద్దున్నే లేపావు నీకు టైం కావాలంటే వాచ్లను ఫోన్లోనో చూసుకోవాలి అని అంటాడు.. నిన్న ఎన్ని కోతల కోసమో గుర్తుందా అందుకే ఇప్పుడు రన్నింగ్ కి వెళ్దాం పద అనేసి ధీరజ్ ని అంటుంది.. ఇద్దరు కలిసి రన్నింగ్ కోసం అని బయటకు వెళ్ళిపోతారు. శ్రీవల్లి  అమూల్యకు మాయమాటలు చెప్పి బయటికి వెళ్దాం పద అని తీసుకొని వెళ్తుంది.. విశ్వం అమూల్యను చూసి అమూల్య దగ్గరికి వస్తాడు. నువ్వు మా అత్త కూతురు గాని నేను నీతో చనువు తీసుకొని మాట్లాడుతున్నాను కానీ నువ్వేంటి అసలు ఏదో ఇష్టం లేనట్టు చేస్తున్నావు అని అమూల్యతో విశ్వం అంటాడు.

ఆ దేవుడు సాక్షిగా నీకు ఒక విషయాన్ని చెప్పాలి అని విశ్వం అమూల్యతో అంటాడు.. నువ్వు మా అత్త కూతురు కాబట్టి ఈ రెండు కుటుంబాలు కలవాలని నేను కూడా కోరుకుంటున్నాను.. ముందులాగా మీ కుటుంబం పై గొడవలు కి రావట్లేదు. మీరు నాశనం అవ్వాలని కోరుకోవట్లేదు అని విశ్వం అంటాడు.. అయితే నీకు ఒక విషయం చెప్పాలి దేవుడు సమక్షంలోనే నీకు ఆ విషయం చెప్తాను ఐ లవ్ యు అమూల్య అని అంటాడు.. పక్కనే ఉండి చాటుగా వీళ్ళ మాటలు వింటున్న శ్రీవల్లి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.. బండ సచ్చినోడు ఇంత పని చేశాడు ఏంటి అని షాక్ అవుతుంది..


ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు. ఈ విషయాన్ని నేను మా ఇంట్లో చెప్పి మా నాన్నకి విషయం చెప్పి నీ అంతు చూస్తాను అని అమూల్య అక్కడి నుంచి బయలుదేరుతుంది. అరె బండ సచ్చినోడా ఏం చేసావ్ రా నువ్వు ఇప్పుడు ఇంట్లో ఈ విషయాన్ని అమూల్య చెప్తే నా చావు ఇవ్వాలే.. ఇక నాకు మూడినట్టే అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఇంటికి వెళుతుంది.. ఆయన ఈ పిల్ల ఏంటి రా బాబు ఇంత ఆవేశంగా వెళుతుంది ఇంట్లో ఏ కొంపలు ముంచుతుందో అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది..

ధీరజ్ తో పోటీకి వెళ్లిన ప్రేమ ధీరజ్ని ఓడించేస్తుంది. నా కెపాసిటీ ఏంటో చూసావు కదా ఇకమీదట నుంచి నాతో మాట్లాడాలంటే జాగ్రత్తగా ఉండు అని ప్రేమ అంటుంది.. నీకంత దమ్ముంటే వన్ మినిట్ లోపలి ఈ గ్రౌండ్ మొత్తం పరిగెత్తించి చూపించు అని అంటాడు ధీరజ్.. అతని ఛాలెంజ్ని తీసుకున్న ప్రేమ గ్రౌండ్ మొత్తం పరిగెత్తించి చూపిస్తుంది.. నాకు రన్నింగ్ షూస్ లేవు కదా అందుకే ఇంత టైం అయింది ఒకవేళ ఉంటే నేను ఇంకా వస్తా ముందుగానే వచ్చేదాన్ని అని ప్రేమ అంటుంది.. ఒకరోజు రన్నింగ్ షూస్ తీసుకుని 50 సెకండ్ల లోపు నేను ఈ గ్రౌండ్ మొత్తం పరిగెడతాను అని ధీరజ్ తో ఛాలెంజ్ చేస్తుంది..

ఎంతో ఇష్టమైన పోలీస్ జాబ్ కి నువ్వు అప్లై చేసుకోవచ్చు కదా అని ధీరజ్ అంటాడు.. ఇక్కడ అంటే అన్నావు కానీ ఇంట్లో మాత్రం అనొద్దు ఈ విషయంపై మీ నాన్న ఎంత పెద్ద రచ్చ చేస్తాడో తెలియదు కదా అని ప్రేమ అంటుంది. ట్యూషన్ చెప్తానంటేనే ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. అలాంటిది నేను పోలీస్ జాబ్ కి వెళ్తున్నాను అంటే ఇక అసలు ఒప్పుకుంటారా అని ప్రేమ అంటుంది. రామరాజు నేను వేరే ఊరికి వెళుతున్నాను ధాన్యం కొనడానికి రావడానికి రెండు రోజులు పడుతుంది మిల్లును జాగ్రత్తగా చూసుకోండి అని తిరుపతి తో అంటాడు. భర్త దూరంగా వెళ్లడం చూసిన వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

Also Read :ప్రాణాలతో బయటపడ్డ అక్షయ్.. తల్లిని కలుసుకున్న అవని.. ఇంట్లో అంతా హ్యాపీ..

నర్మదా భద్రావతి సేన వాళ్ళ ప్రాపర్టీ లను సీజ్ చేయిస్తుంది.. అక్కడికి వచ్చిన భద్రాసేన ఇద్దరు కూడా నర్మదతో మాట్లాడతారు.. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ మీకు ఆల్రెడీ నోటీసులు పంపాం మీరు రెస్పాండ్ అవ్వలేదు అందుకే సీజ్ చేశామని అంటుంది.. ఎంత ధైర్యం ఉంటే మా వస్తువులనే సీజ్ చేస్తావు అని నర్మదపై కక్ష కట్టేస్తారు సేన.. ఇది ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని నర్మదా అంటుంది.. ఇక అమూల్య చాలా ఆవేశంగా ఇంటికి రావడం చూసిన శ్రీవల్లి ఈ విషయాన్ని నేను వెంటనే మా నాన్నకి చెప్పాలి అని అంటుంది.. అమూల్య ఆ విషయాన్ని గనుక చెప్తే కచ్చితంగా నా మీదకు వస్తుంది అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. నువ్వు ఎవరో ఒకరి చావును కోరుకుంటున్నావా.. ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా నీకు అని శ్రీవల్లి అంటుంది. ఇక శ్రీవల్లి చెప్పిన మాటలు విని అమూల్య విశ్వం గురించి ఇంట్లో చెప్పడం ఆ మానేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Rashmika Manadanna: ఆ ‘ రింగ్ ‘ నాకు స్పెషల్.. నిజం చెప్పేసిందండోయ్…

Jabardasth: జబర్దస్త్ షో నుంచి ఏకంగా 6 మంది గుడ్ బై.. అసలేం జరుగుతోంది?

Sai Kiran: 47 ఏళ్ల వయసులో శుభవార్త చెప్పిన సాయికిరణ్.. పోస్ట్ వైరల్!

Brahmamudi Serial Today November 4th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీని రాహుల్‌కు దూరం చేసిన గోల్డ్‌ బాబు

Intinti Ramayanam Today Episode: ప్రాణాలతో బయటపడ్డ అక్షయ్.. తల్లిని కలుసుకున్న అవని.. ఇంట్లో అంతా హ్యాపీ..

GudiGantalu Today episode: సుశీల కోసం వెనక్కి తగ్గిన బాలు.. దొరికిపోయిన మనోజ్.. ప్రభావతికి షాక్..

Nindu Noorella Saavasam Serial Today November 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గుప్త రింగ్ కొట్టేసిన ఆరు  

Big Stories

×