IND VS AUS: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా (Australia vs India, 3rd ODI) మధ్య ఇవాళ చిట్ట చివరి వన్డే జరగనుంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో వన్డే కు సిడ్ని వేదిక కానుంది. 8 గంటల ప్రాంతంలో మ్యాచ్ టాస్ ప్రక్రియ ఉంటుంది. అయితే ఇప్పటికే ఆస్ట్రేలియా సిరీస్ గెలుచుకోగా.. ఇందులో కూడా గెలిచి ఇండియన్ వైట్ వాష్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అటు ఈ మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీమ్ ఇండియా ప్లాన్ చేస్తోంది. దీంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠత పెరిగింది. ఇక ఈ మూడో వన్డే నేపథ్యంలో భారీ మార్పులు చేయనుంది టీమిండియా. నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ధృవ్ జురెల్ బరిలో దిగుతాడని సమాచారం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా స్థానంలో ప్రసిద్ధ కృష్ణ బరిలో ఉంటాడని అంటున్నారు.
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ డేట్ ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇవాళ మ్యాచ్ పూర్తయిన తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. మొన్న రెండో టెస్టు సందర్భంగా వికెట్ కోల్పోయిన తర్వాత గ్లౌజులు తీసి, వింతగా విరాట్ కోహ్లీ సిగ్నల్స్ ఇచ్చాడు. దీంతో ఈ సిరీస్ తనకు చివరిది అనే సంకేతాన్ని విరాట్ కోహ్లీ ఇచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇవాళ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరగబోతోంది. ఈ వన్డే పూర్తయిన తర్వాత నిజంగానే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తాడని అంటున్నారు. ఇప్పటికే రెండు వన్డేల్లో కూడా డకౌట్ అయిన విరాట్ కోహ్లీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అందుకే వెంటనే రిటైర్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాడట కోహ్లీ.
ఆస్ట్రేలియా ప్రాబబుల్ XI: ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్ (కెప్టెన్), మాట్ షార్ట్, మాట్ రెన్‌షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, మిచ్ ఓవెన్, మిచెల్ స్టార్క్/జాక్ ఎడ్వర్డ్స్, జేవియర్ బార్ట్‌లెట్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్
ఇండియా ప్రాబబుల్ XI: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, KL రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి/ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్/కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా/ప్రసిద్ధ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్