Illu illaalu Pillalu Bhagyam : బుల్లితెరపై ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ లో ఎంతోమంది అమ్మాయిలు నటిస్తూ హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు. ఈ మధ్య సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారమవుతున్న సీరియల్ విషయానికి వస్తే స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా ఒకటి. ఉమ్మడి కుటుంబంలో ఎలాంటి ప్రేమలుంటాయి.. తండ్రి మాటలకు కొడుకులు జవదాటకుండా ఉండటం గురించి ఈ సీరియల్ లో చాలా చక్కగా చూపించారు. అయితే ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో క్యారక్టర్.. మనస్తత్వం వేరు. అందులో తన కూతురు గొప్పగా ఉండాలి అని అనుకుంటుంది భాగ్యం.. ఈ పాత్రలో మాధవి నటించింది. మిర్చి మాధవి అంటే అందరు టక్కున గుర్తు పడతారు. ఈమె రియల్ లైఫ్ కన్నీటి పర్యంతం.. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం..
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మిర్చి మూవీ ద్వారా తనలోని టాలెంట్ ని నిరూపించుకుంది. ఆ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. అప్పటినుంచి ఆమె పేరు మిర్చి మాధవిగా మారింది. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్లలో నటించింది. గుప్పెడంత మనసు సీరియల్ లో ఈమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సీరియల్ తర్వాత ఆమె ఫారిన్ వెళ్ళిపోయారు. మళ్లీ సత్యభామ సీరియల్ లో ఆఫర్ రావడంతో ఇండియాకు తిరిగివచ్చారు. ఈమె జీవితం గోల్డెన్ స్పూన్ కాదు. ఎన్నో కష్టాలను అధిగమించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది తన తల్లి చనిపోవడం ఆమెకు తీరనిలోటు అని చెప్పాలి. చిన్నప్పటినుంచి తన తల్లి బిడ్డ కష్టాలను గుర్తుచేసుకొని ఆమె ఎమోషనల్ అయిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.. ఇప్పటికీ ఈ బాధ నుంచి నేను, మా అక్కయ్య, అన్నయ్య కోలుకోలేకపోతున్నాం. కానీ తనకి మేము బాధపడటం ఇష్టం కాదు.. అందుకే ఆమెను తలచుకొని సంతోషంగా ఉంటామని ఆమె అన్నారు. తల్లి లేకపోతే మేము ఎవరు మూలేము.. కష్టాలు తానుపడి సుఖాన్ని మాకు ఇచ్చింది అంటూ ఆమె ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
మిర్చి మాధవి పేరు తెలియని వారు ఉండరు. సినిమాలతో సీరియల్లతో బాగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఏమే బుల్లితెరపై సక్సెస్ఫుల్గా ప్రసారం అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటిస్తుంది.. ఇందులో భాగ్యం పాత్రలో నటిస్తుంది. వెయ్యి అబద్దాలు అయినా ఒక పెళ్లి జరిపించాలి అనే సామెతకు తగ్గట్లు ఈమె తన కూతురి పెళ్లి కోసం ఎన్నో అబద్ధాలాడి వెయ్యి అబద్దాలు అయినా ఒక పెళ్లి జరిపించాలి అనే సామెతకు తగ్గట్లు ఈమె తన కూతురి పెళ్లి కోసం ఎన్నో అబద్ధాలాడి పెళ్లి చేసేస్తుంది. ఆ తర్వాత ఆ తప్పులను కప్పించుకోవడానికి మరికొన్ని తప్పులను చేస్తూ సీరియల్లో తన కూతురు గొప్పగా ఉండాలని ఆలోచిస్తుంది. ఈ క్రమంలో తన కూతురు కుటుంబంలో ఎన్నో గొడవలకు కారణం అవుతుంది. ఈ సీరియల్ నటిస్తున్నందుకు ఈయన ఒక్క రోజుకి 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.. నెలకు లక్షల్లో ఇన్ని సంపాదన ఉంటుంది.. సీరియస్ మాత్రమే కాదు సినిమాలకు కూడా చేస్తూ బిజీగా గడుపుతుంది.