Gundeninda GudiGantalu Today episode October 25 th: నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యం కుటుంబంలో దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతాయి. అందరు టపాసులను కాల్చి ఎంతో సంతోషంగా ఉంటారు. వీళ్ళందరి సంతోషాన్ని చూసిన శోభా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని చెబుతుంది. ఈ సంతోషాన్ని మరింత సేపు ఉంచను కాసేపట్లో దూరం చేస్తాను అని అంటది. మీరు గది కోసం రోజు గొడవ పడుతున్నారు కదా నా వంతు సహాయంగా నేను ఐదు లక్షలు ఇస్తాను అని అంటుంది. బాలు రెచ్చిపోయి ఆమెకు బుద్ధి చాలా చెప్తాడు. మీ నాన్నగారు ఇంటికి లోన్ కోసం మా ఆయన దగ్గర సంతకం కోసం చాలాసార్లు తిరిగారు ఆయన సంతకం చేస్తేనే లోన్ వచ్చింది.. ఇప్పుడు గది వేయించాలంటే కచ్చితంగా ఇంకెన్ని జరుగుతాయి అని శోభా దారుణంగా మాట్లాడుతుంది.. శోభ మాటకు మాట సమాధానం చెప్తాడు బాలు. మీరు ఇకనుంచి వెళ్ళిపోకపోతే నేను మెడ పట్టేది గెంటేస్తాను. ఆడవాళ్ళు కాబట్టి బ్రతికి పోయారు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అందరూ బాలుని అనడంతో బాలు కన్నీళ్లు పెట్టుకుంటాడు.. శృతి బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే రవితో గొడవ పెట్టుకుంటుంది. మీ అన్నయ్య ఎలా మాట్లాడాడో చూసావా. మా అమ్మకి కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు. అసలు మీ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా ఎలా మాట్లాడుతున్నాడో. అంటూ సీరియస్ గా బాలుని తిడుతూ ఉంటుంది. దానికి రవి మన ఇంట్లో విషయాలు మీ అమ్మకు ఎందుకు చెప్తున్నావ్ ఏదైనా చెప్పేదానికి రవి మన ఇంట్లో విషయాలు మీ అమ్మకు ఎందుకు చెప్తున్నావ్ ఏదైనా చెప్పే ముందు ఆలోచించాలి అని నీకు అర్థం కాదా అని రవి శృతి పై సీరియస్ అవుతాడు. మీనా బాలుని అందరు అనడంతో బాధపడుతూ ఉంటుంది.. ఆయన నోటికి అదుపు లేదు అందరూ తలా ఒక మాట అనేసారని మీనా ఏడుస్తూ ఉంటుంది.
మీనా పైన ఒంటరిగా ఉండడం చూసిన సత్యం అక్కడికి వెళ్తాడు. ఏంటమ్మా బాధపడుతున్నావా అని అడుగుతాడు. ఏం లేదు మావయ్య చెప్పండి ఏం కావాలి అని అడుగుతుంది మీనా.. బాలుని అన్నందుకు నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు కదా నాకు అర్థం అయిపోతుంది అని సత్యం అంటాడు. అదేం లేదు మావయ్య చెప్పండి అని మీనా అంటుంది. నాకు తెలుసమ్మా వాడిని కొట్టకుండా ఉండాల్సింది. వాడు అలా మాట్లాడితే గొడవ పెరుగుతుందని నేను ఇవన్నీ కంట్రోల్ చేశాను అది అందరికీ ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు. నేను కొట్టడం వల్ల బాలు ఎంతగా ఫీలయ్యాడు అర్థం చేసుకోగలను అని సత్యం అంటాడు.
మీరు కొట్టడం వల్ల ఆయన కోపాన్ని కంట్రోల్ చేశారు మామయ్య.. లేకుంటే పండగ రోజు పెద్ద గొడవే అయ్యేది అని మీనా అంటుంది. వాడు ఎక్కడికెళ్లాడమ్మా కనిపించలేదు అని మీ నాన్న అడుగుతాడు సత్యం.. ఏమో మావయ్య తెలీదు బయటకు వెళ్ళాడు ఇంకా రాలేదు అని అంటుంది. వాడు వస్తే నేన క్షమించమని అడిగానని చెప్పమ్మా అని సత్యం అంటాడు.. అంతంత పెద్ద మాటలు ఎందుకులే మామయ్య మీరు ఏం తప్పు చేశారని ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు.
ఆయన మీ కొడుకు ఆయన్ని కంట్రోల్ చేసే బాధ్యత కొట్టే హక్కు మీకే ఉంటుంది ఇంకెవరికి లేదు అని మీనా అంటుంది. సత్య మాత్రం కొడుకుని అర్థం చేసుకున్నాను కాబట్టే ఎవరి దగ్గర మాట పడకూడదని కొట్టాను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మీరేం బాధపడకండి మావయ్య ఈరోజు బాధపడిన ఆయనే రేపు మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతాడు అని మీనా ధైర్యం చెబుతుంది. కానీ మీనా మాత్రం బాలు ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది. బాలు ఇంతసేపైనా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళాడు కారు స్టాండ్ లో ఏమైనా పడుకున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది.
రాజేష్ దగ్గరకు వచ్చిన బాలు.. ఆ డబ్బడమ్మ వాళ్ళ అమ్మ చాలా ఘోరంగా అవమానించింది.. మా నాన్నని తక్కువ చేసి మాట్లాడింది. మేము ఆమె దయ దక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతుకుతున్నట్లు చెబుతుంది. ఆమె ఇవ్వాలనుకుంటే ఆమె కూతురికి ఒక బంగ్లా కట్టించి ఇవ్వచ్చు. మా నాన్నని తక్కువ చేసి మాట్లాడితే నాకు కోపం రాదా ఆ క్షణంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను రా.. కానీ అందరూ నన్నే అంటున్నారు అని బాలు బాధపడతాడు. నేను నాన్న గురించి ఆలోచించాను అందుకే కోప్పడ్డాను కానీ నాన్న నన్ను కొట్టడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని బాలు కన్నీళ్లు పెట్టుకుంటాడు.
Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ భాగ్యం జీవితంలో అన్నీ కష్టాలే.. గుండె తరుక్కుపోతుంది..!
మీ నాన్న కొట్టాడని నువ్వు బాధపడుతున్నావ్ నీ కోపాన్ని కంట్రోల్ చేశాడని నాకు అనిపిస్తుంది రా అని రాజేష్ అంటాడు. బాలు మాత్రం ఈ బాధను మర్చిపోవాలంటే ఇంకొకటి కావాలి అని అడుగుతాడు. మొత్తానికి ఫుల్లుగా మందు కొట్టి ఇంటికి వస్తాడు.. బాలుని చూసిన మీనా షాక్ అవుతుంది. సత్యం బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..