Tilak Varma: టీం ఇండియా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ( Tilak Varma) గురించి తెలియని వారు ఉండరు. అతి తక్కువ కాలంలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, యువరాజ్ సింగ్ తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే టీమిండియాలో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే అలాంటి తిలక్ వర్మకు భయంకరమైన వ్యాధి సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాధి వచ్చిన నేపథ్యంలో తనకు భారత క్రికెట్ నియంత్రణ మండలితో పాటు ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) యాజమాన్యం భారీ సహాయం చేసినట్లు తిలక్ వర్మ తన సన్నిహితులతో వెల్లడించారట. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జాతీయ మీడియాలో కూడా ఈ న్యూస్ వైరల్ గా మారింది.
టీమిండియా తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కండరాలకు సంబంధించిన భయంకరమైన వ్యాధి సోకిందట. అతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు వచ్చిన తొలి సీజన్ లో ఈ వ్యాధి బయట పడిందట. రాబ్డోమియోలిసిస్ ( rhabdomyolysis) అనే భయంకరమైన కండరాల వ్యాధి తిలక్ వర్మకు వచ్చిందట. ఈ వ్యాధి వస్తే కండరాలు మొత్తం విచ్చినవైపోతాయట. మనిషి పూర్తిగా వీక్ అయిపోతాడని సమాచారం. ఈ వ్యాధి మూత్రపిండాలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుందట. తీవ్రమైన వ్యాయామం, గాయాలు అలాగే గాయాలకు మెడిసిన్స్ విపరీతంగా తీసుకున్న వాళ్లకు ఈ వ్యాధులు సోకుతాయని సమాచారం అందుతుంది. అయితే ఈ భయంకరమైన వ్యాధి బారిన తిలక్ వర్మ పడడంతో అతని కెరీర్ ముగిసిందని కుటుంబ సభ్యులు అనుకున్నారట.
తిలక్ వర్మ అనారోగ్యం విషయం అంబానీ కుటుంబం దాకా వెళ్ళినట్లు తెలుస్తోంది. అప్పుడే వెంటనే అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ.. రంగంలోకి దిగాడట. నేరుగా తిలక్ వర్మ కు ఫోన్ చేసి ఈ భయంకరమైన వ్యాధిపై ఆరా తీసాడట. అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులతో కూడా చర్చించాడట. ఆ సమయంలో తిలక్ వర్మకు బీసీసీఐ తో పాటు ఆకాష్ అంబానీ చాలా సహాయం చేసినట్లు తిలక్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఎంత మేరకు వాస్తవము ఉందో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఐపిఎల్ 2022 సీజన్ సమయంలో తిలక్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి సీజన్ నుంచే ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా మొన్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్‌లో కూడా తిలక్ వర్మ అద్భుతంగా ఆడి గెలిపించిన సంగతి తెలిసిందే.