BigTV English
Advertisement

OTT Movie : భార్యాభర్తల మధ్యలోకి మరొకరు… వెన్నులో వణుకు పుట్టించే సీన్లు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : భార్యాభర్తల మధ్యలోకి మరొకరు… వెన్నులో వణుకు పుట్టించే సీన్లు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఎన్ని సినిమాలు చూసినా, సైకో కిల్లింగ్ స్టోరీలతో వచ్చే సినిమాలను చూస్తే వచ్చే కిక్కే వేరు. ఈ సినిమాలలో షాకింగ్ ట్విస్ట్ లు, వణుకు పుట్టించే సీన్లతో ఆడియన్స్ సీట్ ఎడ్జ్ కి వెళ్తుంటారు. ఇప్పుడు మనంచెప్పుకోబోయే సినిమా కథ, ఒక లెస్బియన్ జంట చుట్టూ తిరుగుతుంది. ఈ జంటలో ఒకరు సీరియల్ కిల్లర్ గా ఉంటారు. ఇక కథ నడిచే కొద్దీ, ఆ కిల్లర్ అరాచకం బయట పడుతుంది. క్లైమాక్స్ మరింత ఉత్కంఠంగా నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీ లో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘వాట్ కీప్స్ యూ అలైవ్’ (What Keeps You Alive) కోలిన్ మినిహాన్ డైరెక్ట్ చేసిన కెనడియన్ సైకలజికల్ హారర్ థ్రిల్లర్. ఇందులో హాన్నా ఎమిలీ ఆండర్సన్ (జూల్స్), బ్రిటానీ అలెన్ (జాకీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2018 ఆగస్ట్ 24 నుంచి Netflix, Amazon Prime Videoలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఐయండిబి లో 5.7/10 రేటింగ్ ని పొందింది.

కథలోకి వెళ్తే

జూల్స్, జాకీ అనే లెస్బియన్ జంట పెళ్లి చేసుకుని, వాళ్లు తమ మొదటి వివాహ వార్షికోత్సవంను సెలబ్రేట్ చేయడానికి వస్తారు. జాకీ ఫారెస్ట్ లో రేంజర్ ఉద్యోగం చేస్తుంటుంది. జూల్స్ టీచర్ గా జాబ్ చేస్తుంటుంది. మొదట వాళ్లు హ్యాపీగా ఉంటారు. రొమాంటిక్ మూమెంట్స్, హైకింగ్, లేక్ దగ్గర టైమ్ స్పెండ్ చేస్తూ సరదాగా గడుపుతుంటారు. కానీ జాకీకి ఒక డార్క్ సీక్రెట్ ఉంది. ఆమె సీరియల్ కిల్లర్, గతంలో 6 మందిని ఇలాగే పెళ్లి చేసుకుని చంపింది. అయితే అందరూ ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించింది. ఇప్పుడు జూల్స్‌ను కూడా చంపాలని ప్లాన్ చేస్తుంది.


వాళ్లు లేక్ దగ్గర టైమ్ స్పెండ్ చేస్తూ, రొమాంటిక్ డిన్నర్, డాన్స్ లతో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ జాకీ మనసులో డార్క్ ప్లాన్ వేస్తుంది. జూల్స్ మాత్రం జాకీని ఫుల్ ట్రస్ట్ చేస్తుంది. కానీ ఒక రోజు జూల్స్‌ను జాకీ హైకింగ్‌కు తీసుకెళ్తుంది. వీళ్ళు క్లిఫ్ దగ్గరకు వెళ్తారు. అక్కడ జూల్స్‌ను జాకీ క్లిఫ్ నుండి కిందికి తోసేస్తుంది. ఆమె చనిపోయిందని భావించి, పోలీస్‌ లకు జూల్స్ యాక్సిడెంట్‌లో చనిపోయిందని చెప్పడానికి రెడీ అవుతుంది.

Read Also : మాస్క్ మ్యాన్ మారణహోమం… ఒళ్లుగగుర్పొడిచేలా మర్డర్స్… ఒంటరిగా చూశారో ఫసక్

అయితే ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. జూల్స్ క్లిఫ్ నుండి పడినా చనిపోదు. ఆమె గాయాలతో సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు జూల్స్ తన ఫోన్‌లో జాకీ గురించి రీసెర్చ్ చేస్తుంది. జాకీ పాస్ట్ గురించి తెలుసుకుని షాక్ అవుతుంది. ఆమె 6 మందిని చంపిన సీరియల్ కిల్లర్ అని తెలుస్తుంది. ఆమె జాకీని ఎదుర్కోవాలని డిసైడ్ చేస్తుంది. జాకీ కూడా జూల్స్ బతికే ఉందన్న విషయం తెలుసుకుని, ఆమెను చంపడానికి ఫారెస్ట్‌లో సెర్చ్ చేస్తుంది. ఇక క్లైమాక్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఉత్కంఠంగా నడుస్తుంది. జూల్స్ ని కూడా జాకీ చంపుతుందా ? జాకీపై జూల్స్ రివేంజ్ తీర్చుకుంటుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : డీమాన్‌తో దిక్కుమాలిన పని… ఫ్రెండ్స్‌నే బలిచ్చి… గుండె జారిపోయే సీన్లున్న హర్రర్ మూవీ

OTT Movie : నది మధ్యలో బట్టలిప్పి ఫొటోలు… కట్ చేస్తే పార్ట్స్ ప్యాక్ అయ్యే ట్విస్ట్… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఆ పాడు పని… పోలీసులకు చెమటలు పట్టించే మాస్క్ మ్యాన్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఒంటరిగా మనిషి దొరికితే వదలకుండా అదే పని… సీను సీనుకో ట్విస్ట్… పిచ్చెక్కించే సైకో థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల ఎంఎంఎస్ కుంభకోణం… అన్నీ అలాంటి కేసులే… సింగిల్‌గా ఉన్నప్పుడే చూడండి

OTT Movie : టూరిస్ట్ గైడ్‌తో యవ్వారం… అమ్మాయి మిస్సింగ్‌తో ఊహించని టర్న్… బోన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : 800 కోట్ల బిగ్గెస్ట్ స్కామ్… ఓటీటీలోకి అడుగు పెట్టిన ‘బిచ్చగాడు’ హీరో న్యూ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×