IND VS AUS, 3rd ODI: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా (Australia vs India, 3rd ODI) మధ్య ఇవాళ చిట్టచివరి వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. సిడ్ని ( Sydney Cricket Ground) వేదికగా జరగబోయే ఈ వన్డే మ్యాచ్ ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే టాస్ ప్రక్రియ ముగిసింది. దీంతో టాస్ గెలిచిన ఆసీస్, మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో టాస్ ఓడిన టీమిండియా, మొదట బౌలింగ్ చేయనుంది. ఈ తరుణంలోనే టీమిండియా చెత్త రికార్డును నమోదు చేసుకుంది. వరుసగా 18 సార్లు వన్డేలలో టాస్ ఓడిన జట్టుగా రికార్డు నమోదు చేసుకుంది. కాగా ఇప్పటికే ఈ సిరీస్ కోల్పోయిన టీమిండియా… ఎలాగైనా చివరి వన్డేలో గెలవాలని కసరత్తులు చేస్తోంది. అటు చివరి వన్డేలో గెలిచి ఇండియాను వైట్ వాష్ చేయాలని ఆస్ట్రేలియా బిగ్ స్కెచ్ వేసింది.
రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన టీమిండియా, ఈ మూడో వన్డేలో మాత్రం భారీ మార్పులతో రాబోతోంది. నితీష్ కుమార్ రెడ్డి, అర్ష దీప్ సింగ్ ను జట్టులో నుంచి తొలగించి, కుల్దీప్ యాదవ్ తో పాటు ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు. ఎప్పటి లాగే, హర్షిత్ రాణాకు జట్టులో అవకాశం కల్పించింది టీమిండియా. దీంతో మరోసారి విమర్శలు వస్తున్నాయి. హర్షిత్ రాణాను తొలగించి, అర్షదీప్ సింగ్ ను ఉండాల్సిందని అంటున్నారు.
ఇవాళ జరిగే ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మూడో వన్డే మ్యాచ్ విరాట్ కోహ్లీకి ( Virat Kohli) చిట్ట చివరిది అని తెలుస్తోంది. ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే t20 లతోపాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ.. వన్డేలకు కూడా రిటైర్మెంట్ ఇస్తాడని అంటున్నారు. మొదటి రెండు వన్డేల్లో డక్ అవుట్ అయిన విరాట్ కోహ్లీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవాలని అభిమానులే డిమాండ్ చేస్తున్నారు. ఏజ్ పైబడింది, కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (కెప్టెన్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్
INDIA IN THE LAST 18 TOSS IN ODI CRICKET:
– Lost, Lost, Lost, Lost, Lost, Lost, Lost, Lost, Lost, Lost, Lost, Lost, Lost, Lost, Lost, Lost, Lost, Lost*. pic.twitter.com/uslPqlO2pt
— Tanuj (@ImTanujSingh) October 25, 2025