Jabardast Promo : బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎంతో మంది కమెడియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈ కామెడీ షో. అలాగే ఇప్పటివరకు ఎంతో మంది ఈ షో ద్వారా తమ టాలెంట్ ని నిరూపించుకున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికీ దిగ్విజయంగా ప్రసారమవుతుంది. ఇటీవలే ఈ షో 12 ఏళ్ల వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుక తర్వాత నాగబాబు మళ్లీ జబర్దస్త్ లోకి రావడం చాలా మందికి సంతోషంగా ఉందని చెప్పాలి. ఇప్పటికే ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండు మూడు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. తాజాగా నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ చేసిన ప్రయోగం ప్రేక్షకుల చేత చివాట్లు తినేలా చేసింది. ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. అసలు బుల్లెట్ భాస్కర్ కి ఏమైంది? ఆయన చేసిన అతి పెద్ద రిస్కేంటో ఒకసారి ఆర్టికల్‌లో చూసేద్దాం..
ప్రస్తుతం జబర్దస్త్ లో కొనసాగుతున్న టీం లీడర్లలో బుల్లెట్ భాస్కర్ ఒకరు. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడే కొనసాగుతూ వస్తున్నాడు. ఒకవైపు సినిమాలలో అవకాశాలను అందుపుచ్చుకుంటూ బిజీగా ఉన్నా సరే ఈ షో ని మాత్రం ఇతను వదల్లేదనే చెప్పాలి.. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో ను చూస్తే.. భాస్కర్ పెద్ద సాహసమే చేసినట్టు తెలుస్తుంది. భాస్కర్ అసలు ఆడవాళ్లు సుఖంగా ఉంటారా మగవాళ్లు సుఖంగా ఉంటారా.. అంటూ భాస్కర్‌ని అడుగుతుంది వర్ష. ఎప్పటికైనా ఈ ప్రపంచంలో మగాళ్లు ఉన్నంత నీటిగా ఎవరూ ఉండరు.. మేము సెలూన్ షాప్‌కెళ్లి వచ్చి స్నానం చేస్తే గానీ లోపలికెళ్లం.. మీరు బ్యూటీ పార్లర్‌కి వెళ్లొచ్చి కనీసం ముఖమైనా కడుక్కుంటారా అని అంటాడు.
ఇదంతా కాదు ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉంటుంది ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని వర్షా అంటుంది. విజయం ఒక్కటే కాదమ్మా ప్రతి మగాడి సమాధి వెనుక కూడా ఆడదాని పేరే ఉంటుంది అని భాస్కర్ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంచ్ వేస్తాడు.. స్కిట్‌లో భాగంగా ఫైమా పెళ్లయిన వెంటనే తన భర్తని హత్య చేస్తుంది. ఇగో ఆ డ్రమ్ములో కొద్దిగా బొక్క పడ్డది ప్లాస్టర్ పెట్టవా అని అడుగుతుంది. నీకోసం ఏమాత్రం ఆ పని కూడా చేయలేనా అని భాస్కర్ అంటాడు. వెంటనే డ్రమ్ములోకి దూరతాడు. అంతే స్కిట్లో మొత్తానికి నరకాన్ని అయితే చూసినట్లు కనిపిస్తుంది. భాస్కర్ స్కిట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. భాస్కర్ డ్రమ్ము మేటర్ తెలియాలంటే కచ్చితంగా ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే.
Also Read : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..
ప్రతి వారం లాగానే ఈవారం కూడా టీం లీడర్లు కొత్త స్కిట్లతో ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయ్యారు. ముందుగా రాకింగ్ రాకేష్ సుజాత టీం వచ్చి పర్ఫామెన్స్ చేస్తారు. ఆ తర్వాత నూకరాజు టీమ్ వస్తారు. రాకెట్ రాఘవ అండ్ టీం తర్వాత వచ్చి పర్ఫామెన్స్ చేస్తారు. వీరు సరికొత్త కంటెంట్తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. చివరగా వచ్చిన భాస్కర్ స్కిట్ మాత్రం ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది అని తెలుస్తుంది. మొత్తానికి ఈ ప్రోమో మాత్రం అదిరిపోయింది.. మీకు ఎలా అనిపించిందో తెలియాలంటే ఈ ప్రోమో పై ఓ లుక్ వేసుకోండి..