AR Muragadoss: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా, ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురగదాస్(AR Muragadas) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మదరాసి(Madarasi ). ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉండగా.. మలయాళ నటుడు బిజు మీనన్, విక్రాంత్ షాబీర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా పై అంచనాలు పెంచడానికి డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ (AR Muragadas) పలు ప్రెస్ మీట్ లలో పాల్గొంటూ సినిమా గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
అందుకే మదరాసి టైటిల్ పెట్టాం..
ఈ క్రమంలోనే ఈ చిత్రానికి ‘మదరాసి’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అనే ప్రశ్న ఎదురవ్వగా.. అసలు విషయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు ఏ ఆర్ మురగదాస్. మురగదాస్ మాట్లాడుతూ..” మామూలుగా మన దక్షిణాది వారిని ఉత్తరాది వారు మదరాసి అని పిలుస్తూ ఉంటారు. ఈ చిత్రం ఎక్కువగా విలన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే సాగుతుంది. ఈ సినిమాలో విలన్ ఉత్తరాది వ్యక్తి కావడం.. పైగా సౌత్ కు చెందిన హీరో కాబట్టి.. హీరోను మదరాసి అని పిలుస్తూ ఉంటారు. అందుకే టైటిల్ కూడా అలాగే పెట్టాము” అంటూ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే మదిరాసి అనే టైటిల్ పెట్టడంపై అసలు విషయాన్ని చెప్పి అందరికీ ఒక క్లారిటీ ఇచ్చారు..
అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అవుతుంది..
అలాగే ఈ టైటిల్ ను అన్ని ప్రాంతాల వారు రిసీవ్ చేసుకుంటారా? అని ప్రశ్నించగా.. దానికి డైరెక్టర్ సమాధానం ఇస్తూ.. “మదరాసి సినిమా కథ మొత్తం తమిళనాడు నేపథ్యంలోనే సాగుతుంది..అందుకే టైటిల్ ఇలా పెట్టాను. ఒకవేళ బెంగళూరులో కథ జరుగుతుంటే మదరాసి అనే టైటిల్ పెట్టలేను కదా.. ఇందులోని కథ , కంటెంట్ కచ్చితంగా అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అవుతుంది” అంటూ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.
యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయి…
అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సన్నివేశాలు సినిమాకి హైలెట్గా నిలుస్తాయని, హీరో – విలన్ మధ్య వచ్చే యాక్షన్ ఘట్టాలు కూడా ఆడియన్స్ ను మెప్పిస్తాయి అని డైరెక్టర్ సినిమాపై అంచనాలు పెంచేశారు. మరి ఇన్ని అంచనాల మధ్య రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా డైరెక్టర్ చెప్పినట్టుగా అందరి అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ALSO READ:Film industry: హీరో పవన్ పై కేస్ ఫైల్.. చంపేస్తానంటూ బెదిరింపులు!