Jabardast: సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ ఒక్కోసారి నిజం అవుతాయి.. ఒక్కోసారి ఆ సంబంధిత వ్యక్తులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి వచ్చే రూమర్ల వల్ల సెలబ్రిటీలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే యూట్యూబ్ వీడియోల ద్వారా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకొని.. ఆ తర్వాత జబర్దస్త్ (Jabardast) లోకి అడుగుపెట్టి మంచి పేరు దక్కించుకున్న ఒక కమెడియన్ కి.. రూ.200 కోట్ల ఆస్తి ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం కాస్త బాగా వైరల్ అవ్వడంతో అందరూ సదరు కమెడియన్ ని ట్యాగ్ చేస్తూ ఎలా సంపాదించారు ? అంటూ కామెంట్లు చేశారు. ఎట్టకేలకు ఆ కమెడియన్ స్పందించి అసలు విషయం బయట పెట్టి.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు.
ఆ కమెడియన్ ఎవరో కాదు కొమురక్క (Komurakka).. అలియాస్ కుమార్. ఒకప్పుడు జబర్దస్త్ లో లేడీ గెటప్ లకు మంచి డిమాండ్ ఉండేది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మహిళా కమెడియన్స్ కూడా జబర్దస్త్ లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో పురుషుల లేడీ గెటప్ లకు అవకాశం లేకుండా పోయింది. కానీ ఒకప్పుడు పురుషులు మాత్రమే మహిళల గెటప్ లు వేసుకునేవారు. అలా కుమార్ కూడా మహిళల గెటప్ వేసుకొని కొమురక్క పాత్రతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చారు.
అందులో బాగానే కొమురక్క మాట్లాడుతూ..” నేను గతంలో ఎన్నో దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాను. మొదట్లో చార్మినార్, కామత్, ఉడిపి వంటి ప్రాంతాలలో ఉన్న అనేక హోటల్లో పనిచేశాను. దాదాపు 8 సంవత్సరాలు ఆ హోటలలో పనిచేశాను. ఒకానొక సమయంలో నా తండ్రికి 20 ఎకరాల భూమి ఉండేది. కానీ అప్పులు ఎక్కువ కావడంతో దానిని మేము అమ్మేశాము. చివరికి 5 ఎకరాలు మాత్రమే మిగిలింది. దీంతో ఎలాగైనా సరే భూమిని సంపాదించాలనుకున్నాను. చాలా కష్టపడి పని చేశాను. ఎక్కువ ఖర్చు చేయకుండా ఉన్న దాంట్లోనే సర్దుకొని పోతూ సంపాదించిన డబ్బు మొత్తాన్ని భూమి కోసమే ఖర్చు చేశాను. అలా తిరిగి మా భూమిని మేము దక్కించుకోగలిగాము. మా అదృష్టం కొద్దీ మా ప్రాంతంలో విమానాశ్రయం రావడంతో అక్కడ భూమి ధరలు పెరిగిపోయాయి. దీంతో ఆ భూమి విలువ రూ.200 కోట్లకు పైగానే ఉంటుంది” అంటూ తెలిపారు.
ALSO READ:Regina Cassandra: నేను ప్రెగ్నెంట్.. సడన్ షాక్ ఇచ్చిన రెజీనా.. ఈ ట్విస్ట్ ఏంటి తల్లీ!
మొత్తానికి కుమార్ 200 కోట్లకు ఆస్తిపరుడు అంటూ వస్తున్న వార్తలలో నిజం ఉందని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అదృష్టం తలుపు తడితే ఎంతటి వారైనా కోటీశ్వరులు కావాల్సిందే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.