E-Paper
Advertisement

కోడింగ్ నుంచి ఇల్లు వెతకడం వరకు..ఏఐ చేసే ఈ మ్యాజిక్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే!

కోడింగ్ నుంచి ఇల్లు వెతకడం వరకు..ఏఐ చేసే ఈ మ్యాజిక్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే!
Advertisement

OpenAI GPT-6 Astra launch AGI era: ప్రపంచాన్ని మలుపు తిప్పుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఓపెన్‌ఏఐ మరో అద్భుతమైన సృష్టికి తెరతీసింది. మానవ ప్రమేయం లేకుండా అత్యంత క్లిష్టమైన పనులను ఇట్టే పూర్తి చేసే పవర్ ఫుల్’జీపీటీ-6 ఆస్ట్రా’ (GPT-6 Astra) మోడల్‌ను ఆవిష్కరించింది. ఇప్పటి వరకూ టెక్ ప్రపంచంలో ఎన్నడూ చూడని రీతిలో ఇది సరి కొత్త రికార్డులను సృష్టిస్తోంది.ఈ మోడల్ లాంచ్‌తో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ శకం మొదలైందని ఓపెన్‌ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఈ రోజును మాన వాళి ఒక చారిత్రక ఘట్టంగా గుర్తుంచుకుంటుందని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

జీపీటీ-6 ఆస్ట్రా అద్భుతాలు:

సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, సైంటిఫిక్ అనాలిసిస్, ఫైనాన్షియల్ మోడలింగ్ వంటి సంక్లిష్టమైన రంగాలలో జీపీటీ-6 ఆస్ట్రా అద్భుతంగా పని చేస్తుంది. అంతే కాకుండా.. రోజూ మనం చేసే టాక్స్ ఫిల్లింగ్, ఫారమ్ నింపడం వంటి సాధారణ పనులను కూడా.. ఇది క్షణాల్లోనే పూర్తి చేయగలదు. ఉదాహరణకు.. సాధారణంగా ఒక ఇల్లు అద్దెకు వెతకడానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. కానీ ఆస్ట్రాలోని ఏఐ ఏజెంట్లు ఈ పనిని కేవలం 10 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే పూర్తి చేసి ఆశ్చర్యపరిచాయి. ఎలాంటి మానవ సహాయం లేకుండానే కోడింగ్ రాయడం, వెబ్‌సైట్లు తయారుచేయడం, సైంటిఫిక్ రీసెర్చ్ చేయడం వంటి పనులను ఇది సునాయాసంగా చేయగలదు.

Advertisement

ఈ మోడల్ మరొక గొప్ప విశేషం సైబర్ సెక్యూరిటీ రంగంలో దీని అసాధారణ ప్రతిభ. బలమైన, సురక్షితమైన సిస్టమ్స్‌లో ఉండే టెక్నికల్ లోపాలను , సెక్యూరిటీ ఫ్లావ్స్‌ను ఇది ఆటోమేటిక్‌గా పసిగట్టగలదు. టెస్టింగ్ సమయంలో ఇది ఎవరికీ తెలియని రెండు కొత్త సెక్యూరిటీ లోపాలను గుర్తించి డెవలపర్లను అప్రమత్తం చేసింది. అయితే.. ఈ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు డిఫెన్స్ , అటాక్ రెండింటికీ ఉపయోగపడే అవకాశం ఉండటంతో.. భద్రతా కారణాల దృష్ట్యా ఓపెన్‌ఏఐ దీనిని చాలా నియంత్రిత పద్ధతిలో అందిస్తోంది. ప్రస్తుతం కేవలం ‘డేబ్రేక్ బ్లూ’ ప్రోగ్రామ్ ద్వారా నమ్మకమైన సైబర్ డిఫెండర్లకు మాత్రమే దీనిని ఉపయోగించడానికి అవకాశం కల్పించారు.

Also Read: మీ చేతులకు రెస్ట్ ఇచ్చి, గిన్నెలను కొత్తగా మెరిపించే డిష్‌వాషర్లు!

Advertisement

మరోవైపు.. ఆస్ట్రా లాంచ్ అయిన రోజే ప్రపంచ వ్యాప్తంగా టెక్ ప్రపంచంలో చిన్నపాటి గందరగోళం చెలరేగింది. చాట్‌జీపీటీతో పాటు ఇతర ప్రముఖ ఏఐ ప్లాట్‌ ఫారమ్‌లు ఒకే సారి టెక్నికల్ సమస్యలను ఎదుర్కొన్నాయి.చాట్‌జీపీటీ లాగిన్, వాయిస్ మోడ్, ఫైల్ అప్‌లోడ్ సేవలకు కొన్ని గంటల పాటు అంతరాయం ఏర్పడింది. అయితే ఈ అంతరాయానికి, ఆస్ట్రా లాంచ్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందనేదానికి ఎలాంటి ఆధారాలు లేవని టెక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

త్వరలోనే ఈ లేటెస్ట్ జీపీటీ-6 ఆస్ట్రా మోడల్ సాధారణ యూజర్ల అందుబాటులోకి రానుంది. మొదటగా చాట్‌జీపీటీ ప్లస్, ప్రో, బిజినెస్ , ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు దీనిని రోల్‌ అవుట్ చేయనున్నట్లు ఓపెన్‌ఏఐ అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత ఏపీఐ డెవలపర్లకు కూడా దీని సేవలను విస్తరించనున్నారు. ఈ సరి కొత్త టెక్నాలజీ రాకతో రాబోయే రోజుల్లో మన డైలీ లైఫ్ స్టేల్, ఉద్యోగాల్లో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

చలికాలంలో ఏసీ కొంటే వేలల్లో డబ్బులు సేవ్! ఎవరూ చెప్పని సీక్రెట్ ట్రిక్ ఇదే!

మీ చేతులకు రెస్ట్ ఇచ్చి, గిన్నెలను కొత్తగా మెరిపించే డిష్‌వాషర్లు!

ఎవరైనా కెమెరా గ్లాసెస్ పెట్టుకుని మీకు దగ్గర్లో ఉంటే.. ఈ యాప్ ఇట్టే పసిగట్టేస్తుంది!

వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌కు ఒకే సబ్‌స్క్రిప్షన్.. Meta One వచ్చేసింది!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. రోజులు తరబడి టెన్షన్ ఫ్రీ

వాట్సాప్ చాట్స్ డిలీట్ చేయకుండా.. స్టోరేజ్ ఎలా ఖాళీ చేయాలి?

రూ.1500లోపు అదిరిపోయే ఇయర్ బడ్స్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

Big Stories

Advertisement
×