E-Paper
Advertisement

రూ.100 కోట్లు ఉంటేనే ఎమ్మెల్యే.. నిజాలు బయటపెట్టిన ఉదయభాను!

రూ.100 కోట్లు ఉంటేనే ఎమ్మెల్యే.. నిజాలు బయటపెట్టిన ఉదయభాను!
Advertisement

Udaya Bhanu:ఒకప్పుడు బుల్లితెరపై తనదైన మార్క్ యాంకరింగ్ తో సుదీర్ఘకాలం పాటు ప్రేక్షకుల మనసులు సొంతం చేసుకున్న గ్లామరస్ యాంకర్ ఉదయభాను (Udaya Bhanu )గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. నిష్పక్షపాతంగా, ముక్కుసూటిగా మాట్లాడుతూ.. అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమెకు అనూహ్యంగా అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయింది. మధ్యలో అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్ లలో చేసిన ఈమె మళ్లీ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఉదయభాను ఎక్కడ అని ఎదురుచూసిన అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది ఉదయభాను. నిర్మాతగా మారి.. జి ఫైవ్ ఓటిటి వేదికగా ‘పంచనామా’ అనే వెబ్ సిరీస్ నిర్మించి మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ సిరీస్ కి ప్రేక్షక ఆదరణ దక్కడంతో ఎమోషనల్ కామెంట్లు చేస్తూ అభిమానులకు కృతజ్ఞతలు కూడా తెలియజేసింది. అలాంటి ఈమె పలు ఇంటర్వ్యూలలో ఎన్నో విషయాలు పంచుకుంది. అందులో భాగంగానే తన పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన ఉదయభాను.. 100 కోట్లు ఇస్తేనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పినట్టు ఎన్నో షాకింగ్ నిజాలను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.100 కోట్లు.. ఏడాదిన్నరలోపే రికవరీ..

పొలిటికల్ ఎంట్రీ పై 100% ఆసక్తితో ఉన్న ఉదయభాను.. “గతంలో నాకు ఒక ప్రముఖ రాజకీయ పార్టీ నుంచి పిలుపు వచ్చింది. ఆ సమయంలో కోరిన నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇస్తామని చెప్పారు. అయితే ఆ ఆఫర్ వెనుక ఒక ఊహించని షరతు పెట్టారు. టికెట్ కావాలి అంటే రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నా దగ్గర ఉంచుకోవాలని, ఆ మొత్తాన్ని ఎన్నికల తరువాత ఏడాదిన్నర లోపే మళ్ళీ సంపాదించుకోవచ్చని ఉచిత సలహా కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఒక బేసిక్ నంబర్ ఇది. ఎమ్మెల్యేగా టికెట్ పొందాలంటే రూ.100 కోట్లు మినిమం ఖర్చు పెట్టాల్సిందే. అది నేను విని నేనే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను.

Advertisement

also read:ఉదయభాను ఎలా.. ఝాన్సీ ఇలా.. ఎవరు నిజం?

కోట్లు కాదు కదా ఇంట్లో వేసుకునే కోట్ కూడా లేదు..

ఒకవేళ నా దగ్గరే అంత డబ్బు ఉంటే.. నేనెందుకు మళ్ళీ అవకాశాల కోసం వెతుక్కుంటాను. నా దగ్గర కోట్లు కాదు కదా కనీసం వేసుకునే కోట్లు కూడా లేవు.అంటూ ఊహించని కామెంట్లు చేసింది ఉదయభాను. మొత్తానికైతే ఉదయభాను చేసిన కామెంట్లను బట్టి చూస్తే నిజంగా ఒక అభ్యర్థి ఎమ్మెల్యేగా టికెట్ అందుకోవాలంటే.. ఆ వ్యక్తి పార్టీకి 100 కోట్లు చెల్లించాల్సిందేనా అనే కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. మరి ఈ మాటలు ఎంతవరకు దారితీస్తాయో తెలియాల్సి ఉంది.

ఉదయభాను పొలిటికల్ ఎంట్రీ..

Advertisement

పొలిటికల్ ఎంట్రీపై కూడా ఉదయభాను మాట్లాడుతూ.. కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను . కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను . అంతే తప్ప ఏ రాజకీయ పార్టీ కోసమో నేను పని చేయను అంటూ నిక్కచ్చితంగా చెప్పుకొచ్చింది ఉదయభాను.

Related News

ఈ వారం ఆ సీరియల్ అవుట్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

ఉదయభాను అలా.. ఝాన్సీ ఇలా.. ఎవరు నిజం?

Illu illaalu Pillalu Dheeraj : సీరియల్ లవర్స్ కు షాక్.. ధీరజ్ గుడ్ బై..

మీనా నెలకు అంత సంపాదిస్తుందా..? హీరోయిన్ల కంటే ఎక్కువే సుమీ..!

Podarillu Today Episode : మాధవ్, మనీష పెళ్లి ఫిక్స్.. శైలుకు వార్నింగ్.. మాధవ్ పై అనుమానం..

Ninnu kori Serial Today Episode September 18th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి ఇంట్లోకి కేర్ టేకర్లుగా వెళ్లిన చంద్ర, మదన్   

Illu Illalu Pillalu Today Episodes: భద్ర ప్లాన్ సక్సెస్.. వల్లి ఫుల్ హ్యాపీ.. పోలీస్ స్టేషన్ లో రచ్చ రచ్చ..

Big Stories

Advertisement
×