Bigg Boss 10 : బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదంతో పాటు ఎన్నో అనుమానాలను కూడా పుట్టిస్తోంది. ముఖ్యంగా అసలు ఈ సీజన్లో ఏం జరుగుతోంది? అని ఆలోచించే లోపే ఎన్నో తెలియని ఆశ్చర్యాలు అభిమానుడిని తికమక పెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటి వారంలో ఎవరూ ఊహించని విధంగా ఇద్దరిని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి పంపించేసిన బిగ్ బాస్.. ఆ తర్వాత లవ్ ట్రాక్లు సృష్టించడం, హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన వారిలో మళ్లీ ఒకరిని హౌస్ లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించడం, ఫిజికల్ టాస్కులు, భయాన్ని క్రియేట్ చేస్తున్న దృశ్యాలు.. అన్నీ కూడా షోపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఇకపోతే తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. అందులో ఎవరూ ఊహించని విధంగా అస్తిపంజరాలు , శవపేటికలు కనిపించేసరికి కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా యమదూతలు అంటే కొంతమంది హౌస్ లోకి అడుగుపెట్టడం, అందులో షాలినితో బాక్స్ ఓపెన్ చేయమని చెప్పడం .. ఓపెన్ చేసిన వెంటనే ఆమెను హౌస్ నుంచి బయటకు తీసుకెళ్లి పోవడం చూస్తుంటే.. అందరిలో భయం కలుగుతోంది. అసలు వాళ్ళు ఎవరు? ఎందుకు వచ్చారు? షాలినినీ ఎందుకు తీసుకెళ్లారు? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తనదైన ఆట , మాట కాంట్రవర్సీతో హౌస్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న షాలినినీ ఇప్పుడు యమదూతలు లాంటి వ్యక్తులు వచ్చి తీసుకెళ్ళిపోవడంతో ఆమె ఈ వారం ఎలిమినేట్ కాబోతోందా? అందుకే ఇలా హింట్ ఇస్తూ ఆమెను హౌస్ నుంచి వారు బయటకు తీసుకెళ్లిపోయారా ? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. లేకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో షాలిని దగ్గర ఒక కార్డు ఉంటుంది. దానిని చూసి.. వారు చెప్పినట్టుగా ఆమె బాక్సులు ఓపెన్ చేయాల్సి ఉంటుంది . ఆమెకు సపోర్టుగా సృష్టి కూడా వస్తుంది.
అయితే షాలిని కార్డు ముట్టుకోగానే.. వారు ఆమెను తీసుకెళ్లిపోయారు. అటు షాలిని తో పాటు కంటెస్టెంట్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ముందుగా ముట్టుకుంటే.. వారిని హౌస్ లో నుంచి తీసుకెళ్లి పోతున్నారని రాంప్రసాద్ చెప్పడం.. ఆ తర్వాత మళ్లీ వాళ్ళు తిరిగి వస్తారేమో అని రాంప్రసాద్ కార్డ్స్ ఒక్కొక్కటిగా వేయడం మనం చూడవచ్చు . ఇక అసలు ఇది చూసిన తర్వాత ఆడియన్స్ హౌస్ లో ఏం జరుగుతోంది భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక పూర్తి వివరాలు తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
also read: సెలబ్రిటీస్ ఆధిపత్యం వెనుక గుట్టు విప్పిన ఉదయభాను!
ఇకపోతే 10 మంది సెలబ్రెటీలు, 6 మంది కామనర్స్ తో మొత్తం 16 మందితో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభమైంది. అందులో ఒకరు కామన్ కేటగిరీ నుండి చరణ్ , సెలబ్రిటీ కేటగిరి నుండి చైత్ర హౌస్ నుంచి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బయటకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరిని హౌస్ లోకి తీసుకురాబోతున్నారు.