Ninnu kori serial today Episode: విరాట్ మాయను వెతుకుతూ బెంగుళూరులోనే ఉన్నాడని తనను కూడా బెంగుళూరు రమ్మంటున్నాడని నేను రానని చెబితే నా మీద అలిగి కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్చాప్ చేశాడు. ఇప్పుడు నేను వెళ్లకపోతే బావ ఎప్పటికీ రాడు.. అంటూ చంద్ర చెప్పగానే.. రఘురాం అదికాదమ్మా అంటే.. ఏం లేదు మామయ్య.. ఒకవేళ నేను బావ అబద్దం చెప్పి వెళ్లి టూర్ కోసం నెల రోజులు వెళ్దామని అంటే మీరు ఒప్పుకునే వారు కదా అంటుంది. టూర్ కోసం అయితే ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ మీరు వెళ్లేది ప్రమాదం వైపు కదా తెలిసి ఎలా పంపిస్తాము అంటుంది జగదీశ్వరి.
చంద్ర తన మాటలతో అందరినీ ఒప్పిస్తుంది. అందరూ చంద్రకు ఆల్ ది బెస్ట్ చెప్తారు. విరాట్ తో పాటు బిడ్డను కూడా తీసుకుని రమ్మని చెప్తారు. షాలిని మాత్రం అసలు విరాటే లేడంటే ఇంకా విరాట్‌తో పాటు బిడ్డను తీసుకుని ఎలా వస్తుంది పాపం చంద్ర అని మనసులో అనుకుంటుంది. బయటకు మాత్రం చంద్ర క్షేమంగా వెళ్లి లాభంగా రా అని చెప్తుంది. చంద్ర అందరికీ థాంక్స్ చెప్తుంది. జగదీశ్వరిని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఏడుస్తూ వెళ్లిపోతుంది చంద్ర.
ఇంట్లో ఉన్న విరాట్‌కు శ్రీజ కాఫీ తీసుకొస్తుంది. అందరూ శ్రీజను ఆట పట్టిస్తారు. నువ్వు కాఫీ తీసుకురావడం ఏంటని నవ్వుతారు. బావకు నేను తప్ప ఎవరు తీసుకొస్తారు మామయ్య అంటూ చెప్పగానే.. అందరూ నవ్వుకుంటారు. అప్పుడే శ్రీజ అమ్మానాన్నలు కూడా అల్లుడు అంటూ పరుగెత్తుకుంటూ వస్తారు. సామ్రాట్ నువ్వు ఇన్ని రోజులు ఏమై పోయావు.. అసలు శ్రీజతో నీ పెళ్లి అవుతుందా లేదా అని భయం పట్టుకుంది అని చెప్పగానే.. విరాట్ మాత్రం నాన్న వీళ్లెవరు అంటూ అడగ్గానే.. అందరూ షాక్ అవుతారు. శ్రీజ తల్లిదండ్రులు మరింత ఆశ్చర్యంగా వీడేంటే మనల్ని ఎవరు అంటున్నాడు అంటాడు. అప్పుడే దాక్షాయణి వచ్చి కంగారుపడకండి వాడికి చిన్న యాక్సిడెంట్ అయింది. గతం మర్చిపోయాడు అని చెప్పగానే.. నేలగిరి, గిరిజ షాక్ అవుతారు. వెంటనే గిరిజ పెళ్లి గురించి అడుగుతుంది.
అప్పుడే చంద్ర మదన్ డాక్టర్ అక్కడకు వస్తారు. చంద్రను చూసిన విరాట్ నవ్వుతూ రా చంద్ర అని పిలుస్తాడు. మీరెందుకు వచ్చారని దాక్షాయణి అడగ్గానే.. విరాట్ మాత్రం చంద్ర వచ్చేశావా..? నీ గొంతు వినబడగానే నాకేదో తెలియని ఆనందం కలిగింది రా చంద్ర అంటూ దగ్గరకు వెళ్లి చంద్రను చేయి పట్టుకుని తీసుకెళ్తాడు. నేలగిరి ఆశ్చర్యంగా ఇదేంటి మమ్మల్ని గుర్తు పట్టేలేదు కానీ ఆ పిల్లను చేయి పట్టుకుని తీసుకొస్తున్నాడు అని మనసులో అనుకుంటాడు. చంద్రను దాక్షాయణి దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేస్తాడు విరాట్. చంద్ర లేకపోతే హాస్పిటల్‌లో నేను ఏమైపోయేవాడినో అని చెప్తుంటే.. మదన్ బ్రో నా గురించి కూడా కొంచెం చెప్పండి అనగానే.. హాస్పిటల్‌లో నా మీద అటాక్ జరిగినప్పుడు సేవ్ చేసింది తనే మదన్ అని చెప్తాడు. దాక్షాయణి చాలా బాగుంది. వాళ్లిద్దరికీ చెరో లక్ష ఇచ్చి పంపించేయండి అంటుంది. వాళ్లు డబ్బుల కోసం రాలేదని.. మీ అబ్బాయిని చూసుకోవడానికి వచ్చిన కేర్ టేకర్స్ అని డాక్టర్ చెప్తాడు. వీళ్లిద్దరు మీ అబ్బాయిని బాగా చూసుకుంటారని చెప్పి వెళ్లిపోతాడు.
తర్వాత విరాట్‌ను చూడటానికి రైతులు వస్తారు. వాళ్లతో విరాట్ మాట్లాడుతూ తనకు ఎవ్వరూ గుర్తు లేరని చెప్పగానే.. మీకు మేము గుర్తు లేకపోయినా మిమ్మల్ని అసలు మర్చిపోము.. మీరు మాకు చేసిన సహాయానికి మీరు వందేళ్లు చల్లగా ఉండాలి అంటూ దీవిస్తారు రైతులు. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.