E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today February 28th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్ర కోసం బిడ్డన త్యాగం చేయనున్న దీప 

Karthika Deepam 2 Serial Today February 28th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్ర కోసం బిడ్డన త్యాగం చేయనున్న దీప 
Advertisement

Karthika Deepam 2  serial today Episode: 

దీపను ఇబ్బంది పెడుతున్న జ్యోత్స్న, పారిజాతంను దశరథ తిడతాడు. వాళ్ల పనులు వాళ్లే చేసుకోమని చెప్తాడు. అప్పుడే అక్కడకు వచ్చిన కార్తీక్‌, దశరథను బయటకు తీసుకెళ్తాడు. నువ్వు ఇలాగే చేస్తే జ్యోత్స్న, పారిజాతంలు ఎంతకైనా తెగిస్తారు.. అత్తకి ఏమైనా జరిగితే నీ జీవితానికి అర్ధం లేదు అన్నావు.. అలాగే నీకు ఏదైనా అయితే నీ కూతురి జీవితానికి కూడా అర్ధం లేకుండా పోతుంది అని కార్తీక్‌ చెప్పగానే.. దశరథ కోపంగా అలాగని వాళ్లకు భయపడతామా? ఎవరు పనిమనిషిగా ఉండాలి.. ఎవరు సేవలు చేయించుకోవాలి.. బిడ్డల్ని మార్చేసిందే కాక, ఇప్పుడు కడుపులోని బిడ్డని కూడా చంపాలని చూస్తారా? ఎంత దుర్మార్గులు అంటూ తిడుతుంటాడు.

అయితే ఇంతకుముందు ఓసారి దీప కిందపడబోయింది.. అప్పుడు నాకు సరిగా అర్ధం కాలేదు కానీ, నిజం తెలిసినప్పటి నుంచి అంతా అర్ధమవుతోంది. వాళ్ల ముఖాలు చూస్తుంటే కోపం ఆగడం లేదని మండిపడతుంటాడు దశరథ. అయితే కార్తీక్‌ మాత్రం సుమిత్రకు ఆపరేషన్ జరిగే వరకు భరించాలని.. ఇప్పుడు నువ్వు ఎంత ఓపిక పడతావో, భవిష్యత్ అంత అందంగా ఉంటుందని చెప్పగానే.. దశరథ మాత్రం కోపంగా  జ్యోత్స్నని, మా పిన్నిని జీవితంలో క్షమించనని కోప్పుడుతుంటాడు. అప్పుడే డాక్టర్‌ ఫోన్‌ చేసి దీపను హాస్పిటల్‌కు తీసుకురమ్మని చెప్తుంది. కార్తీక్‌ వెళ్లిపోతాడు.

Advertisement

ఇక కాంచన, శ్రీధర్‌తో కాశీ, స్వప్నలకు విడాకులు ఇప్పించి వాళ్లకు చెరో మరో పెళ్లి చేయమని చెప్తుంది. కాంచన మాటలకు శ్రీధర్ షాక్ అవుతాడు. బిడ్డల జీవితాల్ని కలపమని నేను చెబుతుంటే నువ్వు విడాకులు ఇప్పించమంటావా? కళ్లముందే బిడ్డల జీవితాలు నాశనం అవుతుంటే దాని కన్నా నరకం మరొకటి ఉండదని శ్రీధర్‌ ఎమోషనల్‌ అవుతాడు. కానీ తర్వాత కాంచన చెప్పినట్టే శ్రీధర్‌ చేయాలనుకుంటాడు. ఇంటికి దాస్‌ను పిలిచి కాశీ, స్వప్నల గురించి చెప్తాడు. వాళ్లిద్దరూ విడిపోవాలనుకుంటున్నారు అని చెప్పగానే.. దాసు షాక్‌ అవుతాడు. భార్యాభర్తలు విడిపోతుంటే అలా జోక్‌గా చెబుతావేంటి అంటూ దాసు తిట్టగానే..

కొడుకు గురించే నువ్వు ఇంతలా బాధపడుతుంటే నా కూతురి పరిస్థితి ఏంటీ అని శ్రీధర్‌ అనడంతో ఈరోజుల్లో కొడుకు, కూతురు సమానమే అనగానే.. అసలు ఇక్కడ విడాకుల నిర్ణయం జరిగిపోయిందని నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సంతకాలు పెట్టడమే మిగిలి ఉందని చెప్తాడు శ్రీధర్‌. అయితే దాసు మాత్రం కాశీని విడాకులకు ఒప్పుకున్నావా..? అని అడుగుతాడు. అందుకు కాశీ తాను విడాకుల గురించి అసలు మాట్లాడలేదని.. స్వప్నే అడిగిందని నన్ను ఫోర్స్‌ చేయడంతో నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్తాడు. దీంతో దాసు ఇలా వదిలేస్తే ఎలా అని శ్రీధర్‌ ను ప్రశ్నిస్తాడు. అయితే నీకో చాన్స్‌ ఇస్తాను వాళ్లను ఒప్పించమని శ్రీధర్‌, దాసుకు చెప్తాడు.

Advertisement

మరోవైపు హాస్పిటల్‌కు వెళ్లిన దీప, కార్తీక్‌లకు ఈ ఆపరేషన్‌ చేస్తే దీపకు ఇక జన్మలో పిల్లలు పుట్టే అవకాశం ఉండదని చెప్తుంది. అయినా సరే తన తల్లి కోసం దీపం సరే అంటుంది. దీప నిర్ణయానికి డాక్టర్‌ షాక్‌ అవుతుంది. ఇంతలో దశరథ వచ్చి నిజం తెలుసుకుని షాక్‌ అవుతాడు. దీప నిర్ణయానికి ఎమోషనల్‌ అవుతాడు. మరోవైపు స్వప్న ను కన్వీన్స్‌ చేయాలని చూస్తాడు దాసు. కానీ విడాకుల విషయంలో తన నిర్ణయం మార్చుకోనని స్వప్న చెప్పడంతో దాసు షాక్‌ అవుతాడు. మరోవైపు దశరథ, డాక్టర్‌ దగ్గరకు వెళ్లి దీపకు ఆపరేషన్‌ చేయడానిక వీల్లేదని తన భార్యను బతికించడం కోసం తను చేస్తున్న త్యాగం మామూలుది కాదని చెప్తాడు. అయితే ఆపరేషన్‌ చేయకపోతే సుమిత్ర బతకదని డాక్టర్‌ చెప్పగానే.. దశరథ డైలమాలో పడిపోతాడు. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×