E-Paper
Advertisement

కార్తీక దీపం 2’ మార్చి 31: దీపకు నిజం చెప్పిన కార్తీక్ 

కార్తీక దీపం 2’ మార్చి 31: దీపకు నిజం చెప్పిన కార్తీక్ 
Advertisement

Karthika Deepam 2  serial today Episode: కాంచన ఇంటికి వెళ్లిన పారిజాతం దీపను ప్రేమగా మనవరాలా..?అని పిలవగానే.. అందరూ షాక్‌ అవుతారు. కార్తీక్‌ ఏంటి కొత్త పిలుపు అంటూ అడగ్గానే.. దాస్‌ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని తనకు జ్ఞానోదయం అయింది అందుకే ఇలా మారిపోయాను అంటుంది. దీంతో కార్తీక్ ఏదో అనుమానంగా ఉందని అంటడు. నువ్వు ఏమైనా అనుకోరా నేను నా బంగారు తల్లి దీప కోసం వచ్చాను అనగానే.. అందరూ మరోసారి షాక్‌ అవుతారు. ఇంతలో శౌర్య వస్తుంది. శౌర్యను హగ్ చేసుకుని ప్రేమ చూపిస్తుంది. ఇంతలో అనసూయ కాంచనతో ఈవిడకు ఏమైంది అని అడగ్గానే.. నేను బాగానే ఉన్నాను అంటూ ఎవరెవరు తనకు ఏం కావాలో వరుసలు చెప్తుంది.

పారిజాతం మాటలకు అందరూ మరోసారి షాక్‌ అవుతారు. ఏంటి మార్పు అని కార్తీక్‌ గుచ్చి గుచ్చి అడిగినా పారిజాతం మాత్రం నిజం చెప్పదు. దీంతో కార్తీక్‌ శివనారాయణకు ఫోన్‌ చేస్తాను ఇక వెళ్లు అని బెదిరించగానే.. పారిజాతం సరే వెళ్తాను అంటూ ఎమోషనల్‌ అవుతూ.. దీప ఈసారి మనం కలిసినప్పుడు చాలా మాట్లాడుకుందాం అని చెప్పగానే.. ఈ ప్రేమలు చాలు కానీ ఇక బయలుదేరు అనగానే… ఇది జస్ట్‌ బిగినించే మనవడా అంటుంది. దీంతో కార్తీక్‌ వరుస మారింది అనగానే.. ఇంకా చాలా చూస్తావు మనవడా అంటూంది పారిజాతం.  దీపకు జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతుంది పారిజాతం.

Advertisement

పారిజాతం వెళ్లిపోయాక కాంచన ఆశ్చర్యంగా ఓరేయ్‌ పిన్నికి ఏమైందిరా అని అడగ్గానే.. కార్తీక్‌ ఆవిడ ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి తెలియదు కదా..? పిన్ని ఆకలేస్తుంది. భోజనం పెట్టు అని అడగ్గానే.. అనసూయ అలాగే కార్తీక్‌ బాబు చెల్లెమ్మా నువ్వు కూడా రా.. అని చెప్పగానే.. శౌర్య, కాంచన అనసూయ వెళ్తారు. కార్తీక్‌ వెళ్తుంటే.. దీప ఏంటి బావ ఇది అని అడగ్గానే.. నువ్వే దాసు మామయ్య కూతురువి అని మామయ్యతో అబద్దం చెప్పించాను అంటాడు. దీంతో దీప కంగారుగా నిజం తెలిస్తే అనగానే.. తెలిసినప్పుడు ఆలోచిద్దాం పద భోజనం చేద్దాం అంటూ వెళ్లిపోతాడు.

మరోవైపు జ్యోత్స్న, శివనారాయణను పిలిచి దశరథ, సుమిత్రలను ఉద్దేశించి ఈరోజు వీలునామా గురించి గొడవ జరిగింది. అంటూ ఆ గొడవ వల్ల మీకు సారీ చెప్తున్నాను అనగానే.. సుమిత్ర కోపంగా ఇంటి ఆడపిల్లను అవమానించి మాకు సారీ చెబితే సరిపోతుందా..? అంటుంది. అందుకే రేపు మన ఇంట్లో పార్టీ అరైంజ్‌ చేద్దాం.. మన కుటుంబ సభ్యులమే కాకుండా దగ్గరి బంధువులను పిలుద్దామని చెప్తుంది. పెళ్లి విషయంలో మంచిమాట చెబితే వినాలని ఉంది అంటూ సుమిత్ర చెప్పగానే.. అది కూడా రేపే చెప్తాను.. మమ్మీ నీకు రేపు ఒక శుభవార్త ఉంది అని చెప్పగానే.. ఏంటని సుమిత్ర అడిగితే నీ కూతురు చావు అని మనసులో అనుకుని  అది కూడా రేపే చెప్తాను అంటుంది.

Advertisement

తర్వాత పారిజాతం సంతోషంగా ఇంటికి రావడం చూసిన శివనారాయణ కారణం అడిగితే అబద్దం చెప్తుంది పారిజాతం. దీంతో శివనారాయణ కార్తీక్‌ పంపిన వీడియో చూపిస్తాడు. అందులో పారు, దీపను హగ్‌ చేసుకునేది ఉంటుంది. దీంతో పారు ఈ వీడియో ఎవరు పంపించారో నాకు బాగా తెలుసు అంటుండగానే.. కార్తీక్‌ వస్తాడు. అప్పుడే వచ్చిన జ్యో కూడా నీకు ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి..? అని అడగ్గానే.. నేను అదే అడగాలనుకున్నాను నువ్వే అడిగేశావు అనగానే.. పారు కోపంగా జ్యోను తిడుతుంది. కార్తీక్‌ మెచ్చుకుంటాడు. జ్యో ఇంట్లో పార్టీ ఉందని అందరూ రావాలని ముఖ్యంగా దీప రావాలని చెప్పగానే.. కార్తీక్‌ అనుమానిస్తాడు. తర్వాత జ్యోత్స్న కోపంగా పారిజాతాన్ని నిలదీయగానే.. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దీప దగ్గరకు నేను ఎన్నిసార్లైనా వెళ్తాను నీకెందుకు అంటూ కోపంగా చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు ఇంటికి వెళ్లిన కార్తీక్‌, జ్యో ఇచ్చే పార్టీ గురించి చెప్తాడు. దీంతో కాంచన ఆ పార్టీకి తను వెళ్లనని జ్యోత్స్న ప్రవర్తన మారిపోయిందని తిడుతుంది. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×