E-Paper
Advertisement

వైభవ్ తో ఎప్పటికైనా అభిషేక్ కు ప్ర‌మాద‌మే..లైట్ తీసుకుంటే గున‌పం దింపుతాడు

వైభవ్ తో ఎప్పటికైనా అభిషేక్ కు ప్ర‌మాద‌మే..లైట్ తీసుకుంటే గున‌పం దింపుతాడు
Advertisement

Sunil Gavaskar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో (Indian Premier League 2026 Tournament) భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తి కాగా.. అన్ని కూడా మంచి మజాను ఇచ్చాయి. ఇక సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( Rajasthan Royals vs Chennai Super Kings) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయ‌ల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi ) 52 పరుగులు సాధించాడు. అయితే వైభవ్ సూర్య వంశీ ఇన్నింగ్స్ పైన సునీల్ గ‌వాస్క‌ర్ ( Sunil Gavaskar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ ను లైట్ తీసుకుంటే, అభిషేక్ శర్మ స్థానం గల్లంతు అవుతుందని హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: Ball Tampering In PSL 2026 : PSL లో బాల్ టాంపరింగ్..జ‌మాన్‌, షాహీన్ షా, ర‌వూఫ్ పై బ్యాన్..? బ‌జారున ప‌డ్డ‌ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 

వైభవ్ తో ఎప్పటికైనా అభిషేక్ కు ప్ర‌మాద‌మే

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లోనే రాజస్థాన్ రాయల్స్ జట్టి తరఫున అదరగొట్టాడు 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కేవలం 15 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇందులో ఐదు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు ఉన్నాయి. 35 స్ట్రైక్ రేట్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చుక్కలు చూపించాడు వైభవ్ సూర్య వంశీ. అయితే వైభవ్ సూర్య వంశీ నిన్న చేసిన బ్యాటింగ్ విధానంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని అభిషేక్ శర్మ లైట్ తీసుకుంటే అతని స్థానం గల్లంతవుతుందని.. సైలెంట్ గా గున‌పం దింపేస్తాడని హెచ్చరించారు.

వైభవ్ కారణంగా టీమిండియాలో మొదట ఇబ్బంది పడేది అభిషేక్ శర్మ అని తెలిపారు. గిల్ వచ్చినప్పుడు శిఖర్ ధావన్ కెరీర్ ఎలా వెనక్కి వెళ్లిందో.. అభిషేక్ శర్మకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు సునీల్ గవాస్కర్. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ పైన అభిషేక్ శర్మ ఫోకస్ చేయాలన్నారు. అదే సమయంలో టీమిండియా వన్డే కెప్టెన్ గిల్, సంజు శాంసన్ లాంటి ఓపనర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. లేక‌పోతే వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌చ్చాడో, వీళ్లకు ఇబ్బందేన‌ని తెలిపారు. వైభవ్ సూర్య వంశీ ఆట తీరు చూస్తుంటే అతడు భవిష్యత్తులో క్రికెట్ ను ఏలుతాడని పేర్కొన్నారు. ఫ్యూచర్ సచిన్ టెండూల్కర్ అని కూడా వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉండ‌గా, ఇటీవ‌లే 15వ సంవ‌త్సంలోకి అడుగుపెట్టాడు వైభ‌వ్ సూర్యవంశీ. దీంతో టీమిండియాలో ఆడే ఛాన్సు ద‌క్కించుకున్నాడు.

Advertisement

Also Read: PSL Ball Tampering:  బాల్ టాంప‌రింగ్ పాకిస్తాన్ కు కొత్తేం కాదు..ఇంజమామ్ నుంచి జమాన్ వ‌ర‌కు అంద‌రూ దొంగ‌లే

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×