Podarillu : బుల్లితెర ప్రేక్షకులను సీరియస్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి సీరియల్ కూడా సరికొత్త కథతో జనాలను కనెక్ట్ ఎలా చేస్తున్నాయి. కేవలం స్టోరీ మాత్రమే కాదు.. అటు సీరియస్లలో నటించే యాక్టర్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు సినిమాలతో జనాలను ఆకట్టుకున్న టీవీ చానల్స్ ఈమధ్య సీరియల్స్ తో నువ్వా నేనా అంటూ పోటీపడి మరి ప్రసారం చేస్తున్నాయి. ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదిరిల్లు సీరియల్ మాత్రం రోజురోజుకి జనాలనుంచి మంచి రెస్పాన్స్ని దక్కించుకుంటుంది. గత ఏడాది బిగ్ బాస్ తర్వాత ప్రారంభమైన ఈ సీరియల్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది.. అయితే ఈ మధ్య ఈ సీరియల్ స్టోరీ జనాలకి తెగ నచ్చేసింది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా ఈ సీరియల్ కి ఫైనల్ స్టోరీ ఇదే అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని తెగ ఊపేస్తుంది. మరి అందుతున్న సమాచారం ప్రకారం ఆ సీరియల్స్ స్టోరీ ఫైనల్ గా ఎలా ఉండబోతుందో కాస్త వివరంగా తెలుసుకుందాం..
పొదిరిల్లు సీరియల్ లో ప్రస్తుతం మాధవ్ కి పెళ్లి చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. శైలు పెళ్లి వల్లే మాధవ్ తనకు ఇష్టం లేకపోయినా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతాడు. అమ్మాయికి అల్లుడు రెండో పెళ్లి అయినా కూడా మాధవ్ మాత్రం అసలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. పెళ్ళికొడుకు పేరెంట్స్ చక్రి వాళ్ళని ఎంతగా ఇబ్బంది పెడుతున్నా సరే మా మౌనంగా భరిస్తూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. మరి అటు మనిషా కూడా మాధవ్ నీ ప్రేమించి తన ప్రేమని తన మనసులోనే దాచుకొని బాధపడిపోతూ ఉంటుంది. అలాంటి మనీషా తన కోరికను దేవుడు నెరవేరుస్తాడా? లేదా? అన్న ఆసక్తి ఆడియన్స్ లో నెలకొంది. అయితే ఇప్పుడు ఫైనల్ గా జరగబోయే స్టోరీ విషయానికి వస్తే జయంతి తో పెళ్లి చేసుకోవడానికి మాధవ్ ఇష్టపడడు. చివరికి మనిషా ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుంటాడు. అలా వాళ్ళిద్దరికీ ముడి పడే అవకాశం ఉంది అని సోషల్ మీడియాలో వినిపిస్తున్న స్టోరీ చెబుతుంది. ఇక జయంతి నీ పెళ్లి చేసుకోకపోవడంతో తను మాధవ్ వాళ్ళ ఫ్యామిలీపై కక్ష పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అని తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా మాధవకు చక్కని జోడి మనిషా చివరికి వీళ్ళిద్దరికీ జోడి కుదురుతుంది అన్న వార్త మాత్రం ఇప్పుడు అభిమానులకు ఫుల్ జోష్ ను నింపుతుంది. ఇది ఫైనల్ గా జరిగే స్టోరీ అని తెలిసిపోతుంది..
ఇక చక్రి మహాలక్ష్మి తన భార్యగా ఎప్పుడూ చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే తన భార్య మహాలక్ష్మి తనతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు ఆ గోపిక వల్ల మహాలక్ష్మి కాక చక్రి ప్రేమలో పడిపోతుంది. ఇక చక్రి కూడా మహాలక్ష్మి నిజమైన నా ప్రేమలో పడిపోయింది అని చాలా సంతోషంగా ఉంటాడు మొత్తానికి అన్ని జంటలు కూడా కలిసిపోవడంతో ఈ సీరియల్కు శుభం కార్డు కూడా పడిపోతుంది. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది కానీ వేరే వాళ్ళు శాపాలు పెట్టె ఏది జరగదు అని ఈ సీరియల్ స్టోరీ ఫైనల్ గా చెప్తుంది.. ఇది పొదిరిలు అసలు స్టోరీ.. మరి ఈ స్టోరీ కాకుండా వేరే స్టోరీ ఏమైనా ఉంటుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది..