Manitha Baiju : ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ ప్రేమలో బ్యూటీ మమిత బైజు.. ఒక్క సినిమా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుని ఇలా చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. ఒక్క హిట్టుతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయిన వారిలో ఈ అమ్మడు కూడా ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతూ ఉంటుంది. ప్రేమలు తర్వాత ఈమె నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఒకవైపు వరుసగా సినిమాలతో బిజీగా మారుతూ.. స్టార్ హీరోయిన్లకు సవాల్ విస్తృత బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ వస్తుంది. రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈమె నిజంగానే రెమ్యూనరేషన్ పెంచిందా? లేదంటే ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు గాసిప్స అనేది తెలియాలి అంటే కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకోవాల్సిందే..
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ప్రేమలు సినిమా జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఈ అమ్మడు నటనకు మంచి మార్కులు పడ్డాయి. మొదటి సినిమాతోనే మొదటి క్రేజ్ తోనే ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈమెకు మొదటి సినిమా నుంచి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు కూడా వచ్చి పడడంతో మంచి క్రేజ్ పెరిగింది. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఆమె ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు పడడంతో రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె ఇటీవల మూడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునేదని తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ రెమ్యూనిరేషన్ కాస్త భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఒక్క సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు ఈమె డిమాండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హైలైట్ అవుతున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియలేదు కానీ ప్రస్తుతం ఈమె రేంజ్ మాత్రం బాగా పెరిగింది అందుకే రెమినరేషన్ కూడా పెంచేసింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి..
ఒక్క సినిమా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అన్న నిజాన్ని కొంతమంది హీరోయిన్ల జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. కేవలం ఒకే ఒక్క సినిమాతో మంచి క్రేజ్ ను అందుకున్న హీరోయిన్లు ఎంతోమంది ఇప్పుడు కనిపిస్తుంటారు. మమిత బైజు కూడా అలానే ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. రామం రామణి’ అనే మలయాళ చిత్రంతో ఒక చిన్న నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ప్రేమలు మూవీతో మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. ఒక్క ఏడాదిలోనే మూడు 200 కోట్ల సినిమాలను తన ఖాతాలో పడ్డాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక నాలుగు భారీ ప్రాజెక్ట్ లో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే సినిమాలు గురించి అనౌన్స్ చెయ్యనున్నట్లు సమాచారం..