Eshwar Sai:ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల వ్యవహారానికి ఇప్పుడప్పుడే ఎండ్ కార్డ్ పడేలా లేదు.ఈశ్వర్ సాయి పై మాధురి రాథోడ్ SC/ST అట్రాసిటీ కేసు పెట్టగా తాజాగా ఈ కేసులో ఈశ్వర్ సాయికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది.
ఇక జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే అని భయపడుతున్న ఈశ్వర్ సాయికి ఇదొక పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. దీంతో చాలా మంది ఇక అంటూ ఈశ్వర్ సాయిది ఏం తప్పు లేనట్టేనా ?ఈశ్వర్ సాయి ఈ కేసు నుండి బయటపడ్డట్టేనా ? అంటూ డిబేట్లు పెట్టేస్తున్నారు.
కానీ అసలు విషయం ఏంటంటే కోర్టు కేవలం బెయిల్ మాత్రమే ఇచ్చింది తప్ప కేసు కొట్టెయ్యలేదు.సో దీని బట్టి చూస్తే ఈశ్వర్ సాయి మెడకి ఈ కేసు ఇంకా చుట్టుకునే ఉంది.పైగా ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు కాబట్టి వారి ప్రశ్నలని కూడా ఈశ్వర్ సాయి ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇక తాజాగా ఈశ్వర్ సాయికి బెయిల్ రావడంతో ఇపుడు అందరి దృష్టి మాధురి రాథోడ్ పైనే ఉంది. ఈ తీర్పు తర్వాత మాధురి ఎలా రియాక్ట్ అవుతుంది, కేసులో తనని నెగ్గించుకోవడానికి ఇంకేమైనా బలమైన ఆధారాలు బయట పెడుతుందా అంటూ డిబేట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.
అయితే ఎలా చూసుకున్న ముందుగా మాధురి రాథోడ్ ఇక్కడ కార్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈశ్వర్ సాయికి అంతకు ముందే పెళ్ళయిన సంగతి తెల్సి కూడా రిలేషన్ పెట్టుకోవడమే ఆమె చేసిన తప్పు అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.పైగా మా మధ్య రిలేషన్ చాలా బాగుంది,కేవలం నా భర్తని లొంగదీసుకుంది తనే,మొత్తం తనదే తప్పు అంటూ ఈశ్వర్ సాయి భార్య మీడియా ముందు వాదిస్తుంది కూడా.
ఇక కోర్టులో కూడా ఈశ్వర్ సాయి అడ్వకేట్ నాగూర్ బాబు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఈశ్వర్ సాయికి ఇప్పటికే పెళ్ళయిందని,అది తెల్సి కూడా మాధురి రాథోడ్ తన సంబంధం కొనసాగించిందని వివరించారు.పైగా కేసులోని ఆరోపణలు, వాటి వెనుక ఉన్న పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లాలని నాగూర్ బాబు కోర్టుకు వివరించారు. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని చెప్పిన విషయాన్ని మాధురి రాథోడ్ ఎవిడెన్స్ తో సహా ప్రూవ్ చేయగలగాలి,అప్పుడే ఈ కేసుకి ఏమైనా బలం చేకూరుతుందేమో.
ఏది ఏమైనా పెళ్లి చేసుకుంటాడు అన్న ఆశతో మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయికి దగ్గరైంది కావొచ్చు,కానీ తనకి అప్పటికే పెళ్లి అయింది అన్న విషయం గుర్తు పెట్టుకుని తన జాగ్రత్తలో తను ఉంటే బాగుండు.ఇలా రచ్చకెక్కాక ఇపుడు బోరున విలపిస్తే చూసే వారి నుండి పెద్దగా సానుభూతి రాదని మాధురి గ్రహిస్తే మంచిది.