Udayabhanu: ఉదయభాను ఈ పేరు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు తెలంగాణ ఆడబిడ్డగా ఈమె సినిమా ఇండస్ట్రీలో యాంకర్ గా, నటిగా నిర్మాతగా కొనసాగుతూ ఉన్నారు. ఒకానొక సమయంలో బుల్లితెరపై ఏదైనా ఒక కార్యక్రమం ప్రసారం అవుతుంది అంటే కచ్చితంగా ఆ కార్యక్రమానికి యాంకర్ గా ఉదయభాను ఉండేవారు. ఇండస్ట్రీకి కొత్తవారు వస్తున్న నేపథ్యంలో ఉదయభానుకు అవకాశాలు కూడా క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. మరోవైపు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్న ఈమె ఇటీవల ఉదయభాను(Udayabhanu) ప్రొడక్షన్ హౌస్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
నిర్మాణ సంస్థలో పంచనామా(Panchanamaa) అనే వెబ్ సిరీస్ నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 11వ తేదీ (నేటి)నుంచి జీ ఫైవ్ లో స్టీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఉదయభాను ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కెరియర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను తెలంగాణ బిడ్డ అయినప్పటికీ కెరియర్ పరంగా నాకు ఎలాంటి ప్రయోజనాలు కలగలేదని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు నాకు కెరియర్ పరంగా ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వచ్చాయి.
బుల్లితెరపై ఎలాంటి కార్యక్రమాలు ప్రసారమైన యాంకర్ గా తానే చేశానని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు అయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ(Telangana) విడిపోయాయో అప్పటినుంచి తనకు కూడా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత స్థానిక నటిగా నాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా నన్ను గుర్తించి నాకు అవకాశం కల్పించకపోవడం బాధాకరం అంటూ ఈమె తెలిపారు. నేను తెలంగాణ బిడ్డగా పుట్టడం వల్ల ప్రయోజనాలు సున్నా కేవలం ప్రతిభ ఆధారంగా తనని తాను ఇండస్ట్రీలో నిలబెట్టుకుంటున్నానని ఉదయభాను తెలిపారు.
ఇక సినిమాల పరంగా తనుకు ఎన్నో సినిమాలలో అవకాశాలు వచ్చాయి కానీ కథ నాకు నచ్చని నేపథ్యంలో వదులుకున్నాను అని తెలిపారు. ఇక తనకు సినిమాలలో నటించే విషయంలో కొన్ని హద్దులు ఉన్నాయని హద్దులు దాటి నటించడానికి తాను ఇష్టపడనని అందుకే అవకాశాలు కూడా కోల్పోతున్నానని తెలిపారు. ఇక ప్రస్తుతం నిర్మాతగా మారడంతో నిర్మాణ రంగానికి అధికం ప్రాధాన్యత కల్పిస్తాను, కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ కొత్తవారికి అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. అయితే నటనకు మాత్రం తాను గుడ్ బై చెప్పడం లేదని మంచి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో అవకాశాలు వస్తే కచ్చితంగా నటిస్తానని ఉదయభాను ఈ సందర్భంగా తెలియజేశారు.
Also Read: ఆ క్షణం జీవితాన్ని కోల్పోయినట్టు అనిపించింది: సమంత