Big Tv Kissik Talks: నటరాజ్ మాస్టర్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన ఎన్నో డాన్స్ షోలలోపెద్ద ఎత్తున సందడి చేస్తూ వచ్చారు. పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేసిన నటరాజ్ మాస్టర్(Nataraj Master) తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big Tv Kissik Talks) కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు .ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా నటరాజ్ మాస్టర్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు గురించి తనకు జరిగిన వెన్నుపోట్ల గురించి అలాగే తన కుటుంబం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను ఇండస్ట్రీకి హీరో అవ్వడం కోసం వచ్చాను కానీ బ్రతుకుతెరువు కోసం కొరియోగ్రాఫర్ గా మారాల్సి వచ్చిందని తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటిలో కనీసం తినడానికి తిండి కూడా ఉండేది కాదని తెలిపారు. దాదాపు వారం రోజులపాటు తిండి లేకుండా నీళ్లు తాగుతూ, వాటర్ ట్యాంక్ కింద పడుకున్నాను అంటూ ఈయన అనుభవించిన కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈయన కష్టాలు విన్న వర్ష సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.
కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని, హీరో అవ్వాల్సిన తాను బ్రతకడం కోసమే డాన్స్ నేర్చుకుంటూ కొరియోగ్రాఫర్ గా మారిపోయానని తెలియచేశారు. ఇక ప్రస్తుతం పలు డాన్స్ షోలలో పాల్గొంటూ సందడి చేస్తున్న నటరాజ్ మాస్టర్ మరొక కొరియోగ్రఫీ నీతూను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈయన తన భార్య బిడ్డతో చాలా సంతోషంగా గడుపుతున్నారు. నటరాజ్ మాస్టర్ ప్రస్తుతం ఎలాంటి షోలు చేయలేదని తెలిపారు. ఇటీవల ఒక షోలో పాల్గొన్నానని ఆ తర్వాత డిప్రెషన్ కారణంగా నాలుగు నెలలపాటు బయటకు కూడా రాలేదని ఈయన తెలిపారు.
గతంలో ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. రెండుసార్లు ఈయన ఈ రియాలిటీ షోలో పాల్గొని సందడి చేశారు. అదేవిధంగా పలు డాన్స్ షోలకు జడ్జిగా కూడా కొనసాగారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటరాజ్ మాస్టర్ ఇంకా ఎలాంటి విషయాలు గురించి మాట్లాడారు అనే పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారమవుతుంది.
Also Read: వెన్నులో వణుకు పుట్టిస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’ మూవీ ట్రైలర్