E-Paper
Advertisement

నటరాజ్ మాస్టర్ ను వెన్నుపోటు పొడిచిన లేడీ ఆర్టిస్ట్..శారీ వేసుకొని మోసం చేస్తుందంటూ!

నటరాజ్ మాస్టర్ ను వెన్నుపోటు పొడిచిన లేడీ ఆర్టిస్ట్..శారీ వేసుకొని మోసం చేస్తుందంటూ!
Advertisement

Big Tv Kissik Talks: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన వారిలో కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్(Nataraj Master) ఒకరు. ఇప్పటివరకు సినిమాలకు కొరియోగ్రఫీ చేయకపోయినప్పటికీ పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేశారు . పలు డాన్స్ షోలకు జడ్జిగా కొనసాగారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్న నటరాజ్ మాస్టర్ తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన స్నేహితులు తన బాగా నమ్మినవారు మోసం చేయడం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

పెట్రోలుకు కూడా డబ్బులు లేని పరిస్థితి…

ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు మగవారు మాతో చాలా బాగా క్లోజ్ గా ఉండేవారు. మాతో ఉన్నంతసేపు ఒక రూపాయి కూడా బయటకు తీసి ఖర్చు పెట్టలేదు. వారి ఖర్చులను నేనే చూసుకున్నాను. నేను సర్వస్వం మొత్తం కోల్పోయాను. బయటకు వెళ్లడానికి బండి వేసుకుని వెళ్తే ఒకవేళ ఆగిపోతే ఏం చేయాలి? అనే ఆలోచన చేసేవాడిని కనీసం పెట్రోల్ కు కూడా డబ్బులు లేని పరిస్థితికి నన్ను వాళ్ళు తీసుకువచ్చారని నటరాజ్ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

పక్కా ఆధారాలతో నిరూపిస్తా..

Advertisement

ముఖ్యంగా వీరిలో ఒక అమ్మాయి ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్ట్ తనని బాగా నమ్మించి మోసం చేసిందని ఆమె ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నారని నటరాజ్ మాస్టర్ తెలిపారు. చాలా మంచి దాన్ని అని, లంగా వోణీలు వేసుకొని, శారీలు కట్టుకొని అందరిని బాగా మోసం చేస్తుందని తెలిపారు. ఆమెను ఉద్దేశించి నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ నన్ను చాలా మోసం చేసావు కదా ఒకరోజు వస్తుంది ఎందుకు నేను మోసం చేశానా అని ఫీల్ అయ్యేలాగా నేను చేస్తా .. ఆధారాలతో సహా నువ్వేంటో జనాలందరికీ చూపిస్తాను అంటూ నటరాజ్ మాస్టర్ సదరు లేడి ఆర్టిస్టుకు ఈ కార్యక్రమం ద్వారా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం నటరాజ్ మాస్టర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇక ఈ కామెంట్స్ విను అభిమానులు ప్రేక్షకులు నటరాజ్ మాస్టర్ ను మోసం చేసిన ఆ లేడీ ఆర్టిస్ట్ ఎవరు? అంత పద్ధతిగా ఉంటూ ఈయనని వెన్నుపోటు పొడిచిన ఆమె ఎవరు ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. మరి ఆమె ఎవరు అనేది తెలియాలి అంటే నటరాజ్ మాస్టర్ తన గురించి ఆధారాలతో బయటపెట్టేవరకు ఎదురుచూడాల్సిందే. ఈ కార్యక్రమంలో భాగంగా నటరాజ్ మాస్టర్ తన కెరీయర్ లో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి అదే విధంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి, అగ్ని పరీక్ష షో గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.నటరాజ్ మాస్టర్ కూడా ఇదివరకే రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే.

Also Read: సందీప్ మాస్టర్ కి కొరియోగ్రఫీ రాదా..నటరాజ్ మాస్టర్  షాకింగ్ కామెంట్స్ !

Related News

ఈశ్వర్ సాయికి బెయిల్.. ఇక తప్పించుకున్నట్టేనా?

సందీప్ మాస్టర్ కి కొరియోగ్రఫీ రాదా..నటరాజ్ మాస్టర్  షాకింగ్ కామెంట్స్ !

తిండి లేదు, నీళ్లు తాగి బ్రతికాను.. కన్నీళ్లు తెప్పిస్తున్న నటరాజ్ మాస్టర్ కష్టాలు!

తెలంగాణ బిడ్డగా పుట్టిన ప్రయోజనాలు సున్నా: ఉదయభాను

రామ్ ప్రసాద్ కోసం స్టార్ యాంకర్ ఎంట్రీ?

బిగ్ బాస్ 10 నుండి తొలి లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్.. మొదటి వారంలోనే ఇద్దరా?

యూట్యూబర్ నందనకు బిగ్ బాస్ క్రేజీ ఆఫర్.. రెమ్యూనరేషన్ ఎంతంటే ?

Big Stories

Advertisement
×