E-Paper
Advertisement

సందీప్ మాస్టర్ కి కొరియోగ్రఫీ రాదా..నటరాజ్ మాస్టర్  షాకింగ్ కామెంట్స్ !

సందీప్ మాస్టర్ కి కొరియోగ్రఫీ రాదా..నటరాజ్ మాస్టర్  షాకింగ్ కామెంట్స్ !
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. జబర్దస్త్ వర్ష (Varsha)యాంకర్ గా కొనసాగుతున్న ఈ కార్యక్రమం మంచి ఆదరణను సొంతం చేసుకుంటుంది. ప్రతి వారం సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వారి వృత్తిపరమైన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులకు ఎన్నో తెలియని విషయాలను తెలియచేస్తున్నారు. ఇక ఈ వారంలో ఈ కార్యక్రమానికి ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ (Nataraj Master)హాజరయ్యారు.

సందీప్ మాస్టర్ కు కొరియోగ్రఫీ రాదా..

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా నటరాజ్ మాస్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. యాంకర్ వర్ష ఆట సందీప్ మాస్టర్ (Sandeep Master)గురించి ఆయన సక్సెస్ గురించి ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నకు నటరాజ్ మాస్టర్ సమాధానం చెబుతూ సందీప్ మాస్టర్ కొరియోగ్రఫర్ గా ఒక షోలో పాల్గొన్నప్పుడు నేను ఆ షోకి జడ్జిగా ఉన్నానని తెలిపారు. సందీప్ మాస్టారుకు కొరియోగ్రఫీ రాదని నటరాజ్ మాస్టర్ మాట్లాడారు అయితే ఆయన ఏం మాట్లాడారు అనే విషయాలను మాత్రం మ్యూట్ చేశారు.

కావాలని నెగిటివ్ కామెంట్స్..

Advertisement

సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీ గురించి నటరాజ్ మాస్టర్ ఏం మాట్లాడారు అనే విషయాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారమవుతుంది. ఇటీవల సందీప్ మాస్టర్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ అద్భుతమైన కొరియోగ్రఫీ అందిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన డాన్స్ కొరియోగ్రఫీపై కొంతమంది కావాలనే విమర్శలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ మాస్టర్ కు కొరియోగ్రఫీ రాదని తనకంటే మేమే బాగచేస్తాం అంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ అంశం గురించి నటరాజ్ మాస్టర్ మాట్లాడారని తెలుస్తోంది.

Advertisement

ఆట షో ద్వారా మంచి సక్సెస్ అందుకున్న సందీప్ మాస్టర్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశాన్ని అందుకొని బాస్ చేత హుక్ స్టెప్స్ వేయిస్తూ పాపులర్ అయ్యారు. ఇక తాజాగా నాని చేత ఏష నాగుల కట్ట అంటూ మరో పాట ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ పాట కూడా చాలా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇలా ఈ పాట మంచి సక్సెస్ అయినప్పటికీ సందీప్ మాస్టర్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే నటరాజ్ మాస్టర్ ఘాటుగా స్పందించారని తెలుస్తోంది. మరి నటరాజ్ మాస్టర్ ఏం మాట్లాడారు అనేది తెలియాలి అంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే .

Also Read: తిండి లేదు నీళ్లు తాగి బ్రతికాను.. కన్నీళ్లు తెప్పిస్తున్న నటరాజ్ మాస్టర్ కష్టాలు!

Related News

ఢీ విన్నర్ రాజు అరెస్ట్.. పెళ్లి పేరుతో పదేళ్లు ఇదేం కథ!

ఎంగిలి గ్లాస్ లు కడిగిన నాగార్జున… రోహిత్ పై ఫుల్ ఫైర్.. త్రిగుణ్ కు గుణమే లేదంటూ!

సనాతన ధర్మ పరిరక్షకులంటూ..పవన్ గరికపాటి పై అన్వేష్ ఫైర్!

వార్తా ప్రపంచం మారిపోయిందండోయ్.. 80ల్లో అలా, ఇప్పుడేమో ఇలా!

సెలబ్రిటీలకు మద్దతు తెలిపిన మాజీ కంటెస్టెంట్.. కామనర్స్ అంటే అంత చులకనా?

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా సుప్రీత.. ఏమన్నారంటే?

సీక్రెట్ రూమ్ లో చరణ్, చైత్ర? కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్!

ఢీ10 షో విన్నర్ రాజు అరెస్ట్?

Big Stories

Advertisement
×