Masti Mahidhar Shocking Comments on Jabardasth: జబర్దస్త్ షో ఎంతోమంది సామాన్యులను సెలబ్రిటీలను చేసింది. ధనరాజ్, కిర్రాక్ ఆర్పీ, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, ముక్కు అవినాష్ తో ఎంతో మందికి మంచి పాపులారిటీ తెచ్చిపింది. బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిన ఈ పాపులర్ కామెడీ షో తరచూ ఏదోక వివాదంలో నిలుస్తుంది. ఏకంగా ఈ షో జడ్జే.. విమర్శలు గుప్పించారు. ఈ షో జడ్జీగా తప్పుకున్న నాగబాబు బయటకు వచ్చాక నిర్వాహకులు, కంటెస్టెంట్స్ని విమర్శించారు. ఆ తర్వాత వేణు, ధనరాజ్, కిర్రాక్ ఆర్పీ ఇలా చాలామంది కమెడియన్స్ కూడా వివాదంతోనే బయటకు వచ్చారు. ఈ షోకి చెందిన వారే జబర్దస్త్పై విమర్శలు చేయడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేపింది.
తాజాగా మరో కంటెస్టేంట్ జబర్దస్త్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. ఓ సారి షో నిర్వాహకులు తనని దారుణంగా అవమానపరిచారని, జబర్దస్త్లో కుల పిచ్చి ఎక్కువ అంటూ మస్తి మహిధర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జబర్దస్త్లో తనదైన కామెడీతో మెప్పించిన మస్తీ మహిధర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కామెడీ పంచ్లు, డైలాగ్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత షో నుంచి బయటకు వచ్చిన అతడు యూట్యూబర్గా మారాడు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని ద్వారా.. బిగ్ బాస్ షో రివ్యూలు, సినిమాలు రివ్యూలు ఇస్తూ ఫేమస్ అయ్యాడు. అతడి రివ్యూలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్లోనూ భారీ వ్యూస్ వస్తున్నాయి. అయితే తాజాగా అతడు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఓ షాకింగ్ నిజం బయటపెట్టాడు.
‘ఆ రోజు నా లాస్ట్ డే. అప్పుడు చంటన్న, నూకరాజు మేమంత కలిసి తింటున్నాం. చివరి రోజు అని నేనే ఫుడ్ ఆర్డర్ పెట్టాను. తింటున్నప్పుడే.. ఎక్స్క్యూటివ్ రాజు గారు వచ్చి.. నువ్వు ఇక్కడ ఉండోద్దు వెళ్లిపో.. మళ్లీ రావద్దు అని దారుణంగా అవమానించారు. నేనేం చేశా అని నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయన ఎందుకలా అన్నారో అర్థమైంది. నేను జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చాక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఓ షో చేశాను. ‘Q and A About Shows పేరుతో జెమిని, జీ తెలుగు వంటి ఛానల్లో వచ్చే షో గురించిన ఫ్యాక్ట్స్ చెప్పాను. అలా యాంకర్ సుమగారి క్యాష్ షో గురించి కూడా చెప్పాను. అందులో పై నుంచి కింద పడే ప్రాపర్టీస్ నిజమైనవా? డమ్మివా అని అడిగారు. అవన్ని డమ్మి.. అని గెలిచిన వారికి రియల్వి ఇస్తారని చెప్పాను.
కానీ క్యాష్లో రియల్ ప్రాపర్టీస్ లాంటివి ఏం ఇవ్వరు.. రెమ్యునరేషన్గానే ఇస్తారు. ఓంకార్.. 6th సెన్స్ షోలో తప్ప ఎందులోనూ ప్రాపర్టీస్ ఇవ్వరు‘ అని చెప్పాను. నేను అలా చెప్పడం వాళ్లకు నచ్చలేదని.. ఆ రోజు నన్ను అలా అన్నారట. అలా చెప్పినందుకే నన్ను రావద్దని అవమానించారని తెలిసింది” అని చెప్పాడు. షో లూప్ హోల్స్ బయటపెట్టడం కరెక్ట్ కాదు కదా అనగా.. అందులో అంతగా ఏముంది.. జబర్దస్త్ లో అసలేం జరుగుతుందనే నిజాలు చెప్పలేదు కదా. అక్కడ జరిగే రాజకీయాలు, కుల పిచ్చి గురించి చెబితే తప్పు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు మహిధర్. ‘ఒక మనిషిని పాయింట్ అవుట్ చేసిన అక్కడ ఉండేవాళ్లకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. అందుకే ఈ పని చేశాడని చెప్పిన కూడా.. అక్కడ ఏం జరగదు. ఎలాగు దొరికిపోయాం కదా.. ఇంకో పదిమందిని తన క్యాస్ట్ వాళ్లని తెచ్చుకుంటాడు కానీ, అయ్యే దొరికిపోయాం అని మారిపోడు. అక్కడ క్యాస్ట్ ఫీలింగే కాదు.. ఇంకే ఎన్నో విషయాల్లో రాజకీయాలు జరుతుంటాయి‘ అని చెప్పుకొచ్చాడు.