BigTV English

Weather News: మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, పిడుగులు పడే ఛాన్స్

Weather News: మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, పిడుగులు పడే ఛాన్స్

Weather News: గడిచిన నెలలో భారీ వర్షాలు దంచికొట్టాయి. ఓ వారం రోజుల గ్యాప్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం ఛాన్స్ ఉందని చెప్పారు. అలాగే కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉందని అన్నారు. నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని చెప్పారు.

మరి కాసేపట్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంట సేపట్లో అనకాపల్లి జిల్లా లోని కొన్ని ప్రాంతాలు (నర్సీపట్నం వైపు), శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల వీచే అవకాశం ఉందని చెప్పింది. సాయంత్రం వేళ, వైజాగ్ పరిసర ప్రాంతాల వంటి తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.


బంగాళాఖాతంలో ఈ నెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇది ఏపీ, ఒడిశా, తెలంగాణ వైపు కదులుతుందని తెలిపారు. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించారు. శ్రీశైలం జలాశయానికి వరద రావడంతో.. ఒక గేటును ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,22,900 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి 1,23,642 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

ALSO READ: KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కవితను అందుకోసమే సస్పెండ్ చేశాం..

Related News

Kavitha: కవిత ఔట్.. బీఆర్ఎస్ సేఫ్.. ప్లాన్ అదుర్స్!

CM Revanth: మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక ఘట్టం.. హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీరు తరలించాలని నిర్ణయం!

KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కవితను అందుకోసమే సస్పెండ్ చేశాం..

Dussehra holidays: తెలంగాణలో దసరా సెలవు.. విద్యార్థులు ఫుల్ ఎంజాయ్, టూర్ ప్లానింగ్

T Fiber Net: తెలంగాణలో టీ-ఫైబర్‌.. దసరాకు మిస్సయితే, కార్తీకమాసం ఖాయం?

Big Stories

×