BigTV English

NDA Cheap Tricks: ఆహా.. బీహార్ అంటే కేంద్రానికి ఎంత ప్రేమ.. ఇవేం చీప్ ట్రిక్స్?

NDA Cheap Tricks: ఆహా.. బీహార్ అంటే కేంద్రానికి ఎంత ప్రేమ.. ఇవేం చీప్ ట్రిక్స్?

దేశంలో అన్ని రాష్ట్రాలు సమానం, కానీ బీహార్ కాస్త ఎక్కువ సమానం. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ ప్రవర్తన ఇలాగే ఉంది. జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చింది ప్రజలపై ప్రేమతో కాదనే విషయం అందరికీ తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇంటా బయటా ఎన్డీఏ ప్రభుత్వానికి సెగ తగులుతోంది. ఓట్ చోరీ వ్యవహారంతో కాంగ్రెస్ నేరుగా ప్రధాని మోదీనే టార్గెట్ చేసింది. ఆపరేషన్ సిందూర్ తో అనుకున్నంత మైలేజీ రాకపోగా, అమెరికా 50శాతం సుంకాలతో మరింతగా పరువుపోయినట్టయింది. ఈ దశలో అర్జంట్ గా పరువు కాపాడుకోడానికి ఏం చేయాలని ఆలోచించి, పరిశోధించి జీఎస్టీ పాచిక వేసింది కేంద్రం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇది తమకు మరింత బాగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది.


బీహార్ పై అతి ప్రేమ..
జీఎస్టీ తగ్గింపు దేశమంతటికీ వర్తిస్తుంది కదా, మరి బీహార్ పై అతిప్రేమ అనే ఆరోపణలు ఎందుకు అని ఎన్డీఏ లాజిక్ తీయొచ్చు. కానీ బీడీ వ్యవహారంలో మోడీ అడ్డంగా దొరికిపోయారు. తాజా జీఎస్టీ సంస్కరణల్లో పొగాకు, గుట్కా, పాన్ మసాలాలపై 28శాతంగా ఉన్న సుంకాలను 40శాతానికి పెంచింది. అయితే ఇక్కడే కేంద్రం ఓ మేజిక్ చేసింది. బీడీలను పొగాకు ఉత్పత్తుల్లో కలపలేదు. బైగా బీడీలకు జీఎస్టీలో మినహాయింపులివ్వడం ఇక్కడ విశేషం. బీడీలపై ఉన్న జీఎస్టీని 28శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అంటే జీఎస్టీ తగ్గింపుల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలకోసం బరితెగించని స్పష్టమైపోయింది. “బీహార్ లో బీడీ కార్మికులు ఎక్కువ, జీఎస్టీ పెంచితే వారి జీవనాధారంపై ప్రభావం పడుతుంది, వారంతా ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగ ఓట్లు వేయడం ఖాయం..”. ఈ అనుమానాలు బలంగా ఉన్నాయి కాబట్టే బీడీలపై జీఎస్టీని తగ్గించి బీహార్ ప్రజల మనసు దోచుకోడానికి చీప్ ట్రిక్స్ ప్లే చేసింది కేంద్రం.

పెద్ద ప్లానింగే..
బీహార్ ఒక్కటే కాదు, ఏ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నా.. ఆ రాష్ట్రంపై అమితమైన ప్రేమ చూపిస్తుంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. వెస్ట్ బెంగాల్, ఒడిశా ఎన్నికల సమయంలో కూడా ఆయా రాష్ట్రాలకు అడక్కుండానే వరాలిచ్చింది. ఇప్పుడు కూడా బీహార్ ఎన్నికల విషయంలో ఏడాది ముందుగానే తన ప్రణాళిక అమలు చేయడం మొదలు పెట్టింది. వరుసగా రెండు బడ్జెట్ లలో బీహార్ కి అడక్కుండానే పలు ప్రాజెక్ట్ లు కేటాయించింది. బెస్ట్ టూరిజం ప్రాజెక్ట్ లు ఇచ్చింది. వరద నివారణకోసం వేల కోట్ల రూపాయలతో అత్యవసర నిధి అందించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేసే జీఎస్టీ సవరణల్లో కూడా బీహార్ పై ప్రత్యేక ప్రేమ కురిపించడం ఇక్కడ మరో విశేషం.


డోంట్ కేర్..
ప్రతిపక్షాల విమర్శలను కేంద్రం లెక్కపెట్టే స్థితిలో అస్సలు లేదు. ఒకవేళ బీహార్ కి ఎందుకీ ప్రత్యేక గుర్తింపు అని అడిగితే.. బీహార్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ గుడ్డకాల్చి మొహాన వేస్తుంది. బీహార్ ఎన్నికల వేళ ఆ వ్యతిరేకత తమకి ఎందుకంటూ ప్రతిపక్షాలు కూడా సైలెంట్ అవుతున్నాయి. ఇలాంటి అడ్వాంటేజ్ ఉంది కాబట్టే కేంద్రం తన ప్లాన్ అమలు చేస్తోంది. బీహార్ ఎన్నికల వేళ ఆ రాష్ట్రం నుంచి కేంద్రానికి మద్దతిస్తున్న జేడీయూని ప్రసన్నం చేసుకోడానికి, అదే సమయంలో ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ప్రాతినిధ్యం పెంచుకోడానికి కేంద్రం ఎత్తుగడలు వేస్తోంది.

Related News

Amruta Fadnavis: బీచ్‌‌ను శుభ్రం చేసిన సీఎం భార్య.. ఆమె డ్రెస్ చూసి నోరెళ్లబెట్టిన జనం

Drugs Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

Century Old Tractor: అద్భుతమైన ఇంజనీరింగ్.. వందేళ్ల నాటి ట్రాక్టర్, ఎక్కడంటే..

Mumbai fire accident: ముంబైలో హై రైజ్‌లో మంటలు.. 23 అంతస్తుల భవనంలో ప్రమాదం.. ఒకరి మృతి!

Gujarat Tragedy: మహాకాళి ఆలయ మార్గంలో ప్రమాదం.. సాంకేతిక లోపమా?

Big Stories

×