BigTV English

Nindu Noorella Saavasam Serial Today November 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ :  మనోహరికి మిస్సమ్మ వార్నింగ్‌  –  ఆరు స్పర్శను తెలుసుకున్న అమర్‌

Nindu Noorella Saavasam Serial Today November 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ :  మనోహరికి మిస్సమ్మ వార్నింగ్‌  –  ఆరు స్పర్శను తెలుసుకున్న అమర్‌

Nindu Noorella Saavasam Serial Today Episode :  తనరూంలో కూర్చున్న మనోహరి కోపంగా ఘోరను తిట్టుకుంటూ.. ఆరును బంధించడం కాదు మిస్సమ్మను ఇంట్లోంచి వెల్లగొట్టేలా ప్లాన్‌ చేయాలి అనుకుంటుండగానే వెనక నుంచి ఎవరో డోర్‌ తెరిచిన  సౌండ్ విని.. ఆరు వచ్చిందని మనోహరి భయపడిపోతుంది.  ఏయ్‌ నేను నిన్ను ఏమీ అనలేదు.  నా దగ్గరకు రావొద్దు అంటుంది. వెనక నుంచి ఎవరో వచ్చి భుజం మీద చేయి వేయగానే భయంతో వణికిపోతుంది మనోహరి. ఇంతలో ఎందుకు మనోహరి అంత భయపడుతున్నావు అంటూ మిస్సమ్మ అడుగుతుంది. మిస్సమ్మ  వాయిస్‌ విన్న మనోహరి రిలాక్స్‌ గా ఊపిరి పీల్చుకుంటుంది.


చూడు మను సాటి ఆడపిల్లగా నీకొక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. నీది కాని దానికోసం యుద్దం చేయడం వృథా. మనిషి ఏం చేసినా.. ఎంత సాధించినా దాన్ని పంచుకోవడానికి ఎవరూ లేకపోతే ఆ గెలుపుకు విలువ ఉండదు. నువ్వు చేసే యుద్దంలో గెలుసు నీదే అయితే నువ్వు అందరినీ కోల్పోతావు. నా మాట విని ఇదంతా ఇంతటితో ఆపేసి.. ఎక్కడికైనా దూరంలో వెళ్లిపో అంటూ హితబోధ చేస్తుంది మిస్సమ్మ. మిస్సమ్మ మాటలకు కోపంగా మనోహరి.. ఏయ్‌ ఏంటి పిచ్చి కానీ పట్టిందా..? నీకు.. తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు.

నేను నీ గురించి సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి నువ్వు ఇంకా ఇంట్లో ఉంటున్నావు. అదే నేను తలుచుకుంటే.. అంటూ ఏదో వార్నింగ్‌ ఇవ్వబోతుంటే.. అయితే తలుచుకో.. నాకూ చూడాలని ఉంది.  నువ్వు తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలియదు కానీ నేను తలుచుకుంటే ఎం జరుగుతుదో తెలుసా..? పదే పది నిమిషాల్లో నిన్ను ఇంట్లోంచి పంపించేస్తాను. చూడు మను అక్క చావుకు నువ్వే కారణం అని అనుమానంగా ఉంది. అది నిజం అని చిన్న సాక్ష్యం దొరికినా.. నిన్ను వదిలిపెట్టను. నా సహనానికి పరీక్ష పెట్టాలని చూస్తే నేను తీసుకోబోయే నిర్ణయంతో నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది అని వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో అసలు నా రూంలోకి ఎందుకు వచ్చావే అని మనోహరి అడగ్గానే కాలు ప్రాక్చర్‌ అయింది కదా.. టీ ఇద్దామని వచ్చానని చెప్పి టీ ఇచ్చి వెళ్లిపోతుంది మిస్సమ్మ.


తన కోసం వెతుకుతున్న యముడ, గుప్తలకు తాను దొరకకూడదని అమర్‌ పక్కన దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటుంది ఆరు. అమర్‌ మీద చేయి వేయడంతో అమర్‌ కు స్పర్శ తెలుస్తుంది. ఆరు బతికి ఉన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేసుకుని ఆరు బతికే ఉందన్న భ్రమతో ఇంకా నిద్ర లేవలేదా..? మేడం అని అడుగుతాడు. దీంతో ఆరు ఇవాళ ఆదివారం కదా సార్‌ అందుకే ఇంకా పడుకున్నాను అని చెప్తుంది. ఆరు మాటలు వినపడని అమర్‌ త్వరగా లేవు అంటూ కళ్లు తెరిచి చూస్తే తన పక్కన ఎవ్వరూ కనిపించరు. దీంతో అమర్‌ ఉలిక్కిపడతాడు. ఇంతలో కాఫీ తీసుకుని వచ్చిన మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది.

ఎవరో చేయి వేసినట్టు అనిపించింది అని అమర్‌ చెప్పగానే నేను లేకున్నా ఉన్నట్టు కలగంటున్నారా..? అంటూ మిస్సమ్మ అడగ్గానే అమర్‌ కోపంగా మిస్సమ్మను తిడతాడు. నువ్వు నా పక్కను దూరి మళ్లీ తల తిక్క వేషాలేస్తున్నావా? అని ప్రశ్నిస్తాడు. కింది నుంచి కాఫీ తీసుకొస్తున్న నేను నీ పక్కన ఉండటమేంటి అని ఎదురు ప్రశ్నిస్తుంది మిస్సమ్మ.  దీంతో మరింత ఎమోషన్‌ అయిన అమర్‌ అయితే ఆరు.. ఆరులా అనిపించింది. గుండెల మీద తను వేసిన చేయి అచ్చం ఆరులానే అనిపించింది. తనను ఎంత మిస్‌ అవుతున్నానో నాకే తెలుసు. కానీ ఎందుకో తెలియదు తను నా చుట్టూనే ఉందన్న ఫీలింగ్‌ ఉంది. అంటూ అమర్‌ ఎమోషనల్ అవుతాడు.

గార్డెన్‌ లో ఆరు కోసం ఎదురు చూస్తున్న యముడు, గుప్తను బాలిక వచ్చిందా..? అని అడుగుతాడు. గుప్త నిర్లక్ష్యంగా రాలేదని సమాధానం ఇవ్వగానే యముడు కోపంగా  ఆ బాలికను తీసుకుని యమపురికి వెళ్లవలెనని నీకు ఉన్నదా..? లేదా..? గుప్తా అని యముడు అడుగుతాడు.   ఆ బాలిక కొరకు చూడకుండా నాకెందుకు లేదు అని చెప్తున్నావు. నిజము చెప్పు గుప్త. ఆ బాలిక సాకుతో నువ్వు కూడా ఇక్కడ సకల భోగాలు అనుభవిస్తున్నావు కదా..? అంటాడు.

గుప్త బాధగా ఏమని సెలవిచ్చితిరి ప్రభు.. ఆ మాట అనుటకు మీకు నోరు ఎటుల వచ్చింది ప్రభు. ఈ పాపుల మధ్య నేను నలిగిపోతుంటిని ప్రభు అంటూ తన కష్టాలు ఏకరువు పెడతాడు గుప్త. దీంతో యముడు అయితే ఆ బాలకిను త్వరగా కనిపెట్టి మన లోకమునకు తీసుకెళ్లవలెను అంటాడు. అందుకోసం యముడు పాముగా గుప్త పాముల పట్టేవాడిగా వేషాలు వేసుకుంటారు.  ఇంతటితో  నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Intinti Ramayanam Serial Today September 25th: ‘ఇంటింటి రామాయణం’ సీరియల్‌: జాబ్‌ కు రిజైన్‌ చేసిన అక్షయ్‌

Illu Illalu Pillalu Serial Today September 25th: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: రామరాజు మీద పగ తీర్చుకుంటానన్న విశ్వ

Gunde Ninda Gudi Gantalu Serial Today September 25th: ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌: రోహిణిని అనుమానించిన బాలు    

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను గల్లా పట్టుకుని నిలదీసిన కావ్య  

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తోసేసిన మిస్సమ్మ

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Big Stories

×