Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు వేములవాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే వేములవాడలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలో పర్యటించిన అనంతరం దర్శనం చేసుకుని ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తరవాత అతిథి గృహానికి చేరుకుని భోజనం చేసి తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు.
సీఎం షెడ్యూల్ విషయానికి వస్తే.. ఉదయం 9.45 గంటలకు హెలికాప్టర్ లో వేములవాడలోని గుడి చెరువు గ్రాండ్ వద్దకు చేరుకుంటారు. 9.55 గంటలకు దేవస్థానం అతిథి గృహానికి వెళతారు. ఉదయం 10.10 నుండి 11.45 గంటల వరకు రాజన్నను దర్శించుకుని, శంకుస్థాపనలు. ప్రారంభోత్సవాలు చేస్తారు. 11.55 గంటలకు ఎస్ ఆర్ఆర్ అతిథి గృహానికి వెళతారు. 12.30 నుండి 1.40 వరకు గుడి చెరువు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 1.45 గంటలకు తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ కు పయనం అవుతారు.
ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధికి ఇటీవల భారీగా నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వేములవాడ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోనే ఈ ఆలయం ప్రసిద్ది చెందినప్పటికీ పెద్దగా పట్టించుకోకపోవడంతో అభివృద్ధి జరగలేదని రేవంత్ సర్కార్ భావించింది. ఈ నేపథ్యంనే ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్దమౌతోంది.