E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మకు షాక్ ఇచ్చిన కడుపులో బిడ్డ

Nindu Noorella Saavasam Serial Today November 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మకు షాక్ ఇచ్చిన కడుపులో బిడ్డ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:       

అమర్‌, రామ్మూర్తిని ఇంటికి పిలిపించి మిస్సమ్మకు సీమంతం చేయడానికి ఇంటికి తీసుకెళ్లమని చెప్తాడు. దీంతో రామ్మూర్తి హ్యాపీగా ఫీలవుతాడు. వెంటనే ఇక నేను వెళ్తాను బాబు చాలా పనులున్నాయి.. ఇంటికి వెళ్లి చుట్టుపక్కల వాళ్లను బంధువులను పిలవాలి. పైగా శుభ లేఖలు కూడా వేయించాలి అని చెప్తాడు. దీంతో ఆశ్చర్యంగా రాథోడ్‌ సీమంతానికి శుభలేఖలు ఏంటి సార్‌ అని అడుగుతాడు. దీంతో రామ్మూర్తి బలే వాడివి రాథోడ్.. భాగీ పెళ్లి నాకు తెలియకుండా జరిగిపోయింది. ఆ పెళ్లికి నేను శుభలేఖలు కూడా పంచలేదు.. ఎవ్వరినీ పిలవలేదు ఏమీ చేయలేదు.. అందుకే ఇప్పుడు సీమంతాన్ని పెళ్లిలా చేద్దాం అనుకుంటున్నాను. నా అనుకున్న వాళ్లను పిలిచి విందు భోజనం పెడతాను.. అంగరంగవైభవంగా కార్యం జరిపిస్తాను అంటాడు.

దీంతో మిస్సమ్మ నాన్న అవి అన్ని ఎందుకు నాన్న మీకు ఊరికే ఖర్చు ఎక్కువ అవుతుంది అంటుంది. దీంతో రామ్మూర్తి నా దగ్గర ఉన్నాయి తల్లి.. నీ సీమంతం కోసం అని ఆరు నెలల నుంచి కష్టపడి కూడబెట్టాను అమ్మా.. ఆ పిల్లలు రేపు అందరూ రెడీ ఉండండి.. మీ అమ్మ వాళ్ల ఇంటికి వెళ్తున్నాము.. అని చెప్పగానే.. పిల్లలు థాంక్యూ తాతయ్య అంటారు. దీంతో రామ్మూర్తి నాకు కాదు పిల్లలు మీ నాన్నకు చెప్పండి ఆయన వల్లే మనం ఊరు వెళ్తున్నాం.. ఆయన వల్లే మనం ఈ సీమంతం చేయబోతున్నాం.. అంటూ అందరికీ చెప్పి రామ్మూర్తి వెళ్లిపోతుంటే.. రాథోడ్‌ ను వెళ్లి డ్రాప్‌ చేయమని చెప్తాడు అమర్‌. సరేనని రాథోడ్‌, రామ్మూర్తిని తీసుకుని బయటకు వెళ్లగానే.. అమర్ వచ్చి రామ్మూర్తికి సీమంతం కోసం డబ్బులు ఇస్తాడు. రామ్మూర్తి ఎందుకు బాబు అంటూ అడగ్గానే.. సీమంతం ఖర్చులకు అని అమర్‌ చెపగానే.. కార్యానికి సరిపడా డబ్బులు నా దగ్గర ఉన్నాయి బాబు అని రామ్మూర్తి చెప్పగానే..

Advertisement

ఆ డబ్బులు ఈ ఆరు నెలలు మీ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించి ఉంటారు. ఇంకా అప్పులు కూడా చేసి ఉంటారు.. అని అమర్‌ చెప్పగానే.. అయ్యో అలాంటిది ఏమీ లేదు బాబు అంటాడు రామ్మూర్తి. కానీ అమర్‌ నాకు తెలుసు మామయ్య ఈ వయసులో మేము మీకు ఇవ్వాలి కానీ మీ కష్టార్జితం మీరు మాకు ఇవ్వడం ఏంటి..? తీసుకోండి.. మీ మనసుకు నచ్చినట్టుగా సంతృప్తిగా ఏ లోటు లేకుండా సీమంతం జరిపించండి అని అమర చెప్పగానే.. నా కూతురు సీమంతం జరిపిస్తూ అల్లుడు గారి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి.. అంటాడు రామ్మూర్తి.

దీంతో అమర్‌ ఈ డబ్బులు అల్లుడిగా కాదు.. ఒక కొడుకుగా ఇస్తున్నాను.. మీకే ఒక కొడుకు ఉంటే తీసుకోరా చెప్పండి మీ కొడుగ్గా నేను మీ కష్టాన్ని పంచుకోకూడదా..? అని అమర్‌ చెప్పగానే.. రాథోడ్‌ కూడా తీసుకోండి సార్‌.. లేకపోతే మా సార్‌ బాధపడతారు అని చెప్పగానే.. రామ్మూర్తి  డబ్బులు తీసుకుని నేను కష్టపడకూడదని మీరు నాకు ఎన్నో చేశారు.. నిజంగా మీరు దేవుడి లాంటి వాళ్లు బాబు మీ రుణం ఎలా తీర్చుకోగలను అంటూ దండం పెడుతుంటే.. అయ్యో మామయ్య ఈ చేతులతో మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ ఇలా దండం పెట్టకూడదు.. జాగ్రత్త రాథోడ్‌ తీసుకెళ్లు.. అని చెప్పగానే. రాథోడ్‌ రామ్మూర్తిని తీసుకుని వెళ్లిపోతాడు.

Advertisement

తర్వాత పిల్లుల అందరూ గార్డెన్‌లో పుట్‌బాల్‌ అడుతుంటారు. వాళ్లను చూడటానిక వచ్చి మిస్సమ్మ గార్డెన్‌లో కూర్చుంటుంది. పిల్లలకు జాగ్రత్త చెప్తుంటుంది. మిస్సమ్మ దగ్గరకు వచ్చి అంజు మాట్లాడుతుంది. ఇంతలో  ఆనంద్‌ బాల్‌ ను గట్టిగా తోయడంతో అది మిస్సమ్మ వైపు వస్తుంటుంది. వెంటనే కడుపులో ఉన్న బిడ్డ అమ్మ బాల్‌ అని హెచ్చరిస్తుంది. ఆ వాయిస్‌ విన్న మిస్సమ్మ, అంజు షాక్‌ అవుతారు. ఇంతలో బాల్‌ మిస్సమ్మకు తగులబోతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

Big Stories

Advertisement
×