E-Paper
Advertisement

Jabalpur Crime: జబల్‌పూర్‌లో దారుణం.. రీల్స్ కోసం యువతుల కిడ్నాప్, ఆపై నరకం

Jabalpur Crime: జబల్‌పూర్‌లో దారుణం.. రీల్స్ కోసం యువతుల కిడ్నాప్, ఆపై నరకం
Advertisement

Jabalpur Crime:  సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ కావాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. కొందరికి అనుకోకుండా రాత్రికి రాత్రే అదృష్టం వరిస్తుంది. మరికొందరు ఎంత ప్రయత్నాలు చేసినా దూరంగా ఉంటారు. అందుకోసం వాళ్లు చేయని పనులు అన్నీఇన్నీకావు.  ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఉన్నాయి. కేవలం రీల్స్ కోసం కొందరు యువతులు ఓ గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. యువతులను కిడ్నాప్ చేసి వారిని కొట్టిన దృశ్యాలను సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి  జబల్‌పూర్‌లో వెలుగుచూసింది.

రీల్స్ కోసం యువతుల కిడ్నాప్

Advertisement

జబల్‌పూర్-గ్వారీ ఘాట్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు మహిళలు ఓ గ్రూపుగా ఏర్పడ్డారు.  కొద్దిరోజుల కిందట ముగ్గురు యువతులు..  ఇద్దరు యువతుల్ని బెదిరించి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారిని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి తమ ప్రతాపం చూపించారు. కిడ్నాప్ చేసిన యువతులను దారుణంగా కొట్టారు.

ఓ క్లిప్‌లో బాధితురాలి ముఖంపై పొగ తాగుతూ స్పష్టంగా కనిపించారు. మరో క్లిప్‌లో బాధితురాలిని చెంపదెబ్బ కొడుతూ దుర్భాషలాడారు. ఆ తతంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

Advertisement

జబల్‌పూర్‌లో లేడీ గ్యాంగ్ ఆరాచకాలు

చివరకు బాధిత యువతుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించి, జరిగినదంతా చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు, రంగంలోకి దిగేశారు. ముగ్గురు యువతులను అరెస్ట్ చేశారు. వారిని విచారించిన పోలీసులకు అసలు విషయాలు తెలిసి షాకయ్యారు. కేవలం సోషల్ మీడియాలో పాపులర్ కోసం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. తరచుగా అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడం, దాడులకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.

ALSO READ: ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. కారులో మంటు చెలరేగి డ్రైవర్ సజీవదహనం

నిందితులు కాంచ్‌ఘర్ ప్రాంతానికి చెందినవారు. అందులో ఇద్దరు మైనర్ బాలికలు కాగా, ఓ యువతి ఉంది. ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో యువతిని జైలుకు తరలించారు.ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఎవరికీ ఎలాంటి నేర చరిత్ర లేదని తేలింది. కేవలం తాము చేసిన రీల్స్‌లో లైక్స్ పొందడానికి మాత్రమే ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తేలింది.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×