E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today october 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమర్‌ కు షాక్‌ ఇచ్చిన ఆరు ఆత్మ

Nindu Noorella Saavasam Serial Today october 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమర్‌ కు షాక్‌ ఇచ్చిన ఆరు ఆత్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: రామ్మూర్తి మెల్లగా గేటు తెరుచుకుని అమర్‌ ఇంట్లోకి వస్తాడు. లాన్‌ వైపు చూస్తూ లోపలికి నడుస్తుంటాడు. కొంత దూరం వెళ్లాక ఆగిపోయి లాన్‌ వైపు చూస్తుంటాడు. ఇంతలో అంజు వచ్చి రామ్మూర్తి చేయి పట్టుకుని హాయ్‌ తాతయ్య ఎలా ఉన్నారు. అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది తల్లి అని అడుగుతాడు. దీతో అంజు నేను బాగున్నాను.. ప్రియమైన తాతయ్య మిస్సమ్మ కోసం వచ్చావు కదా అని అడుగుతుంది. అవునమ్మా తను ఇంట్లోనే ఉందమ్మా..? అని రామ్మూర్తి అడగ్గానే.. అంజు ఉంది కానీ మిస్సమ్మ గురించి నీకొక విషయం చెప్పాలి తాతయ్య అంటుంది.

ఏ విషయం అమ్మా చెప్పు.. అని రామ్మూర్తి అడగ్గానే.. లాన్‌ ఉంది కదా మిస్సమ్మ రోజూ అక్కడ నిల్చుని ఒకరితో మాట్లాడుతూ ఉంటుంది అని అంజు చెప్పగానే రామ్మూర్తి షాకింగ్‌ గా లాన్‌ వైపు చూస్తుంటాడు. ఇంతలో ఎవరితో అమ్మా అంజు అని అడుగుతాడు. దీంతో అంజు ఆత్మతో మా అమ్మ ఆత్మతో మాట్లాడుతూ ఉంటుంది. అని చెప్పగానే.. రామ్మూర్తి మరింత షాక్‌ అవుతాడు. లాన్‌ వైపు బాధగా చూస్తుంటాడు. ఈ విషయం ఎవరికి చెప్పినా నమ్మడం లేదు తాతయ్య.. డాడీ అమ్ము ఆకాష్‌, ఆనంద్‌ లకు చెప్పాను. మనోహరి ఆంటీకి కూడా చెప్పాను కానీ ఎవ్వరూ నమ్మడం లేదు.. అందరూ నా మాట కొట్టిపారేస్తున్నారు. మిస్సమ్మేమో తనలో తానే మాట్లాడుకుంటున్నానని అబద్దంచెప్తుంది. మిస్సమ్మ మాట్లాడుతుంది మా అమ్మతోనే తాతయ్య. కనీసం మీరైనా నమ్మండి తాతయ్య. నేను చెప్పేది నిజం తాతయ్య ఇప్పుడు కూడా మిస్సమ్మ, మా అమ్మ పైన మాట్లాడుకుంటున్నారు. అని అంజు చెప్పగానే రామ్మూర్తి పైకి చూస్తాడు.

Advertisement

ఇద్దరూ మాట్లాడుకుంటుంటారు. కావాలంటే మీరే వెళ్లి చూడండి అని అంజు చెప్పగానే.. భాగీ పైన ఉందా అమ్మా అని రామ్మూర్తి అడగ్గానే.. మా అమ్మ కూడా ఉంది తాతయ్య అని చెప్తుంది అంజు. దీంతో రామ్మూర్తి మెల్లగా ఇంట్లోకి వెళ్తాడు. హాల్లో పేపర్‌ చూస్తూ ఉన్న మనోహరిని చూడకుండా పైకి వెళ్తుంటాడు. రామ్మూర్తిని చూసిన మనోహరి ఇతను ఇప్పుడొచ్చాడేంటి.. పైగా నన్ను పట్టించుకోకుండా పైకి వెళ్తున్నాడు. కొంపదీసి అందరూ కలిసి పైన ఏమైనా మీటింగ్‌ పెట్టాడా..? అని మనసులో అనుకుంటుంది. ఇంతలో అమర్‌ వస్తాడు. మిస్సమ్మను పిలుస్తాడు. పై నుంచి మిస్సమ్మ, రామ్మూర్తి, వారితో పాటు ఆరు కూడా వస్తుంది.

మనోహరి పక్కకు వెళ్లి అనుమానంగా చూస్తుంది. రామ్మూర్తిని చూసిన అమర్‌ మీరెప్పుడొచ్చారు అని పలకరిస్తాడు. ఇందాకే వచ్చాను బాబు.. ఇప్పుడే భాగీ దగ్గరకు పైకి వెళ్లాను ఇంతలోనే మీరు వచ్చి పిలుస్తున్నారు.. అవునా భోజనం చేశారా..? అని అమర్‌ అడగ్గానే.. లేదు బాబు ఇంటి దగ్గరే చేసి వచ్చాను. అమ్మాయిని ఓ సారి చూడాలనిపించి చూసి వెళ్దామని వచ్చాను అని రామ్మూర్తి చెప్తుండగానే.. మిస్సమ్మ కల్పించుకుని ఏంటండి పిలిచారంటా..? నాతో ఏదైనా పనుందా..? లేదా మీకు ఏమైనా కావాలా..? అని అడుగుతుంది.  దీంతో అమర్‌ ఏం లేదు భాగీ నాకేం అవసరం లేదు.. నాకు కాస్త పని ఉంది. అందుకే నేను బయటకు వెళ్తున్నాను.. అది చెబుదామనే పిలిచాను.. అని అమర్‌ చెప్పగానే.. ఆ బాబు నేను కాస్తైయ్యాక వెల్లిపోతాను..అని రామ్మూర్తి చెప్పగానే.. అయ్యో ఉండండి మెల్లగా వెళ్దురు.. భాగీ మీ నాన్నకు ఏం కావాలో చూసుకో..? ఇవాళేం వెళ్లనీయోద్దు అంటూ అమర్‌ బయటకు వెల్లబోతుంటే..

Advertisement

అక్కడే ఉన్న ఆరు క్షేమంగా వెళ్లి  లాభంగా రండి అంటుంది. ఇంతలో అమర్ కు  సోఫా తగిలి కింద పడబోతుంటే.. ఆరు పట్టుకుంటుంది. అమర్‌ కింద పడకుండా అలాగే ఉండిపోతాడు. తనను పట్టుకుంది ఆరు అని తెలిసి అమర్‌ షాక్‌ అవుతాడు. పక్కనే చూస్తున్న మనోహరి షాకింగ్‌ గా కింద పడబోయిన అమరేంద్ర గాలిలోనే ఉన్నాడేంటి..?  ఆరు పట్టుకుందా..? ఇప్పుడు ఆరు గురించి అందరికీ తెలిసిపోతుందా..? అనుకుంటూ భయపడుతుంది మనోహరి. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Big Stories

Advertisement
×