E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today october 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ను కిడ్నాప్‌ చేసి చంపబోయిన రణవీర్‌  

Nindu Noorella Saavasam Serial Today october 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ను కిడ్నాప్‌ చేసి చంపబోయిన రణవీర్‌  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   అమర్ కు  సోఫా తగిలి కింద పడబోతుంటే.. ఆరు పట్టుకుంటుంది. అమర్‌ కింద పడకుండా అలాగే ఉండిపోతాడు. దూరం నుంచి చూస్తున్న మనోహరి షాకింగ్‌ గా కింద పడబోయిన అమరేంద్ర గాలిలోనే ఉన్నాడేంటి..?  ఆరు పట్టుకుందా..? ఇప్పుడు ఆరు గురించి అందరికీ తెలిసిపోతుందా..? అనుకుంటూ భయపడుతుంది. అమర్‌ తన చేయి పట్టుకుంది ఎవరా అని తిరిగి చూసే సరికి అక్కడ మిస్సమ్మ అమర్‌ చేయి పట్టుకుని ఉంటుంది. కాస్త చూసి వెళ్లండి అని చెప్తుంది మిస్సమ్మ.. అంతా చూస్తున్న మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. ఇంతలో అమర్‌ వెళ్లబోతుంటే.. ఆయనను ఆపు భాగీ కాసేపు కూర్చుని వెళ్లమను అని ఆరు చెప్పగానే.. మిస్సమ్మ ఆగండి ఒక్క నిమిషం కూర్చుని వెళ్లమని చెప్తున్నారు అని అనగానే..

అమర్‌ అనుమానంగా ఎవరు చెప్తున్నారు అని అడుగుతాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో రామ్మూర్తి అంటే నేనే చెప్పమని చెప్పాను అల్లుడు గారు అంటాడు. బయటకు వెళ్లేటప్పుడు ఇలా జరగడం అరిష్టం. కాసేపు కూర్చుని మంచినీళ్లు తాగి వెళ్లమని చెప్పు అంటుంది ఆరు. మిస్సమ్మ కూడా అలాగే కాసేపు ఆగి వాటర్‌ తాగి వెళ్లమని చెప్తున్నారండి అంటుంది. దీంతో మనోహరి కోపంగా మిస్సమ్మను చూస్తుంది. అమర్‌ అసహనంగా ఎవరు చెప్తున్నారు అని అడుగుతాడు. దీంతో రామ్మూర్తి నేనే నేనే బాబు అంటాడు. దీంతో అమర్‌ మీరే డైరెక్టుగా చెప్పొచ్చు కదా అంటాడు. దీంతో రాథోడ్‌ మిస్సమ్మతో చెప్పిస్తే బాగుంటుందని సార్‌ అభిప్రాయం అంటాడు. మిస్సమ్మ అవును అంటుంది. ఇంతలో అమర్‌ నేను ఎందుకు ఆగాలి అని అడగ్గానే..

Advertisement

బయటకు వెళ్లేటప్పుడు ఇలా జరగడం అరిష్టం అంట అండి అని మిస్సమ్మ చెప్పగానే.. అమర్‌ నాకు అలాంటి పట్టింపులు లేవు పద రాథోడ్ అని అమర్‌ చెప్పి వెళ్లిపోతాడు. దీంతో ఆరు గట్టిగా భాగీ ఆయన వెళ్లిపోతున్నారు ఆయన్ని ఆపు అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ ఆయన ఆగరు అక్కా  ఎప్పుడూ ఇంతే అంటుంది. రామ్మూర్తి మాత్రం అక్కను కంగారు పడొద్దని చెప్పు అమ్మ అల్లుడు గారు మిలటరీ ఆఫీసరు ఆయన్ని ఎవరు ఏం చేస్తారు చెప్పు అంటాడు. అవును అక్కా నువ్వు ధైర్యంగా ఉండు ఆయన క్షేమంగా వెళ్లి లాభంగా వస్తారు అని చెప్తుంది. ఇంతలో రామ్మూర్తి అమ్మా భాగీ ఒకసారి మీరంతా కలిసి మన ఇంటికి రావాలమ్మా భోజనం చేసి వెళ్దురు కానీ అని చెప్పగానే.. మిస్సమ్మ అలాగే నాన్న అంటుంది.

దూరం నుంచి అంతా గమనిస్తున్న మనోహరి ఇరిటేటింగ్‌ గా వీళ్లను చూస్తుంటే.. నాకు పిచ్చి ఎక్కిపోతుంది. ఏ క్షణంలో అమరేంద్రకు నిజం తెలిసిపోతుందోనని నాకు టెన్షన్‌ గా ఉంది. అనుకుంటూ లోపలికి వెళ్లి రణవీర్‌కు కాల్ చేస్తుంది. ఫోన్‌ లిఫ్ట్ చేసిన రణవీర్‌ చెప్పను మనోహరి అని అడగ్గానే కోపంగా మనోహరి ఏంటి చెప్పేది ఇక్కడ జరిగేది చూస్తుంటే.. టెన్షన్‌తో నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి అంటుంది. కూల్‌ గా రణవీర్‌ ఏం జరుగుతుంది అని అడగుతాడు. భాగీ తనకు కనిపిస్తున్న అరుంధతి ఆత్మను అందిరికీ తెలిసేలా ప్రవర్తిస్తుంది. ఆత్మ విషయం అందరికీ తెలిసిపోయేలా ఉంది. అమర్‌కు కూడా ఎక్కడ తెలిసిపోతుందో అని భయంతో చచ్చిపోతున్నాను.. అంటుంది. దీంతో రణవీర్‌ కంగారు పడకు మనోహరి అమరేంద్రకు తెలిసేలోగా అమరుడు అయిపోతాడు అని చెప్పగానే.. మనోహరి అర్తం కానట్టు ఏంటి..? ఏమన్నావు అంటుంది.

Advertisement

దీంతో రణవీర్‌ ఏం లేదులే మనోహరి  త్వరగా మన ప్లాన్‌ ను అమలు చేద్దాం అంటున్నాను.. అంటాడు రణవీర్‌.. భాగీకి స్పాట్‌ పెడదాం అని అనుకున్నాం కదా ఆ చంభా ఏం చేస్తుంది వెంటనే మన ప్లాన్‌ ను అమలు చేయమని చెప్పు అంటుంది మనోహరి.. ఏదో ఒక ప్లాన్‌ అమలు చేద్దాం లే మనోహరి నువ్వేం టెన్షన్‌ పడకు అంటాడు రణవీర్‌. ఏదో ప్లాన్‌ ఏంటి.. మళ్లీ వునే ఏమైనా ప్లాన్‌ చేయబోతున్నారా..? ఏం చేయబోతున్నారు అంటూ మనోహరి అడగ్గానే.. అది ముందే చెప్తే అందుకే అమరేంద్రను లేపేసి చెప్తాను అని మనసులో అనుకుంటాడు రణవీర్‌. మనోహరి మాత్రం రణవీర్‌ చెప్పు ఏం చేయబోతున్నారు.. నెక్ట్స్‌ టార్గెట్‌ భాగీనే అని కదా అనుకున్నాం.. దాన్నే కదా లేపేయబోతున్నాం అని అడుగుతుంది. ముందు అనుకున్న ప్లానే అమలు చేయబోతున్నాం. నువ్వే వర్రీ అవ్వకు అని రణవీర్‌ చెప్పగానే.. త్వరగా ఏదో ఒకటి చేసేయ్‌ రణవీర్‌. అమర్‌కు నిజం తెలిసే లోపు అంతా జరిగిపోవాలి అని చెప్తుంది. అలాగే త్వరలో అంతా ముగిసిపోతుంది అని చెప్పగానే మనోహరి కాల్‌ కట్‌ చేస్తుంది.

తర్వాత రణవీర్‌, చంభా వెళ్లి కేఫ్‌ దగ్గర ఉన్న అమర్‌ను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి ఒక దగ్గర కట్టిపడేసి చంపాలని చూస్తారు. ఇంతలో అక్కడికి ఆరు ఆత్మ వస్తుంది. రణవీర్‌ కత్తితో అమర్‌ను చంపేయబోతుంటే.. అమర్‌లోకి ఆరు ఆత్మ ప్రవేశించి.. కట్టు విప్పుకుని రౌడీలను రణవీర్‌ను కొడుతుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చి కిటికీలోంచి చూస్తున్న మనోహరి అమర్‌లో ఉన్న ఆరు కోపంగా చూస్తుంది. మనోహరి భయపడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×